MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రజనీకాంత్ కు ఫస్ట్ సాంగ్ రాసింది ఎవరో తెలుసా? ఆల్ రౌండర్ సక్సెస్ స్టోరీ

రజనీకాంత్ కు ఫస్ట్ సాంగ్ రాసింది ఎవరో తెలుసా? ఆల్ రౌండర్ సక్సెస్ స్టోరీ

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పిన మొదటి మాస్ ఓపెనింగ్ సాంగ్ వెనుక ఉన్న 'సీక్రెట్ మాస్టర్‌మైండ్'  ఎవరో తెలుసా? సంగీతం, దర్శకత్వం, పాటలతో  ఇండస్ట్రీని ఏలిన ఈ సకలకళా వల్లభుడి సక్సెస్ స్టోరీ ఏంటి.?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 06 2026, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయి
Image Credit : our own

రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయి

తమిళ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పవాళ్లు వచ్చారు, వెళ్లారు. కానీ ఒకేసారి పాటల రచయిత, సంగీత దర్శకుడు, డైరెక్టర్, సింగర్, స్క్రీన్‌ప్లే రైటర్, నటుడిగా.. ఇలా అన్నింట్లోనూ సత్తా చాటిన 'సకలకళా వల్లభులు' కొందరే. ఆ లిస్టులో ముందుండే వ్యక్తే గంగై అమరన్. ఇళయరాజా తమ్ముడైన ఈయన అసలు పేరు 'అమర్ సింగ్'. రజనీకాంత్ కెరీర్‌లో ఓ చారిత్రక మైలురాయికి ఈయనే పునాది వేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రజనీకాంత్ మొదటి పాట!
Image Credit : X

రజనీకాంత్ మొదటి పాట!

1978లో డైరెక్టర్ మహేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'ముల్లుం మలరుం' సినిమా రజనీకాంత్ యాక్టింగ్ కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటివరకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న రజనీని, పూర్తిస్థాయి మాస్ హీరోగా జనంలోకి తీసుకెళ్లిన సినిమా ఇది. ఈ సినిమాలో రజనీ మాస్ ఇమేజ్‌ను, ఆయన హీరోయిజాన్ని ఆకాశానికి తీసుకెళ్లిన పాట 'రామే ఆండాలుం రావణే ఆండాలుం ఎనకు ఒరు కవలై ఇల్లే...'. ఈ  పాటకు అద్భుతమైన సాహిత్యం అందించింది గంగై అమరనే! అన్న ఇళయరాజా సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతుతో ఈ పాట మార్మోగిపోయింది. రజనీ స్టైల్‌కు తగ్గట్టుగా గంగై అమరన్ రాసిన ఈ పాట, ఆయన హీరో జర్నీలో ఓ చెరగని ముద్ర వేసింది.

35
2500+ పాటలు, 180+ సినిమాలు
Image Credit : Asianet News

2500+ పాటలు, 180+ సినిమాలు

అన్న ఇళయరాజా నీడలో ఉండిపోకుండా, గంగై అమరన్ తనకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు అమోఘం. పాటల రచయితగా  2500+ పాటలు, సంగీత దర్శకుడిగా 180 సినిమాలకి పైగా అద్భుతమైన సంగీతం అందించారు.

45
కోలీవుడ్‌ను షేక్ చేసిన 'డైరెక్టర్'
Image Credit : Youtube

కోలీవుడ్‌ను షేక్ చేసిన 'డైరెక్టర్'

పాటలు, సంగీతం మాత్రమే కాదు, గంగై అమరన్ డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. 1982లో 'కోళి కూవుదు' సినిమాతో దర్శకుడిగా పరిచయమై, పల్లెటూరి కథలతో తనదైన ముద్ర వేశారు. దీనికి పరాకాష్ట 1989లో వచ్చిన కరగాట్ట సినిమా. ఈ మూవీ థియేటర్లలో ఏడాదికి పైగా ఆడి రికార్డు సృష్టించింది. ఇలా ఎన్నో హిట్ సినిమాలను ఆయన డైరెక్ట్ చేశారు. 

55
నిజమైన ఆల్-రౌండర్
Image Credit : our own

నిజమైన ఆల్-రౌండర్

పాటల రచయిత, సంగీత దర్శకుడు, డైరెక్టర్ మాత్రమే కాదు.. ఆయనొక గొప్ప గాయకుడు, నటుడు, స్క్రీన్‌ప్లే రచయిత కూడా. ఇలా సినిమాకు కావాల్సిన అన్ని అర్హతలున్న 'సకలకళా వల్లభుడు' గంగై అమరన్. ఓ సాధారణ పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చి, ఇళయరాజా, రజనీకాంత్ లాంటి ఇద్దరు దిగ్గజాల విజయాల్లో కీలక పాత్ర పోషించి, తానూ ఓ ప్రత్యేకమైన దర్శకుడిగా నిలిచిన గంగై అమరన్ కథ.. తమిళ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Peddi Piracy: HD క్వాలిటీతో పెద్ది పైరసీ.. రిలీజ్ అయిన రెండో రోజే రామ్ చరణ్ టీమ్ కు భారీ షాక్..
Recommended image2
Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved