- Home
- Entertainment
- సమ్మర్ క్లాత్స్ తో ఇక్కడ మహేష్, సితార రచ్చ.. అమెరికాలో క్లాస్ మేట్‌తో గౌతమ్ ఫైర్, ఇలా ఎప్పుడు చూసి ఉండరు
సమ్మర్ క్లాత్స్ తో ఇక్కడ మహేష్, సితార రచ్చ.. అమెరికాలో క్లాస్ మేట్‌తో గౌతమ్ ఫైర్, ఇలా ఎప్పుడు చూసి ఉండరు
సూపర్ స్టార్ మహేష్ బాబు, సితారలు ఇక్కడ దుమ్ములేపుతుంటే. అమెరికాలో క్లాస్ మేట్‌తో గౌతమ్ రచ్చ చేస్తున్నాడు. వీరి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఏం చేస్తున్నారంటే?

mahesh babu, sitara, gautam,
మహేష్ బాబు ఫ్యామిలీ అంతా యాక్టింగ్‌లో దూసుకుపోతున్నారు. మహేష్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. నమ్రత ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడు ఫ్యామిలీకే పరిమితమవుతుంది. కమర్షియల్ యాడ్స్ లో సితార అడపాదడపా కనిపిస్తూనే ఉంది. తాజాగా మహేష్, సితార ఇక్కడ రచ్చ చేస్తే, కొడుకు గౌతమ్ అమెరికాలో చేసిన రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు.
mahesh babu
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఓరిస్సాలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చింది. ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు మహేష్. ఇప్పుడు మరో లుక్‌లో అలరిస్తున్నారు. తాజాగా ఆయన తన కూతురితో కలిసి రచ్చ చేశారు.
mahesh babu, sitara
కూతురు సితారతో కలిసి రిలయన్స్ ట్రెండ్స్ యాడ్ చేశారు మహేష్. ఇందులో న్యూ టైమ్స్, న్యూ ట్రెండ్ పేరుతో కొత్త డ్రెసెస్‌ని ఆవిష్కరించారు. సమ్మర్ స్పెషల్‌గా దీన్ని డిజైన్ చేశారు. విభిన్నరకాలైన ఈ సమ్మర్ వేర్‌ని సరికొత్తగా ఆవిష్కరించారు. ఈ డ్రెస్ ల్లోధరిస్తూ మహేష్, సితారచేసిన రచ్చ మామూలుగా లేదు. తండ్రి కూతురు కలిసి రెచ్చిపోయారని చెప్పొచ్చు.
mahesh babu
ఇక ఇందులో మహేష్ బాబు చాలా స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆకట్టుకున్నారు. ఆయన నయా గెటప్ అదిరిపోయేలా ఉంది. రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అయిన తీరు బాగుంది. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. దీనికితోడు సితార చాలా పెద్దదైపోయింది. ఆమెకి హీరోయిన్ రేంజ్‌లో కనిపిస్తుంది. హీరోయిన్లకి ఏమాత్రం తక్కువ లేదు. చూడబోతుంటే ఆమె ఎంట్రీ త్వరలో ఉంటుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
mahesh babu
ఇదిలా ఉంటే తండ్రి కూతురు ఇక్కడ రిలయన్స్ యాడ్స్ కోసం రచ్చ చేస్తే, అమెరికాలో గౌతమ్ తన క్లాస్ మేట్‌తో అదరగొడుతున్నాడు. ఆయన తన క్లాస్ మేట్‌తో కలిసి యాక్టింగ్ చేశాడు.
gautam ghattamaneni
ప్రస్తుతం గౌతమ్ న్యూయార్క్ లో(న్యూ యార్క్ టీచ్ స్కూల్) యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అందులో భాగంగా ఆయన తన క్లాస్ మేట్ కాస్వి రమణితో కలిసి బ్రెయిన్ వాష్డ్ అనే స్కిట్ చేశారు గౌతమ్. ఇందులో వీరిద్దరు హోటల్ టేబుల్‌పై కూర్చున్నారు. గౌతమ్ ప్రారంభం నుంచే అరుస్తున్నాడు. ఆమెని తినకుండా చేశాడు. వెళ్లిపోయాడు.
kasvi ramani
ఆ తర్వాత ఆ అమ్మాయి ఖాళీ ప్లేట్‌లో తింటున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఏదో మాట్లాడుతుంది. ఆమె బ్లడ్ ఎక్కించుకుంటూ ఇలా బిహేవ్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో గౌతమ్ లుక్ అదిరిపోయింది. హీరో లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ లో ఇంకా బెటర్ కావాల్సి ఉంది.
read more: ఆ హీరోయిన్ చీర లాగి, బట్టలు చించి చుక్కలు చూపించిన కృష్ణంరాజు.. సెట్‌లో నరకం చూసిన ఆ నటి ఎవరు?
also read: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వివాదంలో బాలకృష్ణ.. 80లక్షలు కోల్పోయానంటూ బాధితుడి ఆరోపణలు