MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్ వివాదంలో బాలకృష్ణ.. 80లక్షలు కోల్పోయానంటూ బాధితుడి ఆరోపణలు

బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్ వివాదంలో బాలకృష్ణ.. 80లక్షలు కోల్పోయానంటూ బాధితుడి ఆరోపణలు

Balakrishna Betting app: బెట్టింగ్‌ యాప్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతుంది. అయితే దీన్ని ప్రమోట్‌ చేసిన వారిలో బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తుంది. ఆయనపై ఓ బాధితుడు ఆరోపణలు చేస్తున్నాడు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 21 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
balakrishna (aha unstoppable show )

balakrishna (aha-unstoppable show )

Balakrishna Betting app: బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇందులో చిన్న చిన్న సెలబ్రిటీల నుంచి బిగ్‌ స్టార్స్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఓ బాధితుడు బాలయ్యపై ఆరోపణల చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
harsha sai, Vishnu Priya, rithu Chowdary, tasty teja, Pallavi Prashanth,

harsha sai, Vishnu Priya, rithu Chowdary, tasty teja, Pallavi Prashanth,

బెట్టింగ్‌ యాప్స్ కారణంగా చాలా మంది అమాయకులు బలవుతున్నారు. బెట్టింగ్‌ ఆడుతూ లక్షలు కోల్పోతున్నారు. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దానికి కారణం చాలా మంది పేరున్న సెలబ్రిటీలు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయడమే.

దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే టీవీ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసుు నమోదు చేశారు. విష్ణు ప్రియా, సుప్రీత, రీతూ చౌదరీ, సన్నీ యాదవ్‌, టేస్టీ తేజ, పరేషాన్‌ బాయ్స్, సన్నీ యాదవ్‌ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. వీరిని పోలీసులు విచారించారు. 

36
balakrishna (aha-unstoppable show )

balakrishna (aha-unstoppable show )

ఈ క్రమంలో బిగ్ స్టార్స్ పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ పేర ప్రస్తావన వచ్చింది. ఆయన దీనిపై స్పందించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని, లీగల్‌గా పర్మీషన్‌ ఉన్న యాప్స్ నే ప్రమోట్‌ చేసినట్టు పీఆర్‌ టీమ్‌ వెల్లడించింది.

ఇప్పుడు బాలకృష్ణ పేరు తెరపైకి వస్తుంది. ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఓ బాధితుడు ఏకంగా బాలయ్య ప్రమోట్‌ చేసిన యాప్‌ కారణంగా తాను 80 లక్షలు కోల్పోయానని ఆరోపిస్తున్నాడు. 

read  more: విజయ్ దేవరకొండ ఇల్లీగల్ గా చేయలేదు, సుప్రీంకోర్టే చెప్పింది..బెట్టింగ్ యాప్స్ వివాదంపై అతడి టీమ్ కామెంట్స్
 

46
balakrishna, betting app (photo credit big tv)

balakrishna, betting app (photo credit big tv)

నెల్లూరుకి చెందిన శ్రీరామ్‌ బాబు అనే వ్యక్తి `ఆహా` అన్‌ స్టాపబుల్‌ షోలో బాలకృష్ణ ప్రమోట్‌ చేసిన `ఫన్‌88` అనే యాప్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకుని తాను బెట్టింగ్‌ ఆడినట్టు తెలిపారు. ఆ యాప్‌ వల్ల తాను 80 లక్షల వరకు నష్టపోయినట్టు చెబుతున్నాడు.

మొదట్లో పది వేలు పెడితే 18 వేలు వచ్చాయట. ఆ తర్వాత మళ్లీ డబ్బులు వచ్చాయట. ఇలా ఆడుకుంటూ వెళ్తుంటే చాలా నష్టపోతున్నానని, ఫ్యామిలీ బంధువుల వద్ద అప్పులు తెచ్చి బెట్టింగ్‌లో పెట్టినట్టు తెలిపారు.
 

56
TS RTC MD Sajjannar

TS RTC MD Sajjannar

దారుణంగా నష్టపోవడంతో సూసైడ్‌ కూడా చేసుకోవాలనుకున్నాను అని,  సజ్జనార్‌ అవగాహన కల్పిస్తూ భరోసా ఇస్తున్న నేపథ్యంలో తాను బయటకు వచ్చినట్టు తెలిపారు. బీగ్ టీవీ ముందు ఈ విషయాన్ని శ్రీరామ్‌ బాబు అనే వ్యక్తి వెల్లడించారు.  హీరోలు సెలబ్రిటీలు ప్రమోట్‌ చేయడం వల్లే మాలాంటి వాళ్లు ఇలాంటి బెట్టింగ్‌ యాప్‌లను నమ్ముతున్నామని తెలిపారు.

బెట్టింగ్‌ ఆడుతున్నామని తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో ఇన్నాళ్లు రాలేదని, సజ్జనార్‌ సార్‌ బరోసా ఇవ్వడంతో ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చానని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టు తెలిపారు.

66
balakrishna, betting app (photo credit big tv)

balakrishna, betting app (photo credit big tv)

తమలాంటి వారికి న్యాయం చేయాలని, ఎవరూ ఇలాంటి బెట్టింగ్‌ యాప్‌లను నమ్మొద్దని, సెలబ్రిటీలు కూడా వీటిని ఎంకరేజ్‌ చేయోద్దని ఆయన వెల్లడించారు. శ్రీరామ్‌ బాబు ఆరోపణలతో ఇప్పుడు బాలయ్య చుట్టూ, `ఆహాలోని అన్‌ స్టాపబుల్‌ షో చుట్టూఈ వివాదం రాజుకుంది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

read  more: `టుక్‌ టుక్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌
also read: రష్మిక, నయనతారలకు షాక్‌.. రెండేళ్లుగా సినిమాల్లేవ్‌ అయినా ఆమెనే నెం 1.. ఇండియా టాప్‌ 10 హీరోయిన్స్ లిస్ట్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
రియాలిటీ కార్యక్రమాలు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image3
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved