MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందంటగా.. సమంత చిలిపి ప్రశ్నకు మహేష్ బాబు పంచ్ కౌంటర్.. ఇచ్చిపడేశాడుగా!

Mahesh Babu: షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందంటగా.. సమంత చిలిపి ప్రశ్నకు మహేష్ బాబు పంచ్ కౌంటర్.. ఇచ్చిపడేశాడుగా!

Mahesh Babu: సూపర్ స్టార్ సిక్స్ ప్యాక్ గురించి చిలిపి ప్రశ్నలు వేసింది స్టార్ హీరోయిన్ సమంత. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సామ్ అడిగిన ప్రశ్నలకు సూపర్ స్టార్ కూడా అదిరిపోయే సమాధానాలు ఇచ్చారు. ఓ పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 09 2026, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మహేష్ బాబుకు సమంత చిలిపి ప్రశ్నలు..
Image Credit : Asianet News

మహేష్ బాబుకు సమంత చిలిపి ప్రశ్నలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతోనే కాదు, వేదికలపై ఆయన ఇచ్చే టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటారు. గతంలో మహేష్ బాబు, నటి సమంత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకే వేదికపై సందడి చేసిన సమయంలో సమంత అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు ఇచ్చిన కౌంటర్లు, పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ సమంత ఏం అడిగింది? మహేష్ ఏమన్నాడో చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?
Image Credit : Asianet News

మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?

టాక్ షోలో సమంత మహేష్ బాబును చాలా చిలిపి ప్రశ్నలు అడిగింది. నవ్వుతూ మహేష్‌ను ఒక ప్రశ్న అడిగారు: "మీరు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి పనిచేశారు కదా, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇప్పుడు నేను మీ ముందే ఉన్నాను కాబట్టి నా పేరే చెప్పాల్సిన అవసరం లేదులేండి" అంటూ సరదాగా మాట్లాడారు. దానికి మహేష్ బాబు అస్సలు తగ్గకుండా — "నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే.. నాతో నటించి, నన్ను పెళ్లి చేసుకున్న ఆ ఒక్కరే (నమ్రతా శిరోద్కర్)" అంటూ సమయస్ఫూర్తితో సావేజ్ రిప్లై ఇచ్చారు. దాంతో సమంతతో పాటు అక్కడ ఉన్న వేదికంతా నవ్వులతో నిండిపోయింది.

34
షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందా?
Image Credit : Asianet News

షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందా?

మహేష్ బాబు ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ — "మీ షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందంటగా.. అందరూ చెబుతున్నారు, మేము ఎప్పుడు చూడాలి?" అని సమంత ప్రశ్నించగా.. "ఎవరూ చూడరు" అంటూ మహేష్ సింపుల్‌గా చెప్పేయడంతో సమంత సరదాగా డిజప్పాయింట్ అయ్యారు.

మీ సినిమాలు హాలీవుడ్‌కి ఈక్వల్

ఆ తర్వాత సమంత మహేష్ బాబు సినిమాలను పొగుడుతూ — "మీ సినిమాలు చూస్తుంటే ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమాల్లా అనిపిస్తాయి" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. దానికి మహేష్ వెంటనే స్పందిస్తూ — "ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరూ షెడ్‌కి వెళ్ళిపోతున్నారు.. నేను మాత్రం వెళ్ళాలనుకోవడం లేదు. తెలుగు సినిమాలు చాలా బాగున్నాయి, బాగా ఆడుతున్నాయి" అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

44
రాబోయే సినిమాలో నేను హీరోయిన్‌నా?
Image Credit : Asianet News

రాబోయే సినిమాలో నేను హీరోయిన్‌నా?

మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి ప్రస్తావిస్తూ.. "మీరిద్దరూ చేస్తున్న సినిమాలో నేను హీరోయిన్‌నా?" అని సమంత అడిగారు. దానికి మహేష్ నవ్వుతూ — "మేము సినిమా చేస్తున్నాం కానీ, నువ్వు అందులో హీరోయిన్‌వో కాదో మాకు తెలీదు" అని సమాధానమిచ్చారు. అంతేకాకుండా, తర్వాతి సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోందని, ఆమె చాలా బాగా చేసిందని చెప్పారు. దాంతో సమంత "ఇది నన్ను ఎవరూ అడగలేదు, కొంచెం ఎడిట్ చేస్తే బాగుంటుంది" అని కామెడీగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. మహేష్ బాబు ఇచ్చిన ఈ పంచ్ డైలాగులు, సమంత క్యూట్ రియాక్షన్లు, పక్కనే ఉన్న త్రివిక్రమ్ నవ్వులు ఈ పాత వీడియో వైరల్ అయ్యేలా చేస్తూన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
సమంత రూత్ ప్రభు
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Related Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved