- Home
- Entertainment
- వారణాసి మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? మహేష్ బాబు , ప్రియాంక సినిమా పై రాజమౌళి బిగ్ అప్‌డేట్..
వారణాసి మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? మహేష్ బాబు , ప్రియాంక సినిమా పై రాజమౌళి బిగ్ అప్‌డేట్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. ఈ సినిమాపై రాను రాను బజ్ పెరుగుతోంది. శ్రీరామనవమికి రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

వారణాసి రిలీజ్ డేట్ బజ్
వారణాసి సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి సినిమాను ఏప్రిల్ 9, 2027న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. మార్చి 26, 2026న శ్రీరామనవమి సందర్భంగా ఓ స్పెషల్ అప్‌డేట్ రానుందట. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
టీజర్ లాంచ్, గ్లోబల్ స్పాట్‌లైట్
నవంబర్‌లో హైదరాబాద్‌లో వారణాసి ఫస్ట్ టీజర్ రిలీజై భారీ బజ్ క్రియేట్ చేసింది. జనవరి 5న పారిస్‌లోని లీ గ్రాండ్ రెక్స్ థియేటర్‌లో దీన్ని ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా వారణాసి చరిత్ర సృష్టించింది.
సినిమా కథ, పాత్రలు, స్కేల్
టీజర్‌లో మహేష్ బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమా భారీ అడ్వెంచర్‌గా మూవీగా తెరకెక్కబోతోంది. ఈసినిమాకు దాదాపు 1500 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.
సూపర్ ఫాస్ట్ గా వారణాసి షూటింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమా షూటింగ్ ఎలాంటి హడావుడి లేకుండా.. కామ్ గా పూర్తవుతోంది. జక్కన్న ఈసారి చాలా స్పీడ్ గా సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయన కెరీర్ లోనే ఈసినిమా సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేసిన రికార్డ్ సాధించబోతుంది. షూటింగ్ అయితే అయిపోతుంది కానీ.. ఇప్పటి వరకూ ఈసినిమా లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించి, ఇతర పాత్రలపై రాజమౌళి ఎటుంటి అధికారిక ప్రకటన చేయలేదు, క్లారిటీ కూడా ఇవ్వలేదు.

