అనిల్ రావిపూడి 500 కోట్ల సినిమా, ఏ హీరోతో చేయబోతున్నాడో తెలుసా? నిజమెంత?
టాలీవుడ్ లో రాజమౌళి తరువాత తిరుగులేని డైరెక్టర్ ఎవరంటే? అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. ప్రస్తుతం అనిల్ కోసం నిర్మాతలు, స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. మరి ఈ దర్శకుడు నెక్ట్స్ సినిమా ఎవరితో?

అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్.
ప్రతి సంక్రాంతికి సీనియర్ హీరోలతో సినిమాలు చేసి.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు అందుకోవడం దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేకతగా మారింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు అనిల్. వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటున్న ఈ దర్శకుడు.. గత ఏడాది వెంటకేష్ తో .. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సుమారు 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాడు. అదే ఊపుతో సంక్రాంతి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. ఈ ఏడాది సంక్రాంతికి కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ద్వారా మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఎవరితో?
వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నాడు అనిల్ రావిపూడి.. కెరీర్ లో ఫెయిల్యూర్ అంటూ ఎరుగని ఈ దర్శకుడికి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ లిస్ట్ లో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ.. వారికి బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్న అనిల్.. నెక్ట్స్ మూవీ కూడా మరో సీనియర్ హీరో నాగార్జునతో ఉంటుంది అని టాక్ గట్టిగా వినిపించింది. కింగ్ నాగార్జునకు చాలా కాలంగా సక్సెస్ లేదు. ప్రస్తుతం ఆయన 100 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత అనిల్ తో మూవీ ఫిక్స్ అయ్యిందన్న సమాచారం ఉంది. అఫీషియల్ గా మాత్రం ఈ విషయం బయటకు రాలేదు.
అనిల్ హాలో బ్రదర్ రీమేక్ ఎప్పుడు?
అనిల్ మాత్రం నాగార్జునతో సినిమా ఉంటుంది కానీ ఎప్పుడు అనేది క్లారిటీ ఇ్వవలేదు. కింగ్ తో హలో బ్రదర్ రీమేక్ చేసి.. అభిమానులకు భారీ ట్రీట్ ఇస్తానన్నాడు స్టార్ డైరెక్టర్. అయితే అనిల్ నెక్ట్స్ సినిమా మాత్రం నాగార్జునతో ఉండకపోవచ్చు అంటున్నారు. హాలో బ్రదర్ రీమేక్ కోసం ఇంకాస్త టైమ్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసినిమా కింగ్ కెరీర్ లో మెమరబుల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాట యంగ్ డైరెక్టర్. ఈ లిస్ట్ లో తాజాగా మరో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. అవి కూడా మెగా హీరోలవే కావడం విశేషం. అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ రామ్ చరణ్ తో కానీ..పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో కానీ ఉంటుందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. .
పవన్ కళ్యాణ్ తో అనిల్ రావిపూడి సినిమా..
అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందన్న అంశం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆయన తదుపరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఉండబోతుందనే టాక్ జోరుగా నడుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం. ఈసినిమా 500 కోట్ల టార్గెట్ తో.. అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. గతంలో అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాను తెరకెక్కించాడు. ఆ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, ఇప్పటికీ మహేష్ బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొనసాగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా నిజం అయితే.. అనిల్ పవన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడన్నది ఉత్కంఠను పెంచుతోంది.
రామ్ చరణ్ తో అనిల్ సినిమా..
మరోవైపు రామ్ చరణ్ తో కూడా అనిల్ రావిపూడి సినిమా చేస్తాడన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ లో సక్సెస్ అవుతూ వస్తోన్న అనిల్ ను పాన్ ఇండియా డైరెక్టర్ గా నిలబెట్టాలని మెగాస్టార్ ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. దాంతో రామ్ చరణ్ తో భారీ స్థాయిలో ఓ సినిమాను చేయడానికి రెడీ అవుతున్నట్టు టాక్. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమాలపై చాలా రూమర్లు ఇలా వైరల్ అవువున్నాయి. మన శంకరవరప్రసాదుగారు సినిమా హిట్ తో అనిల్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది.

