- Home
- Entertainment
- Mahesh Next Film: వారణాసి తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఇదేనా?.. మాస్‌కి పూనకాలే
Mahesh Next Film: వారణాసి తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఇదేనా?.. మాస్‌కి పూనకాలే
మహేష్ బాబు ప్రస్తుతం `వారణాసి` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఒక వార్త వైరల్‌గా మారింది.

వారణాసి మూవీతో బిజీగా ఉన్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా కనిపిస్తారని సమాచారం. దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ దాదాపు రూ.1300కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట.
ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కావాల్సి ఉంది. కాన వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా డిలే అయ్యే అవకాశం ఉందని, సమ్మర్ కి రావడం లేదని, ఆగస్ట్ లో వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
వారణాసి తర్వాత మహేష్ నెక్ట్స్ మూవీ ఎవరితో
`వారణాసి`పై భారీ అంచనాలున్నాయి. ఇండియాలోనే రూపొందుతున్న బిగ్గెస్ట్ సినిమాలో ఇదొకటని చెప్పొచ్చు. ఈ మూవీ ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. సరికొత్త సంచలనంగా అవతరించబోతుందని, ఈ సినిమాతో మహేష్ గ్లోబల్ స్టార్ కాబోతున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇంత పెద్ద సినిమా చేసిన తర్వాత మహేష్ ఎవరితో మూవీ చేస్తాడు, నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో అనేది ఆసక్తికరంగా మారింది.
రాజమౌళితో సినిమా అంటే అది పూర్తయ్యేంత వరకు ఎవరూ కొత్త సినిమాని ప్రకటించరు, చేయరు. ఆ తర్వాత వాటి ఫలితాన్ని బట్టి చేస్తుంటారు. ఇప్పటి వరకు ఆయనతో సినిమాలు చేసిన ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరు అలానే చేశారు. కానీ ఇప్పుడు మహేష్ ముందుగానే డిసైడ్ అయ్యాడట. సంచలన దర్శకుడితో సినిమా చేయబోతున్నాడట.
సందీప్ రెడ్డి వంగాతో మహేష్ ?
మహేష్ బాబు.. నెక్ట్స్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. నిజానికి `యానిమల్` మూవీ మహేష్ చేయాల్సింది అంటారు. కానీ సందీప్ దీన్ని ఖండించారు. కానీ అప్పట్లో వీరి కాంబినేషన్లో చర్చలు జరిగాయి. అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరోసారి సందీప్.. మహేష్‌కి కథ నెరేట్ చేశాడని, మహేష్ నుంచి పాజిటివ్ రియాక్షన్ దక్కిందని సమాచారం.
ఇప్పటి వరకు చూడని అవతార్‌లో మహేష్ కనిపిస్తాడని, మాస్ లుక్ వేరే లెవల్లో ఉండబోతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతనో గానీ ఇదే నిజమైతే మాత్రం మాస్ ఆడియోన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగా మార్క్ మాస్ టేకింగ్కి, మహేష్ లుక్, యాక్టింగ్‌కి థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. మరి ఇది ఎంత వరకు సెట్ అవుతుందో చూడాలి.
ప్రభాస్‌తో స్పిరిట్ చేస్తోన్న సందీప్ రెడ్డి వంగా
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా .. ప్రభాస్ తో `స్పిరిట్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రమిది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల మాఫియా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన బోల్డ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబర్ 29న విడుదల కానుంది. ఆ తర్వాత సందీప్ కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నారు.















