- Home
- Entertainment
- Top 10 Heroes: పడిపోయిన రామ్ చరణ్, అల్లు అర్జున్.. తారక్ అడ్రస్సే లేదు.. ప్రభాస్, మహేష్ స్థానాలివే
Top 10 Heroes: పడిపోయిన రామ్ చరణ్, అల్లు అర్జున్.. తారక్ అడ్రస్సే లేదు.. ప్రభాస్, మహేష్ స్థానాలివే
ఓర్మాక్స్ మీడియా అక్టోబర్ నెలకు సంబంధించిన ఇండియన్ టాప్ 10 హీరోల లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ డౌన్ అయ్యారు, తారక్ అసలు జాబితాలోనే లేడు.

ఇండియా టాప్ 10 హీరోలు
ఇండియాలో టాప్ 10 హీరోలకు సంబంధించి ప్రతి నెల జాబితా వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓర్మాక్స్ మీడియా ఈ జాబితాని విడుదల చేసింది. ఇందులో రామ్ చరణ్ మరింతగా పడిపోయాడు. ఇక అల్లు అర్జున్ మరోసారి డౌన్ అయ్యాడు. మహేష్ బాబు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా, ప్రభాస్ అదే స్థానంలో ఉన్నారు. హిందీ నుంచి ముగ్గురు హీరోలు, తమిళం నుంచి ఇద్దరు హీరోలు సత్తా చాటారు. కన్నడ నుంచి యష్ ఉన్నారు. మరి వీరి స్థానాలేంటి? అనేది చూస్తే,
నెంబర్ 1 ప్రభాస్
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోలా జాబితాలో మొదటి స్థానాన్ని ప్రభాస్ దక్కించుకున్నారు. ఎవరి స్థానం మారినా ఆయన ప్లేస్‌కి తిరుగులేదు. తిరుగులేని రారాజుగా రాణిస్తోన్నారు. ఇప్పుడు కూడా అదే స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఉన్నారు. సెప్టెంబర్‌లో నాల్గో స్థానంలో ఉన్న విజయ్.. ఇప్పుడు మూడో స్థానంలోకి వచ్చారు.
ఒక్క స్థానం పడిపోయిన అల్లు అర్జున్
ఇక అల్లు అర్జున్ నాల్గో స్థానం సొంతం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో మూడో స్థానంలో ఉన్న ఆయన ఒక్క స్థానం పడిపోవడం గమనార్హం. అక్టోబర్‌లో నాల్గో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం బన్నీ `రాకా` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు.
మహేష్ బాబు 5వ స్థానంలో సెటిల్
మహేష్ బాబు ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన సెప్టెంబర్‌లో కూడా అదే స్థానంలో ఉన్నారు. అక్టోబర్‌లో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు `వారణాసి`లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఆయనతోపాటు ఆరో స్థానంలో యష్ ఉన్నారు. ఆయన `రామాయణం`లో నటించిన విషయం తెలిసిందే. ఏడో స్థానంలో తమిళ హీరో సూర్య ఉన్నారు. ఆయన బ్యాక్ టూ బ్యాక్ 3 హిట్స్ అందుకున్నాడు. ఇటీవల `సీన్`తో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
పడిపోయిన రామ్ చరణ్
ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు. తొమ్మిదో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు. ఇక పదో స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. సెప్టెంబర్‌లో ఆయన 9వ స్థానంలో ఉండగా, ఒక్క స్థానం పడిపోయారు. పదో స్థానానికి పరిమితమయ్యారు. మొత్తంగా టాప్ 10 లిస్ట్ లో ఉన్నారు. ఇక గత నెలలో కూడా ఎన్టీఆర్ ఈ లిస్ట్ లో లేడు. ఇప్పుడు కూడా లేకపోవడం గమనార్హం.















