MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • MaheshBabu: ఫస్ట్ టైమ్‌ మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం.. దేవుడిగా, వీరుడిగా.. బాక్సాఫీసు వద్ద అరాచకమే

MaheshBabu: ఫస్ట్ టైమ్‌ మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం.. దేవుడిగా, వీరుడిగా.. బాక్సాఫీసు వద్ద అరాచకమే

మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి `వారణాసి` మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై ఇటీవల భారీ హైప్‌ పెంచారు. అంతేకాదు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో మహేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 07 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
డైరెక్ట్ గ్లోబల్‌ ఫిల్మ్ తో రాబోతున్న మహేష్‌ బాబు
Image Credit : youtube/@ColliderInterviews

డైరెక్ట్ గ్లోబల్‌ ఫిల్మ్ తో రాబోతున్న మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తండ్రి కృష్ణ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని హీరోగా రాణిస్తున్నారు. బాలనటుడిగానే ఆయన మెప్పించారు. సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు హీరోగానూ తిరుగులేని స్టార్‌ డమ్‌తో రాణిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌తో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు రీజినల్‌ మూవీస్‌ చేసిన ఆయన మొదటిసారి గ్లోబల్‌ ఫిల్మ్ చేస్తున్నారు. పాన్‌ ఇండియా కాకుండా ఒకేసారి ఇంటర్నేషనల్‌ మూవీ `వారణాసి`తో రాబోతుండటం విశేషం.

26
అంతర్జాతీయ స్థాయిలో `వారణాసి` ఫిల్మ్
Image Credit : youtube/@ScreenRantPlus

అంతర్జాతీయ స్థాయిలో `వారణాసి` ఫిల్మ్

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో మొదటిసారి రూపొందుతున్న చిత్రమిది. దీన్ని గ్లోబల్‌ ఫిల్మ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు రాజమౌళి. అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిచ్చారు. ఇందులో మహేష్‌ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాల్గొన్నారు. సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Related Articles

Related image1
Sobhan Babu చెప్పిన మాట వినకుండా వేల కోట్లు పోగొట్టుకున్న స్టార్‌ హీరో.. చుట్టూ ఉన్నవాళ్లే మోసం
Related image2
Rukmini Vasanth: రష్మిక మందన్నా మాజీ ప్రియుడి గురించి నిజాలు బయటపెట్టిన రుక్మిణి వసంత్‌, అస్సలు ఊహించరు
36
`వారణాసి`లో 25 నిమిషాల రామాయణం
Image Credit : Mahesh Babu\Twitter

`వారణాసి`లో 25 నిమిషాల రామాయణం

`వారణాసి` సినిమాలో మైథాలజీ ఎపిసోడ్‌ ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. రామాయణం చూపించబోతున్నట్టు తెలిపారు. గతంలో తాను తీసిన సినిమాలన్నీ రామాయణం నుంచి స్ఫూర్తి పొందినవే అని, మొదటిసారి ఆ రామాయణం ఎపిసోడ్‌నే ఇందులో చూపించబోతున్నట్టు తెలిపారు. ఆ ఎపిసోడ్‌ 25నిమిషాలపాటు ఉండబోతుందట. ఇందులో మహేష్‌ బాబు రాముడిగా కనిపించనున్నారు. ఆయన మొదటిసారి మైథాలజీ రోల్‌ చేస్తున్నారు. అందుకోసం దాదాపు ఆరు నెలలుగా ట్రైన్‌ అయ్యారట. ఈ విషయాన్ని ఇటీవలే ఇంటర్వ్యూస్‌లో వెల్లడించారు మహేష్‌.

46
రాముడిగా, రుద్రగా మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం
Image Credit : Asianet News

రాముడిగా, రుద్రగా మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం

`వారణాసి` మూవీలో మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన ప్రస్తుత కాలంలో రుద్రగా కనిపిస్తారు. రుద్ర అనే వీరుడిగా సాహస యాత్ర చేస్తారట. అనేక ప్రాంతాలకు ఆయన ప్రయాణిస్తాడట. ఈ క్రమంలోనే టైమ్‌ ట్రావెల్‌లోకి వెళ్లనున్నారని, రామాయణానికి సంబంధించిన త్రేతాయుగంలోకి వెళ్లనున్నారట. అందులో రాముడిగా కనిపిస్తాడట. 25నిమిషాలు ఎపిసోడ్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని, అది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుందని, ఈ ఒక్కటి చాలు ప్రపంచం మొత్తం ఫిదా అవ్వడానికి అని తెలిపారు రాజమౌళి. దాన్నే నమ్ముకొని ఆయన ఈ మూవీపై రూ.1300కోట్ల బడ్జెట్‌ పెడుతున్నారు.

56
హీరోగా మొదటిసారి మహేష్‌ డ్యూయెల్‌ రోల్‌
Image Credit : youtube/@ColliderInterviews

హీరోగా మొదటిసారి మహేష్‌ డ్యూయెల్‌ రోల్‌

మహేష్‌ బాబు హీరో అయ్యాక ద్విపాత్రాభినయం చేయలేదు. దీంతో మొదటిసారి ఆయన `వారణాసి`లో రుద్రగా, రాముడిగా డ్యూయెల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బాలనటుడిగా మహేష్‌ ద్విపాత్రాభినయం చేశారు. `కొడుకు దిద్దిన కాపురం`లో ఆయన రెండు పాత్రల్లో కనిపించారు. కానీ హీరో అయ్యాక మాత్రం డ్యూయెల్‌ రోల్‌ చేయలేదు. ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒకే పార్ట్ గా ఉంటుందని, మూడు గంటల నిడివితో ఉంటుందని చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ ఇప్పుడు మూవీపై అంచనాలను అమాంతం పెంచాయి.

66
`వారణాసి` ఓటీటీ డీల్‌ సెట్‌
Image Credit : youtube/varanasi movie

`వారణాసి` ఓటీటీ డీల్‌ సెట్‌

ఇదిలా ఉంటే `వారణాసి` మూవీ ఓటీటీ రైట్స్ డీల్‌ సెట్‌ అయ్యిందట. నెట్‌ ఫ్లిక్స్ భారీ రేట్‌కి దక్కించుకుందట. ఏకంగా రూ.650కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఇదే నిజమైతే కేవలం ఓటీటీ ద్వారానే ఈ మూవీకి సగం బడ్జెట్‌ వచ్చిందని చెప్పొచ్చు. ఇక బాక్సాఫీసు పరంగానూ భారీగా ఆశిస్తున్నారు. రెండు నుంచి మూడు వేల కోట్ల వరకు టార్గెట్‌ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అంతర్జాతీయంగా బిజినెస్‌ కూడా జరుగుతుంది. ఏరియా వైజ్‌గా బిజినెస్‌ని క్లోజ్‌ చేసే పనిలో ఉన్నారట. అందులో భాగంగానే రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలిప్పించినట్టు సమాచారం. ఇక ఈ మూవీ చిత్రీకరణ సెప్టెంబర్‌, అక్టోబర్‌ వరకు పూర్తవుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ 9న సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు జక్కన్న.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: హీరోయిన్‌ ని చూసి డైలాగ్‌ మర్చిపోయిన రజనీ.. 60ఏళ్ల సూపర్‌స్టార్‌ని ఫిదా చేసిన నటి ఈమెనే
Recommended image2
MSG 26th Day Collections: `మన శంకర వర ప్రసాద్‌ గారు` ఓటీటీ డేట్‌.. చిరంజీవి సినిమా 26 రోజుల కలెక్షన్లు
Recommended image3
Chandra Hass: జేడీ చక్రవర్తిది డబుల్‌ ఫేస్‌.. తిరగబడ్డ చంద్రహాస్‌.. పెద్ద సినిమాలను టార్గెట్‌ చేస్తూ కౌంటర్‌
Related Stories
Recommended image1
Sobhan Babu చెప్పిన మాట వినకుండా వేల కోట్లు పోగొట్టుకున్న స్టార్‌ హీరో.. చుట్టూ ఉన్నవాళ్లే మోసం
Recommended image2
Rukmini Vasanth: రష్మిక మందన్నా మాజీ ప్రియుడి గురించి నిజాలు బయటపెట్టిన రుక్మిణి వసంత్‌, అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved