MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Sobhan Babu చెప్పిన మాట వినకుండా వేల కోట్లు పోగొట్టుకున్న స్టార్‌ హీరో.. చుట్టూ ఉన్నవాళ్లే మోసం

Sobhan Babu చెప్పిన మాట వినకుండా వేల కోట్లు పోగొట్టుకున్న స్టార్‌ హీరో.. చుట్టూ ఉన్నవాళ్లే మోసం

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కెరీర్‌ ప్రారంభంలో తాను మోసపోయిన విషయాన్ని పంచుకున్నారు. తన చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారని తెలిపారు. శోభన్‌ బాబు మాట వినకుండా కోట్లు పోగొట్టుకున్నట్టు తెలిపారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 07 2026, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సీతా పయణంతో రాబోతున్న అర్జున్‌ సర్జా
Image Credit : Asianet News

సీతా పయణంతో రాబోతున్న అర్జున్‌ సర్జా

యాక్షన్‌ హీరో అర్జున్‌ తాజాగా `సీతా పయణం` అనే చిత్రంతో రాబోతున్నారు. ఇందులో ఆయన నటించడంతోపాటు దర్శకత్వం వహించారు. తన కూతురు ఐశ్వర్య ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను చాలా మంది చేత మోసం పోయినట్టు తెలిపారు. చుట్టూ ఉన్నవారే మోసం చేశారట. అలాగే శోభన్‌ బాబు చెప్పిన మాట వినలేదట. ఆ సంగతులేంటనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
యాక్షన్‌, దేశ భక్తి చిత్రాలతో యాక్షన్‌ కింగ్‌గా ఎదిగిన అర్జున్‌
Image Credit : our own

యాక్షన్‌, దేశ భక్తి చిత్రాలతో యాక్షన్‌ కింగ్‌గా ఎదిగిన అర్జున్‌

కన్నడ నటుడు అయిన అర్జున్‌ కన్నడతోపాటు తెలుగులోనూ స్టార్‌ హీరోగా ఎదిగారు. తెలుగు హీరోగా గుర్తిండిపోయారు. ఎక్కువగా యాక్షన్‌ ప్రధాన చిత్రాలు చేసి యాక్షన్‌ కింగ్‌గా పేరుతెచ్చుకున్నారు. అదే సమయంలో దేశభక్తి చిత్రాలతో మెప్పించారు. ఒకప్పుడు అర్జున్‌ అంటే దేశ భక్తి చిత్రాలే గుర్తుకు వచ్చేవి. పోలీసు, ఆర్మీ నేపథ్యం ఉన్న కథలతో విజయాలు అందుకుని తిరుగులేని స్టార్‌ గా ఎదిగారు. అదే సమయంలో విభిన్నమైన మూవీస్‌తోనూ మెప్పించారు.

Related Articles

Related image1
Chiranjeevi Father: చిరంజీవికి తండ్రి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నిర్మాత మోసం చేయడంతో మర్చిపోలేని ట్రీట్‌
Related image2
Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?
36
అర్జున్‌ తెలుగు సినిమాలు
Image Credit : youtube/@greatandhranews

అర్జున్‌ తెలుగు సినిమాలు

అర్జున్‌ `మా పల్లెలో గోపాలుడు` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. దీంతో తెలుగులో వరుసగా అవకాశాలను దక్కించుకున్నారు. `నాగదేవత`, `కౌబాయ్‌ నెం 1`, `కోనసీమ కుర్రాడు`, `మనవడొస్తున్నాడు`, `మా వూరి మారాజు`, `ద్రోహి`, `శుభవార్త`, `హనుమాన్‌ జంక్షన్‌`, `పుట్టింటికి రా చెల్లి`, `శ్రీ ఆంజనేయం`, `స్వాగతం` వంటి చిత్రాలతో మెప్పించారు. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఆయన తమిళంలో నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలయ్యేవి. అవి కూడా మంచి ఆదరణ పొందేవి.

46
అర్జున్‌ తొలి పారితోషికం
Image Credit : youtube/@greatandhranews

అర్జున్‌ తొలి పారితోషికం

అయితే కెరీర్‌ ప్రారంభంలో అర్జున్‌ చాలా బిజీగా ఉండేవారు. రోజు ఏడు షిఫ్ట్ ల్లో సినిమాలు చేసేవారట. ఒకే రోజు ఏడు సినిమాల షూటింగ్‌లో పాల్గొనేవారు. ఆయన తెలుగులో నటించిన సినిమాకు తీసుకున్న తొలి పారితోషికం రూ.25వేలు. అయితే అప్పట్లో మంచిగానే రెమ్యూనరేషన్‌ తీసుకున్నారట. కానీ వాటిని సరిగ్గా వాడుకోలేకపోయారు. పారితోషికం రూపంలో భారీగానే సంపాదించినా, వాటిని ఆస్తులుగా మల్చుకోలేకపోయారట. ఈ విషయంలో సోగ్గాడు శోభన్‌ బాబు మాట కూడా వినలేదట. శోభన్‌ బాబుతో కలిసి అర్జున్‌ `చట్టంతో చదరంగం` అనే సినిమాలో నటించారు. ఆ సమయంలో తనతో ఎంతగానో క్లోజ్‌గా ఉండేవారట. ఆయన అన్ని విషయాలు పంచుకునేవారట.

56
శోభన్‌ బాబు మాట వినని అర్జున్‌
Image Credit : youtube/@greatandhranews

శోభన్‌ బాబు మాట వినని అర్జున్‌

ఈ క్రమంలో వచ్చిన డబ్బుని భూమిపై పెట్టు అని, ఆస్తులు కొనుక్కో అని చెప్పేవారట. తనతో శోభన్‌ బాబు ఎంతో క్లోజ్‌గా ఉండేవారని, చాలా విషయాలు చెప్పేవారని, కానీ తానే వినలేదన్నారు అర్జున్‌. ఆయన మాట విని ల్యాండ్‌ కొంటే ఇప్పుడు వంద వేల కోట్లు ఉండేవని చెప్పారు అర్జున్‌. శోభన్‌ బాబు తనతో ఎంతో క్లోజ్‌గా ఉన్నారని, చాలా గొప్ప మనిషి అని చెప్పారు. అంతేకాదు ఈ క్రమంలో పలు షాకింగ్‌ విషయాలు పంచుకున్నారు. తనచుట్టూ ఉన్న వాళ్లే మోసం చేశారని తెలిపారు అర్జున్‌.

66
చుట్టూ ఉన్న వాళ్లే మోసం
Image Credit : youtube/@greatandhranews

చుట్టూ ఉన్న వాళ్లే మోసం

తాను చాలా సినిమాలు చేశాను, కానీ చాలా మంది తనని మోసం చేశారని తెలిపారు. వారి పేర్లు చెప్పడానికి ఇష్టపడని అర్జున్‌ ఇండస్ట్రీలో తన చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారని తెలిపారు. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎక్కడికిపోతుంది, ఎవరు తన డబ్బు మిస్‌ యూజ్‌ చేస్తున్నారో తెలిసేది కాదు, ఆ తెలియని ఏజ్‌ని ఉపయోగించుకుని మోసం చేశారని తెలిపారు అర్జున్‌. అప్పుడే తాను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక్కో ప్రాపర్టీ వేరే రేంజ్‌లో ఉండేదన్నారు. ఆ తర్వాత తెలివి వచ్చాక కొన్ని ప్రాపర్టీస్‌ కొన్నానని, అవి కూడా ఫోర్స్ మీదనే కొన్నానని తెలిపారు. మొత్తంగా తన చుట్టూ ఉన్న వాళ్లు మోసం చేయడం, శోభన్‌ బాబు మాట వినకపోవడం వల్ల అర్జున్‌ వందల వేల కోట్ల ఆస్తులను కోల్పోయారని చెప్పొచ్చు. ఈ విషయాలను గ్రేట్‌ ఆంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూ అర్జున్‌ తెలిపారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Chiranjeevi Father: చిరంజీవికి తండ్రి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నిర్మాత మోసం చేయడంతో మర్చిపోలేని ట్రీట్‌
Recommended image2
Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved