MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Mahesh Babu: జూ ఎన్టీఆర్‌ సజెస్ట్ చేశాడని సినిమా చేస్తే, కోలుకోలేని దెబ్బ తిన్న మహేష్‌ బాబు

Mahesh Babu: జూ ఎన్టీఆర్‌ సజెస్ట్ చేశాడని సినిమా చేస్తే, కోలుకోలేని దెబ్బ తిన్న మహేష్‌ బాబు

Mahesh Babu: మహేష్‌ బాబు నటించిన అతిథి సినిమా విషయంలో విచిత్రం చోటు చేసుకుంది. ఈ మూవీని ఎన్టీఆర్‌ సజెస్ట్ చేశాడట. తారక్‌ చెప్పాడని చేసి దెబ్బైపోయాడు మహేష్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 29 2026, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రారంభంలో వరుసగా ఫెయిల్యూర్స్ చూసిన మహేష్‌
Image Credit : @maheshbabufans

ప్రారంభంలో వరుసగా ఫెయిల్యూర్స్ చూసిన మహేష్‌

మహేష్‌ బాబు ఈ మధ్య మినిమమ్‌ గ్యారంటీ సినిమాలతో ఆకట్టుకున్నారు. `శ్రీమంతుడు` తర్వాత ఆయన కథల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. మధ్యలో `గుంటూరుకారం` కొంత డిజప్పాయింట్‌ చేసింది, కానీ మిగిలిన అన్ని సినిమాలు మినిమమ్‌ ఆడాయి. గుంటూరుకారం మూవీకి కూడా తమకు డబ్బులు వచ్చాయని నిర్మాత నాగవంశీ పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. అయితే అంతకు ముందు మాత్రం మహేష్‌ గట్టిగా దెబ్బతిన్నాడు. వరుసగా మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అతిథితో మహేష్‌ కి గట్టి దెబ్బ
Image Credit : Asianet News

అతిథితో మహేష్‌ కి గట్టి దెబ్బ

`పోకిరి` తర్వాత వరుసగా నాలుగు సినిమాలతో పరాజయాలు చవిచూశారు మహేష్‌ బాబు. భారీ అంచనాల మధ్య విడుదలైన `సైనికుడు` ఆడలేదు. దీంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని `అతిథి` మూవీ చేశారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి మహేష్‌ బాబు అన్నయ్య జి రమేష్‌ బాబు నిర్మాత. కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా 2007 అక్టోబర్‌ 18న దసరా కానుకగా విడుదలైంది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. మహేష్‌ కి ఉన్న స్టార్‌డమ్‌, మార్కెట్‌ కారణంగా తక్కువ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

35
ఎన్టీఆర్‌ సజెస్ట్ చేయడంతో అతిథి చేసిన మహేష్‌
Image Credit : others

ఎన్టీఆర్‌ సజెస్ట్ చేయడంతో అతిథి చేసిన మహేష్‌

ఈ మూవీ చేయాల్సింది మహేష్‌ బాబు కాదు. మొదట అనుకున్నది ఎన్టీఆర్‌కి. దర్శకుడు సురేందర్‌ రెడ్డి.. ఈ కథని మొదట తారక్‌కి వినిపించాడు. అయితే ఈ కథతోపాటు `అశోక్‌` కథని కూడా చెప్పాడు. `అశోక్‌` కథ నచ్చి ఎన్టీఆర్‌ ఆ మూవీ చేశాడు. అదే సమయంలో `అతిథి` మూవీ మహేష్‌ బాబుకి అయితే బాగా సూట్‌ అవుతుందని, సజెస్ట్ చేశాడు జూ ఎన్టీఆర్‌. దీంతో ఇది మహేష్‌ వద్దకు వెళ్లింది. తారక్‌ సజెస్ట్ చేశాడని చెప్పడంతో లైన్‌ కూడా నచ్చడంతో మహేష్‌ మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పారు. కథ బాగుందని చెప్పి తన అన్న రమేష్‌ బాబునే ప్రొడ్యూస్‌ చేయాలని తెలిపారు.

45
అతిథి రీ రిలీజ్‌
Image Credit : Asianet News

అతిథి రీ రిలీజ్‌

ఈ సినిమాకి మొదట అనుకున్న హీరోయిన్ వేరే. ఆ తర్వాత అమృతా రావు వచ్చింది. మధ్యలో ఈ కథలో మార్పులు చేయాల్సి వచ్చింది. మహేష్‌ బాబు కొన్ని మార్పులు చెప్పడంతో వక్కంత వంశీ రంగంలోకి దిగారు. దీంతో కథలో చాలా మార్పులు జరిగాయి. క్లైమాక్స్ లో చిన్నారి పాప చనిపోయే సీన్‌ లేదు. చివరి నిమిషంలో యాడ్‌ చేశారు. దీని కారణంగానే సినిమా ఫ్లాప్‌ అయ్యిందంటారు. మొత్తంగా మహేష్‌ ని `అతిథి` కోలుకోలేని దెబ్బ కొట్టింది. జూ ఎన్టీఆర్‌ చెప్పాడని చేస్తే మహేష్‌కి గట్టి దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ మళ్లీ ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. నేడు మే 29న రీ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో కృష్ణ జయంతి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మూవీని రీ రిలీజ్‌ చేయడం విశేషం. అప్పట్లో డిజప్పాయింట్‌ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

55
వారణాసితో బిజీగా ఉన్న మహేష్‌ బాబు
Image Credit : urstrulymahesh/Instagram

వారణాసితో బిజీగా ఉన్న మహేష్‌ బాబు

మహేష్‌ బాబు ప్రస్తుతం `వారణాసి` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image2
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image3
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Related Stories
Recommended image1
Trikala Movie Review: త్రికాల మూవీ రివ్యూ.. సరికొత్త మైథాలజీ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Upasana ని మ్యారేజ్‌ చేసుకోవడంపై రామ్‌ చరణ్‌ క్రేజీ కామెంట్‌.. పెళ్లికి ముందే `పెద్ది` చేస్తే మంచి సంబంధం వచ్చేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved