- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుని చేతుల జోడించి బ్రతిమాలుకుంటున్న మహేంద్ర.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న రిషి!
Guppedantha Manasu: వసుని చేతుల జోడించి బ్రతిమాలుకుంటున్న మహేంద్ర.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న రిషి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. అన్యాయానికి బలై కనిపించకుండా పోయిన కొడుకు కోసం తపన పడుతున్న ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వసు గురించి అడుగుతాడు మహేంద్ర. ఆవిడ అటువైపు ఉంటారు అని వసు ఉన్న వైపు చూపిస్తారు లెక్చరర్స్. ఇదంతా వింటున్న రిషి డాడ్ ఎందుకు వసుని అడుగుతున్నారు. నేను ఇక్కడ ఉన్నట్లు వసు డాడ్ కి చెప్పిందా అనుకొని వసు దగ్గరికి వెళ్తాడు రిషి. సీన్ కట్ చేస్తే ఆయాస పడుతూ వచ్చిన పాండ్యన్ ని ఏం జరిగింది అని అడుగుతారు అతని ఫ్రెండ్స్.
నేను ఒక వింత చూసాను రిషి సార్ వసుధార మేడంకి దండం పెడుతున్నారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో వినబడలేదు కానీ వాళ్ళ మధ్యలో ఏదో ఉంది అదేంటో కనుక్కోవాలి అంటాడు పాండ్యన్. అవునురా వాళ్ళిద్దరికీ సరైన బుద్ధి చెప్పాలి ఇన్నాళ్లు మనల్ని ఎదిరించిన స్టూడెంట్స్ గాని లెక్చరర్స్ గాని లేరు కానీ వీళ్ళు మనకి అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.
ఎలాగైనా వాళ్ళు అంత చూడాలి అంటారు ఫ్రెండ్స్. ఆ రహస్యం ఏదో తెలుసుకుంటే అదే మన ఆయుధమవుతుంది దాంతో వాళ్ళ అంతు చూడొచ్చు అంటాడు పాండ్యన్. మరోవైపు రిషి వసుని పక్కకి తీసుకువచ్చి అసలు ఎందుకిలా చేస్తున్నావు. నేను వద్దని చెప్పాక కూడా ఎందుకు మా వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అంటూ కేకలు వేస్తాడు. నేను ఎవరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటుంది వసు.
అబద్ధాలు చెప్పింది చాలు అలా అబద్ధం చెప్పే నన్ను నా తండ్రి కి దూరం చేశావు, నన్ను మోసగాడిగా నిలబెట్టావు అయినా నువ్వు చెప్పకపోతే డాడ్ ఎందుకు ఎక్కడికి వస్తారు అంటాడు రిషి. మహేంద్ర సార్ వచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసు. ఏమి తెలియనట్టు మాట్లాడొద్దు అంటూ ఆమెని కసురుకుంటాడు ఒకవేళ డాడ్ నా గురించి అడిగితే ఇవ్వద్దు అని హెచ్చరిస్తాడు రిషి.
లేదు సార్ చెప్పను.. ఇప్పటికే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను అంటూ ఉండగానే మహేంద్ర రావటం గమనించి రిషి ని ఎలర్ట్ చేస్తుంది వసు. వెంటనే రిషి వెళ్లి పక్కన దాక్కుంటాడు. మహేంద్ర నేరుగా వసు దగ్గరికి వెళ్తాడు. ఎక్కడున్నాడు చెప్పు అంటూ సూటిగా ప్రశ్నిస్తాడు. ఆ మాటలకి షాక్ అవుతుంది బస్సు నాకు తెలియదు సార్ అంటూ సమాధానం చెబుతుంది.
నీకు తెలుసు అని నీ మొహం చూస్తే చెబుతుంది. నువ్వు చెబుతున్నది అబద్ధం అని నీ కళ్ళు చూస్తే చెప్తున్నాయి దయచేసి నిజం చెప్పు నా కొడుకు కనిపించక నాకు సరైన తిండి నిద్ర లేవు అంటూ చేతిలో జోడించి బ్రతిమాలుతాడు మహేంద్ర. ఇప్పటికే నా కొడుకు చాలా పోగొట్టుకున్నాడు అయినా ఎందుకు నువ్వు మీ జగతి మేడం కలిపి నా కొడుకుని ఒక మోసగాడిగా చిత్రీకరించారు అంటూ నిలదీస్తాడు.
ఒకవేళ నీకు రిషి కనిపిస్తే ఈ తండ్రి పడుతున్న బాధ వాడికి చెప్పు అని కన్నీటితో వసుకి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహేంద్ర. ఇదంతా వింటున్న రిషి చాలా బాధపడతాడు. ఇదంతా పైనుంచి చూస్తాడు పాండ్యన్. మరోవైపు ఇంటికి వచ్చిన మహేంద్రా ని వసూలు కనిపించిందా రిషి గురించి ఏమైనా చెప్పిందా అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తుంది జగతి. అంతలోనే ధరణి కూడా అక్కడికి వస్తుంది.
జగతితో మాట్లాడకుండాధరణితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ నా కళ్ళు చూస్తే నీకు సమాధానం తెలియటం లేదా అయినా దీని అంతటికి కారణం తనే కదా అయినా ఎందుకు ఇన్ని ప్రశ్నలు.. తన వల్లే నాకు ఈ బాధ. ఇంకా ఎన్నాళ్లు నా కొడుకు కోసం ఈ ఎదురుచూపులు అంటూ జగతిని అసహ్యించుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు మహేంద్ర. సీన్ కట్ చేస్తే జరిగిందంతా తలుచుకుంటాడు రిషి.
వసుధార కళ్ళల్లో ఇంకా నా మీద ప్రేమ కనిపిస్తుంది. తన మనసులో నా స్థానాన్ని నేనే చెరిపేయాలి. అంటే నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలి. నేను మొండి వాడిని కాబట్టి అవమానాలు దిగమింగి బ్రతుకుతున్నాను. నా చదువు పదిమందికి ఉపయోగపడాలని లెక్చరర్ గా పనిచేస్తున్నాను. అందుకు నా గతం నాకు అడ్డుపడకూడదు అని మనసులో అనుకుంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.