Guppedantha manasu: దేవయాని, రిషీకి షాకిచ్చిన మహేంద్ర.. బాధతో కుమిలిపోతున్న జగతి?
Guppedantha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ (Guppedantha manasu) గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్లో ఈ రోజు గురువారం మార్చ్ 3 ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

వసుధర రిషికి జగతి వ్యక్తిత్వం గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది కానీ రిషి మాత్రం జగతి గురించి తప్పుగా మాట్లాడుతూ చేసింది మీ మేడమ్ మీ మేడం ఒక అవకాశవాది అంటూ కావాలనే ఇలా చేసింది అని తిడుతూ ఉంటాడు. అలాగే ఇలాంటివి ఏవో జరుగుతాయని ముందే మా డాడీకి మేడంని దూరంగా ఉండమని చెప్పాను అని జరిగిన విషయాన్ని ఆవేశంలో వసుధార తో చెప్తాడు.
వసుధార ఈ మాట విని షాక్ అవుతుంది. ఇక వసుధారా ఇలాంటి ఘోరమైన మాటలు ఎలా మాట్లాడుతున్నారు సార్ ఎందుకు ఇంతలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటుంది. కానీ రిషి మాత్రం కోపంతో విచక్షణ కోల్పోయి జగతి గురించి తప్పుగా మాట్లాడతాడు దాంతో వసుధారా ఆపండి సార్ ఈ విధంగా మాట్లాడటానికి మీకు ఎలా ఉన్నా నాకు వినడానికి మాత్రం చాలా అసహ్యంగా ఉంది అని రిషితో మాట్లాడకుండా ఉండిపోతుంది.
గౌతమ్ రిషి దగ్గరకు వచ్చి రిషిని కూల్ చేయడానికి మాట్లాడుతాడు కానీ రిషి మాత్రం గౌతమ్ మీద కోపడతాడు దాంతో గౌతమ్ ఫీల్ అవ్వకుండా నువ్వు నా ఫ్రెండ్ వి రా నన్ను ఏమన్నా నేను పడతాను అంటాడు. గౌతమ్ నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ ని కదరా జగతి మేడం మీ అమ్మ అన్న విషయాన్ని నాకు కూడా ఎందుకు చెప్పలేదు రా అంటాడు దాంతో రిషి ఆవిడ మా అమ్మ కాదు అంటూ అరుస్తాడు దీంతో గౌతమ్ వసుధార షాక్ అయి చూస్తుంటారు.
దేవయాని,ఫణీంద్ర, ధరణి కార్లో వెళుతూ ఉంటారు దేవయాని జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు అందుకే జగతిని కాలేజీకి తీసుకు రావద్దు అని అన్నాను ఆ విషయం పైనే ఫణీంద్ర మీద కోప్పడుతూ ఉంటుంది ఫణీంద్ర మాత్రం దేవయానికి ఈ విషయం గురించి మళ్లీ మాట్లాడితే బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. ధరణి రిషి గురించి అడిగితే వాడు వస్తాడు లేమ్మా నువ్వు కంగారు పడకు అంటాడు ఫణీంద్ర.
జగతి మహేంద్ర ఇద్దరూ కూడా తమ కార్లలో జగతి ఇంటికి వస్తారు మహేంద్ర ఇంటిలోపలికి వస్తుండగా ఆగు మహేంద్ర ఆ గుమ్మం దాటి లోపలికి రా వద్దు అంటుంది మహేంద్ర ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను ఏం చేశాను అంటే జరిగిన విషయాన్ని చెబుతూ ఇన్ని రోజులు రిషి కోసమే ఈ అవమానాలన్నీ పడ్డాను రిషి కోసమే అన్నింటికీ దూరంగా ఉన్నాను కానీ ఇప్పుడు రిషిని బాధ పెట్టావ్ అంటుంది.
మహేంద్ర ఆపు జగతి రిషి,రిషి అంటూ రిషి గురించి ఆలోచిస్తున్నావ్ నువ్వు నా గురించి కూడా ఆలోచించాలి కదా అంటాడు మహేంద్ర ఆవేశంతో వాడు నీకు లోకం కాదు వాడికే నువ్వు లోకాన్ని చూపించావు అంటాడు. జరిగిన విషయం తప్పుకాదు నేను అంతా కరెక్ట్ గానే చేశాను అని జరిగినదానికి మహేంద్ర జగతికి సర్ది చెప్తాడు. అయినా జగతి వినకపోవడంతో వాళ్లు అవమానించింది నా భార్యను, రిషి అమ్మ అని కాదు అంటాడు దాంతో జగతి బాధపడుతూ మహేంద్ర ను హత్తుకుంటుంది.
వసుధారా గౌతమ్ కు రిషి సార్ ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ సార్ అన్ని విషయాల్లో బాగున్నా జగతి మేడమ్ విషయంలో మాత్రం చాలా కోపంగా ఉంటారు అని చెప్తుంది. మహేంద్ర ఇంటికి వస్తాడు దేవయాని జరిగిన విషయానికి మహేంద్ర ను ప్రశ్నిస్తూ ఉంటుంది నాకు జరిగిన దానికి సమాధానం కావాలి అంటుంది వెంటనే రిషి కూడా అక్కడికి వస్తాడు. మహేంద్ర మాత్రం జరిగిన విషయానికి నేను ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు జగతి నా భార్య అని చెప్పినందుకు చాలా గర్వపడుతున్నాను అంటాడు దానికి దేవయాని రిషి షాక్ అవుతారు.