Guppedantha Manasu: తండ్రి ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్న రిషి.. ఆవేశంతో ఊగిపోతున్న మహేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. భార్యని చంపిన వాళ్ళ పతనం కోరుకుంటున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ లో నేను వాళ్లతో గడిపిన క్షణాలు మర్చిపోలేక పోతున్నాను అని పెద్దమ్మతో చెప్తుంది అనుపమ. నువ్వు ఒక పని చెయ్యు మళ్ళీ గతంలోకి వెళ్ళు, ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కో. ఇంకొక మాట నువ్వు కోపాన్ని కూడా తగ్గించుకో, నీది స్వచ్ఛమైన మనసు నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వాళ్ల మీదే కోప్పడతావు.
ఇంత వయసు వచ్చినా కూడా నీకు చెప్పడం కరెక్ట్ కాదు కానీ చెప్పక తప్పడం లేదు అంటుంది పెద్దమ్మ. వాళ్లని కలిస్తే స్థిరంగా ఉండలేను అంటుంది అనుపమ. ఇప్పుడు మాత్రం స్థిరంగా ఉంటున్నావా అని చెప్పి మహేంద్ర వాళ్ళని కలవమని ప్రోత్సహిస్తుంది పెద్దమ్మ. మహేంద్ర దగ్గర నుంచి అసలు విషయాలు తెలుసుకోవాలి అని అతనికి కాల్ చేస్తుంది. అదే సమయంలో మహేంద్ర, రిషి, వసుధార భోజనం చేస్తూ ఉంటారు.
మహేంద్ర భోజనం సమయంలో సరదాగా యాక్టివ్ గా ఉంటాడు ఇంతలో అనుపమ ఫోన్ చేస్తుంది వెంటనే కంగారు పడిపోతూ ఫోన్ కట్ చేసేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయమంటాడు రిషి. వద్దులే నాన్న ఇంపార్టెంట్ కాల్ ఏమి కాదు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు మహేంద్ర. తర్వాత భోజనం సరిపోయింది అని చెప్పి మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు. ఫోన్ రాకముందు యాక్టివ్ గా ఉన్నారు ఫోన్ వచ్చిన తర్వాత ఎందుకంత కంగారు పడిపోతున్నారు.
ఫోన్ డిస్ప్లే మీద అనుపమ అని వచ్చింది, అరకులో కలిసినావిడే కదా ఆవిడ అంటాడు రిషి. ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు వాళ్ళ మధ్యలో ఏదో గతం ఉన్నట్లుగా ఉంది అంటాడు. నన్ను కనుక్కోమంటారా మావయ్య దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఆవిడకి ఫోన్ చేస్తాను అంటుంది వసుధార. వద్దు ఆవిడ బాధపడుతుంది, మనం ఆవిడకి ఫోన్ చేశామని తెలిస్తే డాడ్ కూడా బాధపడతారు.
డాడ్ నిజం చెప్పే వరకు వెయిట్ చేద్దాం అంటాడు రిషి. ఆ తర్వాత మహేంద్ర కి కాఫీ ఇస్తుంది వసుధార. రిషి ఏడి అని అడుగుతాడు మహేంద్ర. వాళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు అంటుంది వసుధార. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళటం, వాళ్లని చూస్తేనే భయంగా ఉంది జగతిని ఎవరు చంపారో తెలియదు కానీ పరోక్షంగా ఆమె చావుకు కారణం మాత్రం వాళ్లే అంటాడు మహేంద్ర.
వెళ్లనివ్వండి మావయ్య వెళ్తేనే వాళ్ల గురించి తెలుసుకుంటారు అంటుంది వసుధార. తెలుసుకోవాలమ్మ, తెలుసుకొని వాళ్లని కఠినంగా శిక్షించాలి ఆ శిక్షని చూడటానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఆవేశంతో ఊగిపోతాడు మహేంద్ర. మీరు ఆవేశ పడకండి మావయ్య, ఆయన నిజం తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉంది అంటుంది వసుధార. ఇంతలో రిషి కిందకు వచ్చి నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని తండ్రికి చెప్తాడు.
నేను కూడా వస్తాను అంటుంది వసుధార. మరి డాడ్ అంటాడు రిషి. ఆయన ఏమి డ్రింక్ చేయరు, అన్ని ప్రిపేర్ చేసి పెట్టాను అంటుంది వసుధార. అవును రిషి మీరు వెళ్ళండి నీకు మాట ఇస్తున్నాను ఈరోజు నేను తాగను అని మాటిస్తాడు మహేంద్ర. తర్వాత రిషి, వసుధార ఇద్దరూ దేవయాని ఇంటికి వెళ్తారు. వాళ్లు రావడం గమనించిన దేవయాని ఇక నటన కౌన్సిలన్నీ ప్రదర్శించాలి అనుకుంటుంది.
లోపలికి వచ్చిన రిషి ని ఎలా ఉన్నావు, చిక్కిపోయావు, మహేంద్ర ఏడి, క్షమాపణ చెప్పాలి అంటూ హడావిడి చేస్తుంది. ఇంతలో శైలేంద్ర, ఫణీంద్ర కూడా అక్కడికి వస్తారు. ఫణీంద్ర ఎప్పుడు వచ్చావు రిషి కనీసం మాట కూడా చెప్పలేదు అంటాడు. పెద్దమ్మకి చెప్పాను పెదనాన్న అంటాడు రిషి. తను లేనిపోనివి చెప్పమంటే చెప్తుంది కానీ ఇలాంటివి ఎందుకు చెప్తుంది అంటాడు ఫణీంద్ర.
అప్పుడు రిషి మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి పెదనాన్న అని ఒక వ్యక్తికి ఫోన్ చేస్తాడు. అతను దగ్గరలోనే ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసే ఇంటి ముందు కారు ఆపుతాడు. ఇంట్లోకి వచ్చిన అతనిని ముకుల్ అని చెప్పి ఫణీంద్ర కు పరిచయం చేస్తాడు రిషి. అమ్మ కేసు ఇన్వెస్ట్గేట్ చేయడానికి అపాయింట్ అయిన ఆఫీసర్ అని చెప్తాడు. అప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు.
అమ్మ ఆరోజు నా దగ్గరికి వస్తున్నట్లు అమ్మకి నాకు తప్పితే వేరే ఎవరికీ తెలీదు. బయట వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు అంటాడు రిషి.తెలుసుకోవడంలో పెద్ద మిస్టరీ ఏమీ లేదు ఆవిడ ఫోన్ ట్రాప్ చేస్తే తెలుసుకోవచ్చు అంటాడు ఆఫీసర్. మీరు బయట వాళ్ళని కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మన అనుకున్న వాళ్ళని దగ్గర నుంచి మీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే బాగుంటుంది అంటుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.