MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Savitri: ఒంటి మీద బట్టలు తప్ప మిగిలినవన్నీ ఇచ్చేసిన సావిత్రి, క్షణం కూడా ఆలోచించలేదు.. మహానటికి సెల్యూట్

Savitri: ఒంటి మీద బట్టలు తప్ప మిగిలినవన్నీ ఇచ్చేసిన సావిత్రి, క్షణం కూడా ఆలోచించలేదు.. మహానటికి సెల్యూట్

మహానటి సావిత్రి క్షణం కూడా ఆలోచించకుండా నిలువు దోపిడీ ఇచ్చేశారు. ఈ సంఘటనతో మహానటి మనసు ఎలాంటిదో అర్థం అవుతుంది. ఇంతకీ ఈ త్యాగం సావిత్రి ఎందుకు చేశారో తెలుసా? 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 04 2026, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహానటి సావిత్రి
Image Credit : Asianet News

మహానటి సావిత్రి

చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి ఖ్యాతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. తరాలు మారిన ఆమె గురించి సినీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. పౌరాణిక సినిమాలతో పాటు అన్ని జోనర్ల కథలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సినిమాల్లో ఆమె నటన పక్కన పెడితే రియల్ లైఫ్ లో సావిత్రి గొప్ప మనసున్న వ్యక్తి. సాయం అంటూ ఎవరైనా చేయి చాచితే క్షణం కూడా ఆలోచించకుండా తోచిన సహాయం చేసేవారు. అది ఆమెకి కొన్ని సార్లు మైనస్ కూడా అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సాయం చేసే గొప్ప గుణం
Image Credit : Asianet News

సాయం చేసే గొప్ప గుణం

ఆమె మంచి మనసుని అలుసుగా తీసుకుని చాలా మంది ఆమెని మోసం చేశారు. భర్తతో మనస్పర్థలు, ఆర్థికంగా ఇబ్బందులు, మోసపోవడం లాంటివి సావిత్రిని బాగా కుంగదీశాయి. తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాయం చేయడానికి మాత్రం సావిత్రి అస్సలు వెనుకాడేవారు కాదు. ఆమె గొప్ప మనసు ఏంటో తెలియాలి అంటే ఈ సంఘటన గురించి తెలుసుకోవాలి. 1965లో ఇండియా పాక్ వార్ సమయంలో ఇండియన్ ఆర్మీకి సావిత్రి విరాళం ఇచ్చారు.

35
నిలువుదోపిడీ ఇచ్చేసిన సావిత్రి
Image Credit : X/Twitter

నిలువుదోపిడీ ఇచ్చేసిన సావిత్రి

అది అలాంటి ఇలాంటి విరాళం కాదు. నిలువు దోపిడీ ఇచ్చేశారు. ఒంటి మీద బట్టలు తప్ప మిగిలిన ఆభరాలన్నీ తీసి ఇచ్చేయడాన్ని నిలువు దోపిడీ అని అంటారు. సాధారణంగా భక్తులు దేవుళ్ళకు మొక్కుబడి ఉన్నప్పుడు ఇలా చేస్తుంటారు. కానీ సావిత్రి ఇండియన్ ఆర్మీ కోసం ఇంతటి గొప్ప త్యాగం చేశారు. మెడలో ఉన్న బంగారు, వజ్రాల హారాలు, చేతికి ఉన్న బంగారు గాజులు, ఉంగరాలు ఇలా తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ సావిత్రి తీసి ఇచ్చేశారు. దీనితో పాటు కొంత డబ్బు కూడా విరాళంగా ఇచ్చారు.

45
ప్రధాని పిలుపు మేరకు..
Image Credit : X/Twitter

ప్రధాని పిలుపు మేరకు..

అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు చాలా మంది విరాళాలు ఇచ్చారు కానీ ఇలా నిలువు దోపిడీ ఇచ్చిన ఏకైక నటి సావిత్రే అని చెప్పాలి. సావిత్రికి అప్పట్లో ఉన్న ఆస్తులన్నీ ఉండి ఉంటే ఆమె ఇండియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉండేవారు.

55
సావిత్రి ఆస్తులు
Image Credit : Facebook/Mahanati Savitri

సావిత్రి ఆస్తులు

చెన్నైలోనే సావిత్రికి నాలుగు బంగ్లాలు ఉండేవి. వీటితో పాటు హైదరాబాద్ లో 2, విజయవాడలో ఒకటి, కొడైకెనాల్ లో ఒకటి ఇలా సావిత్రికి చాలా బంగ్లాలు ఉండేవి. సావిత్రికి ఏకంగా 25 డిమాండ్ నెక్లెస్ లో ఉండేవి. పొలాలు కూడా ఉండేవి. చివరికి సావిత్రి అంతా పోగొట్టుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్
Recommended image2
Same Concept Movies: ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని సినిమాలు.. నేచురల్‌ స్టార్‌ రికార్డు సృష్టిస్తాడా?
Recommended image3
Karthi Vs Vijay: చెప్పేదొకటి చేసేదొకటి.. విజయ్ ప్రభుత్వంపై కార్తీ ఫైర్, అభిమానుల రియాక్షన్ ఇదే
Related Stories
Recommended image1
Bhumika: షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక, చైతూ మూవీలో అదేం టార్చర్ బాబోయ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు
Recommended image2
Dasara Movies: చిరు Vs రజినీ మాత్రమే కాదు..దసరా బరిలో బాలయ్య, వెంకీ, నాగ్.. బాక్సాఫీస్ అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved