జిమ్ కి వెళ్లకుండానే 21 రోజుల్లో భారీగా బరువు తగ్గిన మాధవన్, ఎలా సాధ్యం అయ్యింది?
ఆర్. మాధవన్ 21 రోజుల్లో బరువు తగ్గి ఫిట్ అయ్యారు. జిమ్, సర్జరీలు, మందులు లేకుండా, ఆహారం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన దినచర్యతో మాధవన్ ఎలా ఇది సాధించారో తెలుసా?

ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి తీవ్రమైన జిమ్ వర్కౌట్‌లు, ప్రోటీన్ షేక్స్ అని ఈ ప్రపంచం పరుగులు తీస్తోంది. వాటి వెనుక పరిగెడుతూనే ఉంది. సిక్స్ ప్యాక్ అబ్సెసన్, క్రాష్ డైట్‌లు అంటూ యంగ్ జనరేషన్ కష్టపడుతోంది. కానీ లక్షలాది మంది అమ్మాయిల హృదయం దోచుకున్న హీరో మాధవన్ మాత్రం అలాంటిదేమీ చేయకుండానే 21 రోజుల్లో దాదాపు 10 కేజీలు బరువు తగ్గి ఆశ్చర్యపరిచారు.
నిజంగా మాధవన్ మ్యాజిక్ చేశాడు. రెహానా హై తేరే దిల్ మే సినిమాలో మాధవన్ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలు కుళ్లుకునేలా ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసురుతున్నాడు మాధవన్. జిమ్ లేదు, సర్జరీ లేదు, మందులు లేవు, పరుగులు లేవు. కేవలం ఆహారం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన దినచర్యతో కేవలం 21 రోజులలో మాధవన్ అనుకున్నది సాధించాడు.
మాధవన్ ఇది ఎలా సాధించారు. తన బాడీని ఎలా కంట్రోల్ చేశారు. 21 రోజులు తాను పాటించిన నియమాలు ఏంటీ అనే విషయాన్ని ఆయన ఎక్స్ పేజ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
1) ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
మాధవన్ తాను బరువు తగ్గే ప్రక్రియలో టైమ్-రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ పాటించారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతిలో నిర్దిష్ట సమయంలో మాత్రమే తినాలి. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రోజుకు ఒక భోజనం చేయడం ద్వారా మాధవన్ అనుకున్నది సాధించాడు.
2) ఆహారాన్ని 45–60 సార్లు నమలడం
ఆహారాన్ని బాగా నమలడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. అతిగా తినకుండా ఉండటానికి, శరీరానికి పోషకాలు బాగా శోషించుకోవడానికి సహాయపడుతుంది. ఇలా నమలడం ద్వారా అతిగా ఆహారం తీసుకునే అవసరం ఉండదు. బరువు తగ్గాలి అనుకునేవారు, అతిగా ఆహారం తినేవారికి ఇది అద్భుతమైన ఉపాయం.
3) మార్నింగ్ వాక్
మాధవన్ బరువు తగ్గడానికి ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయలేదు. వాటివైపు కూడా చూడకుండా ఆయన నడకను ఎంచుకున్నారు. ఎక్కువసేపు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కేలరీలు ఖర్చవుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నడవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
4) మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆహారం లేదు
మధ్యాహ్నం తర్వాత మాధవన్ ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు లేదా సలాడ్లు వంటి ముడి ఆహారాన్ని తీసుకోలేదు. మంచి జీర్ణక్రియ కోసం అతను వండిన భోజనానికి మాత్రమే తినేవారు. ఇది జీర్ణక్రియకోసం ఎంతగానో ఉపయోగపడుతుంది.
5) సాయంత్రం 6:45 కి మధవన్ చివరి భోజనం
రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. మంచి జీర్ణక్రియ, నిద్ర, కొవ్వు కరగడానికి త్వరగా తినమే సహాయపడుతుంది. మాధవన్ ఈ విషయాన్ని పక్కాగా పాటిస్తూ వచ్చారు. ఆయన చివరి భోజనం 7 గంటల లోపు పూర్తి చేసేవారు.
6) నిద్రకు ముందు నో టీవీ, ఫోన్
నిద్రకు 90 నిమిషాల ముందు అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ ను దూరంపెట్టేవారు మాధవన్. టీవీ చూడటం కాని, ఫోన్ చూడటం కాని.. పడుకోవడానికి గంట ముందే స్క్రీన్ టైమ్‌ని ఆయన మానేశారు. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది.
7) ఎక్కువ ద్రవాలు
ద్రవాలు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి, వ్యర్థాలను బయటకు పంపి, జీర్ణక్రియకు, చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. అందుకే మాధవన్ ఎక్కువగా నీరు తాగడం తన దినచర్యలో భాగం చేసుకున్నారు.
8) జంక్ ఫుడ్ కు దూరంగా
మాధవన్ ఆహారంలో ఆకుకూరలు, పోషకాలు ఎక్కువగా ఉండే, తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఉండేది. ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ లాంటి జంక్ ఫుడ్స్ ను కంప్లీట్ గా మానేశారు. అవి అతను బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి.
మాధవన్ వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. కాని ఆయన్ను చూస్తే అంత వయసు ఉంది అంటే ఎవరు నమ్మరు. కుర్ర హీరోలకంటే కూడా మాధనవ్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఈ వయసులో అతను యవ్వనంగా కనిపించడానికి కారణం కాస్మెటిక్ ట్రీట్‌మెంట్స్ కాదు అతని సింపుల్ లైఫ్ స్టైల్. మరీ ముఖ్యంగా మాధవన్ ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తింటారు. జంక్ ఫుడ్, స్వీట్స్ చూసి రుచి కోసం తినడం మాధవన్ కు అలవాటు లేదు. ఈ మార్పు మంచి అలవాట్లతో కలిసి ఆయన ఫిట్‌గా, అందంగా ఉండటానికి సహాయపడ్డాయి.