- Home
- Entertainment
- Devata: మళ్లీ మాధవను కొట్టబోయిన రుక్మిణి.. ఆదిత్య,రాధలకు దేవిని దూరం చేయనున్న మాధవ..?
Devata: మళ్లీ మాధవను కొట్టబోయిన రుక్మిణి.. ఆదిత్య,రాధలకు దేవిని దూరం చేయనున్న మాధవ..?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగష్టు 30వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, రాధ చెప్పిన ఆ తాగుబోతు వ్యక్తి కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడికి మాధవ వస్తాడు. అప్పుడు మాధవని చూసిన ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు మాధవ నువ్వు ఇక్కడికి వస్తావని ముందే తెలిసి ఆలోచించి వాడిని ఇక్కడి నుంచి పంపించేశాను అనటంతో ఆదిత్య కోపంతో మాధవ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు మాధవ, నా గురించి తెలిసి కూడా ఇలా పదేపదే కాలర్ పట్టుకుంటున్నావు అని అనగా వెంటనే ఆదిత్య నేను ఒక్క క్షణం గట్టిగా అనుకున్నాను అంటే నువ్వు అనేవాడివి ఉండవు అని వార్నింగ్ ఇస్తాడు.
కానీ మాధవ మాత్రమే నువ్వు నన్ను ఏం చేసినా నేను మాత్రం వాడెవడో చెప్పను అని అంటాడు. ఇప్పుడు ఆదిత్య కోపంతో నిన్ను చంపిన తర్వాతే నేను నా బిడ్డని ఈ ఇంటి నుంచి తీసుకెళ్తాను అని అంటాడు. నా బిడ్డను నా నుంచి దూరం చేశావు చివరికి నా బిడ్డతో నిన్ను చంపిస్తాను అని అంటాడు ఆదిత్య. మరొకవైపు దేవి జరిగిన విషయాన్ని తలచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి జానకి వచ్చి దేవిని ఏమయింది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు జానకి ఎంత అడిగినా కూడా దేవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటూ, జానకి పై సీరియస్ అవుతుంది.
రాధ అక్కడికి రావడంతో జానకి రాధని దేవి ఎందుకు అలా ఉంది అని అడగగా నాకు కూడా సమాధానం చెప్పలేదు అని చెప్పి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఆదిత్య జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ కనిపిస్తాడు. అప్పుడు ఆదిత్య, ఆ తాగుబోతు వ్యక్తి కోసం మనుషులను పెట్టి మరీ వెతికిస్తాడు. మరొకవైపు రాధ దేవి మనసులో ఉన్న ఆలోచనలు ఎలా పోగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మాధవ చేసిన పనులను తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఇంతలోనే మాధవ అక్కడికి వస్తాడు. కానీ మాధవ మాత్రం ఎప్పటిలాగే మాట్లాడుతాడు. అప్పుడు మాధవ దేవిని నువ్వు అనుకున్న విధంగానే ఆదిత్యకు అప్పజబుదాము కానీ నువ్వు చిన్మయికి అమ్మగా నాకు భార్యగా ఉండు అని అంటుండగానే రాధా కోపంతో మాధవని కొట్టబోతుంది. దాంతో మాధవ షాక్ అవుతాడు. అప్పుడు రాధ, తనలో రుక్మిణి మాధవకు పరిచయం చేస్తుంది. ఇప్పుడు మాధవ రాధా చేసిన పనికి భయంతో గుటుకలు మింగుతూ ఉంటాడు.
మరొకవైపు ఆ తాగుబోతు వ్యక్తి దేవి స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసిన దేవి అతని దగ్గరకు వెళుతుంది. అప్పుడు దేవి కోసం అతను చాక్లెట్స్ తీసుకొని వచ్చి దేవికి ఇచ్చి,దేవీ ముందు కావాలని దొంగ ప్రేమలు చూపిస్తూ నటిస్తూ ఎమోషనల్ అవుతాడు. అప్పుడు రాధా గురించి దేవికి చెడుగా చెబుతాడు. నాకు నువ్వు మీ అమ్మ కావాలి మీ ఇద్దరితో కలిసి బతకాలని ఆశగా ఉంది అంటూ దేవి మనసుని మరింత చేయగొడతాడు.
అప్పుడు దేవి అతని మాటలో నిజమే అని నమ్ముతుంది. ఆ తర్వాత అతను అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆదిత్య వస్తాడు. మరొకవైపు రాధ రగిలిపోతూ ఉండగా ఇంతలోనే మాధవ అక్కడికి వచ్చి రాధ వెనుక వైపు నిలబడి కోపంతో రగిలిపోదు కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ తాగుబోతు వ్యక్తికి ఫోన్ చేసి దేవి నిన్ను నీతో పాటు తీసుకెళ్ళు నేను చెప్పే వరకు దేవుని నీ దగ్గరే పెట్టుకో అని చెబుతాడు. ఆ తర్వాత మాధవ కోపంతో రగిలి పోతూ కనిపిస్తాడు.