Devatha: దేవుడమ్మను భోజనానికి పిలిచిన మాధవ.. రుక్మిణి గుట్టు బయటపెట్టేందుకే ఇదంతా?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది ఈ సీరియల్. ఇక ఈరోజు జులై 12వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో ఆదిత్య, దేవికి గోరుముద్దలు పెట్టబోతు ఉండగా అప్పుడు నీకెందుకు సారు నేను తింటాను గా అని అనడంతో వెంటనే ఆదిత్య నీకు తినిపించడంలో నాకు ఆనందం ఉంటుంది అమ్మ అని చెబుతాడు. అప్పుడు దేవికి భోజనం తినిపిస్తూ ఆదిత్య మురిసిపోతూ ఉంటాడు.
ఇంతలోనే రామ్మూర్తి దంపతులు ఆదిత్యకీ వీడియో కాల్ చేస్తారు. రామ్మూర్తి దంపతులు ఆదిత్య,దేవితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా వెనుక వైపు నుంచి మాధవ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత మాధవ, రాధ దగ్గరికి వెళ్లి రాధా కొంచెం నా వాచ్ ఇస్తావా ఆఫీసర్ సార్ ఇంటికి వెళ్ళొస్తాను అనడంతో రాధా షాక్ అవుతుంది.
ఆఫీసర్ ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను మన దేవిని జూనియర్ చెస్ విజేతగా నిలబెట్టాలి అనుకుంటున్నాడు అంట కదా నాకు కూడా ఆట అంటే చాలా ఇష్టం. అప్పుడు మీరు ఆ ఇంటికి పోయి చేసేది ఏముంది అని రాధ అనగా అప్పుడు మాధవ దొంగ ప్రేమలు చూపిస్తూ నువ్వు నన్ను ఈ మధ్య ప్రతి ఒక్కదానికి ప్రశ్నిస్తున్నావు అని అంటాడు.
అప్పుడు మాధవ ఆదిత్యతోపాటు ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిని మన ఇంటికి భోజనానికి పిలుద్దామని వెళుతున్నాను అనడంతో రాధ షాక్ అవుతుంది. నేను నిన్ను కూడా పిలుచుకుని వెళ్లి అందరికీ బొట్టు పెట్టి మరి పిలుద్దాం అనుకున్నాను అనడంతో రాధ ఆశ్చర్య పోతుంది. మరొకవైపు దేవి, ఆదిత్య చెస్ ఆడుతూ ఉండగా ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి దేవినే పొగుడుతూ ఉంటుంది.
అప్పుడు దేవుడమ్మ సరే వెళ్లి పాలు తాగొద్దు రా అని అనగా ఎప్పుడూ అదేనా ముందు నేను సార్ మీద గెలవని అని అంటుంది దేవి. చూసినావా సారు అవ్వ నీ వైపే ఉంది అని అనగా అప్పుడు దేవుడమ్మ ఎంతైనా నా కొడుకు కదా అని అనగా అప్పుడు దేవి ఎంతైనా ఆఫీసర్ మీ కొడుకు నేను ఎవరో కదా అని అనడంతో ఆదిత్య బాధపడతాడు.
అప్పుడు దేవుడమ్మ మాటలకు దేవి కాస్త డల్ అయిపోగా ఇంతలోనే మాధవ అక్కడికి వచ్చి నీ వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా మీ నాన్నని నేను ఉన్నాను అని అంటాడు. ఆ మాటలు విని ఆదిత్య షాక్ అవుతాడు. అప్పుడు మాధవ కావాలనే ఆదిత్యను రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. అప్పుడు మాధవ సరే పద దేవి వెళ్దాం అని అనగా వెంటనే దేవుడమ్మ రేపు మా ఇంట్లో బోనాలు అది చూసి వస్తుంది అని అంటుంది.
అలా మొత్తానికి దేవి వెళ్లకుండా ఉండిపోతుంది. మరొకవైపు రాధ మాధవ ఏం చేస్తున్నాడో అర్థం కాక ఇంట్లో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మాధవ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య మాధవ అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలొనే అక్కడికి సత్య వస్తుంది.
అప్పుడు మాధవ దేవి ల విషయంలో ఆదిత్య ప్రవర్తిస్తున్న తీరుని తప్పుపడుతూ ఆదిత్యను మరింత బాధ పెడుతుంది సత్య. మరొకవైపు రాధ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మాధవ అక్కడికి వస్తాడు. అప్పుడు మాధవ నీలాగే మీ వాళ్ళు కూడా చాలా ప్లాన్లు వేస్తున్నారు మీ అత్త దేవుడమ్మ దేవితో బోనం ఎత్తిస్తుంది అంట అని అనడంతో రాధ లోలోపల సంతోషంగా ఫీల్ అవుతుంది.