- Home
- Entertainment
- Devatha: మాధవ ప్లాన్ సక్సెస్.. ఆదిత్య ముందే తండ్రిని తిట్టిన దేవి.. కుమిలిపోతున్న రాధ!
Devatha: మాధవ ప్లాన్ సక్సెస్.. ఆదిత్య ముందే తండ్రిని తిట్టిన దేవి.. కుమిలిపోతున్న రాధ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య(adithya) స్కూల్ దగ్గరికి రావడంతో పిల్లలు ఆనందంగా ఆదిత్య దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆదిత్య మీరు ఒక్కరే వచ్చారా అని అడగగా అవును అని బాధపడుతూ చెబుతుంది దేవి. అప్పుడు దేవి బాధగా ఉండడంతో ఆదిత్య,రుక్మిణి గురించి పదేపదే పిల్లలను ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు చిన్నయి దేవి(devi) అమ్మ ఇద్దరూ డల్ గానే ఉన్నారు అనడంతో వెంటనే ఆదిత్య ఏమైంది దేవిని అడుగుతారు.
అప్పుడు దేవి ఏమి కాలేదు స్కూల్ కీ టైం అయింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దేవి మళ్లీ ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆదిత్య(adithya)దగ్గరికి వెళ్లి పెద్ద ఆఫీసర్ కదా నువ్వు నాకు ఒక సాయం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య ఏంటి అని అడగగా.. నాకు మా నాయనని పట్టిస్తావా అనడంతో ఆదిత్య పక్కనే వింటున్న భాగ్యమ్మ ఇద్దరూ షాక్ అవుతారు. అప్పుడు దేవి ఇప్పుడున్న మాధవ(madhava)నాయన మా నాయన కాదు వేరే నాయన ఉన్నాడు అని అంటుంది.
ఆ నాయనను ఏడున్న వెతికి పట్టుకోమని చెప్పు సారు అని ఉంటుంది. అప్పుడు దేవి(devi)వాళ్ళ నాన్న గురించి ఆదిత్య ముందు మా నాన్న దుర్మార్గుడు, మా అమ్మని కష్ట పెట్టిండు, మామ కలిపితే ఉన్నది అని చూడకుండా తాగి తిట్టికొట్టేటోడు. అప్పుడు అసలు విషయం చెప్పడంతో మాధవ,భాగ్యమ్మ (bhagyamma) ఇద్దరూ ఒక్క సారిగా షాక్ అవుతారు. ఇప్పుడు ఆదిత్య లోలోపల కుమిలిపోతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
భాగ్యమ్మ కూడా దేవి(devi) మాటలు విని మాధవపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు దేవి మాటలకు ఆదిత్య ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మరొకవైపు మాధవ దేవి అన్న మాటలు తలచుకొని ఆనందపడుతూ ఉంటాడు. మరొకవైపు భాగ్యమ్మ, మాధవ పై కోపంతో మాధవ ఇంటికి వెళుతుంది. అప్పుడు రాధ(radha), భాగ్యమ్మని గమనించి భాగ్యమ్మని ఎదురు వెళుతుంది.
అప్పుడు భాగ్యమ్మ(bhagyamma)కోపంతో రగిలిపోతూ మాధవ పని చెబుతాను అనగా రాధ అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యమ్మ దేవి, ఆదిత్య అన్నమాటల గురించి చెబుతుంది. అప్పుడు రాధ,ఆదిత్య కి ఫోన్ చేయగా ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడు రాధ(radha),భాగ్యమ్మ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి నేను నీ దగ్గరికి వస్తున్నాను అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
తర్వాత ఆదిత్య(adithya), రాధ ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆదిత్య, కోపంతో రాధ పై సీరియస్ అవుతాడు. అప్పుడు ఆదిత్య బాధతో మాట్లాడుతూ ఉండగా రాధ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇదే విషయం స్కూల్లోనే చెప్పి ఉంటే అప్పుడు ఆ మాధవ(madhava)గారిని అంటూ కోపంతో రగిలిపోతూ ఉండగా ఇలా నువ్వు కోప్పడతావ్ అని చెప్పలేదు పెనిమిటి అని అంటుంది రాధ.
అప్పుడు ఆదిత్య బాధతో దేవీ(devi) నా ముందరే నన్నే తిడుతుంది రుక్మిణి అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య మాటలకు ఏమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈరోజు నేను ఆ మాదవనో తేల్చుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆ తర్వాత మాధవ(madhava)కారులో వెళుతూ ఉండగా ఇంతలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది.