- Home
- Entertainment
- Devatha: దేవిని ఆదిత్యకు శాశ్వతంగా దూరం చేసేసిన మాధవ.. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న రుక్మిణి?
Devatha: దేవిని ఆదిత్యకు శాశ్వతంగా దూరం చేసేసిన మాధవ.. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న రుక్మిణి?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య(adithya),రాధ ఎలా అయినా దేవికి అసలు నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆదిత్య ఇప్పుడు చెబితే దేవి ఏమనుకుంటుందో అని అనగా రాధ ఇప్పుడే చెప్పాలి అనే తెగ ఆరాటపడుతూ ఉంటుంది. మరొకవైపు దేవి, మాధవ(madhava)దగ్గరికి వెళ్ళగా మాధవ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. అది చూసి దేవి ఎందుకు అని టెన్షన్ పడుతూ ఉండగా అని నేను మోసం చేస్తున్నాను.
అమ్మ అంటూ దేవి(devi) తన బిడ్డ కాదు అన్నట్టుగా మాట్లాడడంతో దేవికి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మాధవ నువ్వు అనుకున్నట్టుగా నేను మీ నాన్నని కాదు అనడంతో దేవి షాక్ అవుతుంది. నేను నీకు కన్న తండ్రిని కానమ్మ అంటూ దేవికి లేనిపోని అబద్ధాలు అని నూరిపోస్తాడు. అప్పుడు మాధవ(mashava) కావాలనే దేవి మనసుని చెడగొడతాడు. మీ నాన్న ఒక నీచుడు అని అనడంతో దేవి ఆలోచనలో పడుతుంది.
ఇంతలో రాధ(radha)అక్కడికి రావడంతో దేవి ఎమోషనల్ గా వెళ్లి రాధను హత్తుకుని ఏడుస్తుంది. కానీ రాధ మాత్రం అతని విషయాన్ని చెప్పాలి అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు దేవి(devi) మాధవ సొంత నాన్న కాదంట కదా అని అడుగుతుంది. ఆ మాటకు రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మన నాయన నిన్ను చాలా కొట్టేటోడు అంట కదా అటువంటి కసాయి నాకొడుకుకీ నేను పుట్టాను అనడంతో రాధ షాక్ అవుతుంది.
ఆ మాటలు విని మాధవ(madhava) నవ్వుతూ ఉంటాడు. మరొకవైపు ఆదిత్య, రాధ,దేవి ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవుడమ్మ ఆదిత్య కు ఫోన్ చేయడంతో దేవి గెలిచింది అని చెప్పగా దేవుడమ్మ (devudamma)సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడమ్మ సంతోషంతో ఇంట్లో అందరినీ పిలిచి దేవి చెస్ కాంపిటీషన్ లో గెలిచింది అందరూ సంతోష పడుతూ ఉంటారు. మరొకవైపు ఆదిత్య దగ్గరికి రాద ఏడుస్తూ వస్తుంది.
కానీ ఆదిత్య (adithya)మాత్రం అసలు విషయం తెలియక ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య ఎంత అడిగినా కూడా రాధ(radha)చెప్పకుండా దేవిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆదిత్య కారులో వెళ్తూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మాధవ ఆనంద పడుతూ ఉంటాడు.
దేవి రాధ(radha)ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ తరువాత దేవి దాహంగా ఉంది అనడంతో ఒక హోటల్లో దేవికి సోడ తాగిపిస్తుంది. ఆ తర్వాత దేవి(devi) అన్న మాటలకు రాధ ఏమి చెప్పలేక లో లోపలకి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు నాన్న దగ్గర నుంచి వచ్చేసి మంచి పని చేశావు అనగా రాధ ఏమి చెప్పలేక ఎమోషనల్ గా మాట్లాడుతుంది.