Devatha: కూతురు మాటల వల్ల కుమిలిపోతున్న రుక్మిణి.. రాధ ఇంటికి వచ్చిన సత్య!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సత్య(sathya),దేవుడమ్మ దగ్గరికి వచ్చి ఆదిత్య ఎందుకో సరిగా మాట్లాడటం లేదు. అమెరికాకు టికెట్లు కూడా బుక్ చేశాను వచ్చేలా కనిపించడం లేదు అంటుంది. దాంతో దేవుడమ్మ కంగారు పడుతుంది. ఆ తర్వాత దేవుడమ్మ, ఆదిత్యను పిలిపిస్తుంది. అప్పుడు దేవుడమ్మ(devudamma), ఆదిత్యను పిలిచి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది.
వెంటనే ఆదిత్య(adithya)దేవుడమ్మ వాళ్ళని ఏమీ అనలేక సత్య పై సీరియస్ అయి ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసుకోకుండా అమెరికాకు వెళ్దాం వెళ్దాం అంటావు. అలాగే వెళ్దాం అని చెప్పి సత్య పై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మాధవ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవి వస్తుంది. అప్పుడు మాధవ గురించి గొప్పగా పొగుడుతూ దేవి(devi) మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే రాధ అక్కడికి వచ్చి ఆ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడు దేవి మాధవ(madhava)ను సారు అని పిలుస్తుంది. అప్పుడు మాధవ అలా మాట్లాడకు అంటూ పదేపదే నువ్వు నా కూతురివి అని అన్నాడంతో రాధ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు మాధవ మాటలు నమ్మిన దేవి మా నాయన అంత ఈజీగ విడిచి పెట్టను కసాయోడు అని అంటుంది. అప్పుడు రాధ(radha) దూరంగా చూస్తూ ఆ మాటలకు కోపం రగిలిపోతూ ఉంటుంది.
ఆ తర్వాత మాధవ దేవి(devi)కి చిన్న సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. దేవి కేక్ కట్ చేయడంతో అందరు సంతోష పడుతూ ఉంటారు. మరొకవైపు రాధకీ,ఆదిత్య ఫోన్ చేస్తూ ఉండగా రాధ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటుంది. రాధకు ఏమి జరిగిందా అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాధ(radha) జరిగిన విషయాలను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దేవి నిద్రలో కూడా మాధవ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటుంది.
ఆ మాటలకు రుక్మిణి మరింత బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రుక్మిణి(rukmini) బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాధవ వస్తాడు. అప్పుడు మాటలకు రాధ కోపంగా వెళ్ళిపోతుంది. మరొకవైపు సత్య(sathya,), ఆదిత్య అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే కమల అక్కడికి వచ్చి సత్య ఓదారుస్తుంది. ఆ తర్వాత రాధ జరిగిన విషయాల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి సత్య వస్తుంది.