- Home
- Entertainment
- Devatha: దేవికి తండ్రిగా మరో వ్యక్తిని తీసుకోచ్చిన మాధవ... ఏం చేస్తున్నావ్ అంటూ నిలదీసిన జానకమ్మ!
Devatha: దేవికి తండ్రిగా మరో వ్యక్తిని తీసుకోచ్చిన మాధవ... ఏం చేస్తున్నావ్ అంటూ నిలదీసిన జానకమ్మ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 26వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకమ్మ, ఎందుకు నువ్వు ఇంటి నుంచి బయటకు రావడం లేదు అని రుక్మిణిని అడుగుతుంది. కానీ రుక్మిణి మాత్రం జవాబు ఇవ్వకుండా మాధవ్ సార్ ఎందుకు అలా మాట్లాడారు. అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు పరీక్ష అంటున్నాడు దేవినేవైనా చేస్తాడని ఆలోచనలలో మునిగిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రాధ ఎందుకు ఇలాగ ఉన్నది నాకు తెలియకుండా ఏవైనా బాధ పడుతుందా జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోతుందేంటి అని మనసులో అనుకుంటుంది జానకమ్మ.
ఆ తర్వాత సీన్లో మాధవ్ చిన్మయి ని స్కూల్లో దేబెట్టి దేవిని పార్క్ కి తీసుకొస్తాడు. అక్కడ దేవి ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఒక మనిషి వచ్చి రుక్మిణీ,దేవి ఫోటో పట్టుకొని వీళ్లను చూశారా అని అందరినీ అడిగి చివరికి మాధవి దగ్గరికి వస్తాడు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూశారా అని మాధవ్ ని అడగగా మాధవ్ దేవిని పిలుస్తాడు అప్పుడు. నా కూతురు నా కళ్ళ ముందే ఉన్నది అని ఆనందపడి నా కూతురు దేవి అచ్చు అమ్మ రాధ లాగే ఉన్నది అని అంటాడు వాడు. మీరెవరు అని దేవి అడగగానే నేనే నమ్మా మీ నాయనని.
రాదని కడుపుతో ఉన్నప్పుడు తాగి వచ్చి కొట్టేవాణ్ణి, నా మీద కోపంతో రాధ ఎక్కడికో వెళ్ళిపోయింది తర్వాత నాకు కూతురు పుట్టిందని తెలిసి నా అలవాట్లు అన్ని మార్చుకొని రాదని,నిన్ను ఇంటికి తీసుకువద్దాము అని ఇప్పటివరకు మీకోసం వెతుకుతూ ఉన్నాను. ఆఖరికి మీరు దొరికారు అని ఏడుస్తూ ఉంటాడు.అప్పుడు మాధవ్, ఇంతలా బాధపడుతున్నారంటే ఆయనే మీ నాయన అయ్యుంటారు దేవి. చూసావా అన్ని మారి మీ నాన్న నీకోసం వచ్చారు.ఈ విషయం నువ్వు అమ్మకు చెప్పొద్దు.
మళ్ళీ ఎక్కడి మీ నాయన నిన్ను కొడతారేమో అని బాధతో ఆయన మీ నాయన కాదు అని చెప్పినా చెప్తుంది అని మాధవ్ అంటాడు. అప్పుడు ఆ మనిషి నేను మారిపోయాను అమ్మ నిన్ను మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను నాకు ఒక్క అవకాశం ఇవ్వమని అంటాడు.అప్పుడు మాధవ్, రాధ ఒప్పుకుంటేనే నేను దేవిని నీ దగ్గరికి పంపిస్తాను అని అక్కడ నుంచి దేవిని కారులో ఎక్కిస్తాడు. అప్పుడు మాధవ్ ఆ మనిషి నీ చూసి చిన్న నవ్వుతాడు.
అప్పుడు కారు వెళ్లిపోయిన తర్వాత కన్నీళ్లు అన్ని తుడుచుకొని వాడి దారిన ఆ మనిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో దేవి ఏడుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి హద్దుకుంటుంది. ఏమైంది అని అడిగినా ఏమి చెప్పదు అప్పుడు రుక్మిణి మాధవ్ ఏమైనా చేశాడా అని అనుకుంటది.ఆ తర్వాత ఆదిత్య స్కూల్ ఎదురుగుండా దేవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతట్లో చిన్మయ అక్కడికి వచ్చి పలకరిస్తుంది.దేవి ఏది అని అనగానే నాయన దేవి ని ఎక్కడికో తీసుకెళ్లాడు నేను ఒక్కదాన్నేఈ రోజు స్కూల్ కి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అంతలో రుక్మిణి ఆదిత్య కి ఫోన్ చేసి మాధవ్ దేవి ఏవైనా చేసి ఉంటారా? పాప ఇందాక నుంచి ఏడుస్తూనే ఉన్నది అని అంటుంది. నువ్వేం భయపడొద్దు నేను చూసుకుంటాను అని అంటాడు ఆదిత్య. ఆ తర్వాత జానకమ్మ మాధవ్ దగ్గరికి వెళ్లి అసలు నువ్వు ఏం చేస్తున్నావురా? దేవిని ఎక్కడికి తీసుకెళ్లావు? అని అనగా పుస్తకాలు కొనడానికి తీసుకెళ్లాను అని మాధవ్ అంటాడు .అప్పుడు జానకమ్మ తల్లి దగ్గర నువ్వు అబద్ధం చెప్పలేవు అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!