MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?

Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?

Maa Inti Bangaram Review: సమంత మూడేళ్ల గ్యాప్‌ తర్వాత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన మూవీ `మా ఇంటి బంగారం`. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్‌ నిడిమోరు నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

4 Min read
Author : Aithagoni Raju
Published : Jun 19 2026, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మా ఇంటి బంగారం మూవీ రివ్యూ
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ

సమంత అనారోగ్యంతో మూడేళ్ల క్రితం సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇస్తూ ఆమె `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటించింది. `ఓ బేబీ` తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేసిన చిత్రమిది. ట్రాలాల పిక్చర్స్ పతాకంపై సమంత, ఆమె భర్త రాజ్‌ నిడిమోరు దీన్ని నిర్మించారు. ఇందులో శ్రీముఖి మరో కీలక పాత్రలో నటించారు. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు శుక్రవారం(జూన్‌ 19)న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సమంత అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మా ఇంటి బంగారం మూవీ కథ ఏంటంటే?
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం మూవీ కథ ఏంటంటే?

స్వర్ణ(సమంత)... హనీ(దిగంద్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. హనీ డాక్టర్‌. హనీ చెల్లి పెళ్లి కోసం చాలా రోజుల తర్వాత తన ఊరు బల్లవరం  కి వస్తారు. స్వర్ణని చూసి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోతారు. ఇంట్లో అందరు ఆమెని అంత ఈజీగా కలుపుకోరు. ప్రశ్నలతో ఆడుకుంటారు. దీంతో వారిని మ్యానేజ్‌ చేయలేక ఇబ్బంది పడుతుంది స్వర్ణ. కానీ నెమ్మదిగా వారికి నచ్చిన పనులు చేస్తూ దగ్గరవుతుంది. అటు మామయ్య, అత్తయ్యలను కూడా ఫిదా చేస్తుంది. ఉత్తమ కోడలిగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తనని ఒకడు వెంటాడుతుంటాడు. అతను కరుణ(గుల్షన్‌ దేవయ్య) మనిషి. తను అచ్చం ఝాన్సీలా ఉండటంతో ఆమెని చంపేయమని చెబుతాడు. కానీ కరుణ మనిషిని చంపేస్తుంది స్వర్ణ. దీంతో జైల్లో ఉన్న కరుణ రంగంలోకి దిగుతాడు. వచ్చి స్వర్ణని కలుస్తాడు. ఆమెకి చేసుకుందని తెలిసి షాక్‌ అవుతాడు. బాధపడతాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెబుతాడు. ఫ్యామిలీ వదిలేసి తనతో రమ్మని,  లేదంటే ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తాడు. మరి కరుణ వార్నింగ్‌కి స్వర్ణ భయపడిందా? అతనితో వెళ్లిపోయిందా? ఇంతకి కరుణ ఎవరు? స్వర్ణకి అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఝాన్సీ కథేంటి? ఝాన్సీ..స్వర్ణగా ఎలా మారింది? తన ఫ్యామిలీ కోసం స్వర్ణ చేసిన పోరాటం ఏంటి? ఇందులో శ్రీముఖి పాత్రేంటి? అనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Related image2
Save The Tigers 3 Review: సేవ్‌ ది టైగర్స్ 3 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. టైగర్స్ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యారా?
36
మా ఇంటి బంగారం మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం మూవీ విశ్లేషణ

క్రైమ్‌ బ్యాక్‌ డ్రాప్‌ ఉన్న ఒక అమ్మాయి ఒక డాక్టర్‌ ని ప్రేమించి పెళ్లి చేసుకొని తన గతాన్ని వదిలేసి కొత్తగా ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుండగా, మళ్లీ గతం తనని వెంటాడుతుంది. అది తన ఫ్యామిలీని ప్రమాదంలో పడేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆమె చేసిన పోరాటమే ఈ మూవీ కథ. కథ పరంగా చూడ్డానికి ఇది `అతడు` సినిమాని పోలి ఉంటుంది. అది హీరో వెర్షన్‌లో ఉంటే, ఇది హీరోయిన్‌ వెర్షన్‌లో ఉంటుంది. అంతే తేడా మిగిలినదంతా సేమ్‌ టూ సేమ్‌. ప్రారంభంలో సమంత, తన భర్తతో కలిసి ఊరు రావడం, ఇంట్లో తనని వింతగా చూడటం, ఆమెకి ఫ్యామిలీ కట్టుబాట్లు తెలియకపోవడం, అవి నేర్చుకునే క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాల్లో మంచి కామెడీ ఉంటుంది. అది నవ్వించేలా ఉంటుంది. సమంత ఇన్నోసెంట్‌ గా యాక్ట్ చేసిన తీరు, ఆమె అమాయకంగా కామెడీని పలికించిన తీరు ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఉత్తమ కోడలు అనిపించుకోవడానికి, శ్రీముఖిని మించి బెస్ట్ అనిపించుకోవడం కోసం సమంత చేసే పనులు హిలేరియస్‌గా ఉంటాయి. అందుకోసం తన ఫ్రెండ్‌ ద్వారా వంటలు చేయించడం, ముగ్గులు వేయించడం వంటి సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. ఇదంతా ఓ వైపు తన గతం తాలుకూ విలన్లు వెంటాడటం మరోవైపు. ఈ క్రమంలో వచ్చే యాక్షణ్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఫస్టాఫ్‌ సాగుతుంది. ఇంటర్వెల్‌ వరకు రసవత్తరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో గుల్షన్‌ దేవయ్య పాత్ర ఎంట్రీతో మూవీపై హైప్ పెరిగింది. కానీ ఆ తర్వాత వచ్చే సీన్లు ఆ స్థాయిలో లేవు, కథని డైవర్స్ చేసేలా ఉంటాయి. సడెన్‌గా ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నా, తనతో వచ్చేయ్‌ అని విలన్‌ చెప్పడం, ఆమెని వెంటాడటం వంటి సీన్లు కన్విన్సింగ్‌గా లేవు. ఆయన పాత్ర ఎందుకు అలా వెంటాడుతుందనేదానికి బలమైన కారణంగానీ, బలమైన సన్నివేశాలుగానీ లేవు. ఏదో డ్రామా కోసం క్రియేట్‌ చేసినట్టుగా ఉన్నాయి తప్పితే, ఏమాత్రం కథని ముందుకు తీసుకెళ్లేలా లేవు. ఇక క్లైమాక్స్ లో ఊహించినట్టుగానే తానేంటో ఫ్యామిలీకి చెప్పడం, విలన్‌తో పోరాటమనే సీన్లు రొటీన్‌గానే ఉన్నాయి. ఫస్టాఫ్‌ రేంజ్‌లో సెకండాఫ్‌ లేదు. కొంత ల్యాగ్‌ అనేలా ఉంది. క్లైమాక్స్ ఫైట్‌ కూడా తేలిపోయింది. ప్రీ క్లైమాక్స్ కి ముందు హైప్‌ ఇవ్వడంతో, ఆ తర్వాత సీన్లు ఆ స్థాయిలో లేకపోవడంతో డల్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. డ్రామా కొంత, ఎమోషనల్‌ సీన్లు ద్వితీయార్థంలో సరిగ్గా పండలేదు. దీంతో సినిమా నిరాశపరుస్తుంది.

46
మా ఇంటి బంగారం లో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం లో నటీనటులు ఎలా చేశారంటే?

స్వర్ణ పాత్రలో సమంత ఇరగదీసింది. ఓ వైపు ఇన్నోసెంట్‌గా, ఇంకోవైపు యాక్షన్‌తో వీరమహిళగా కనిపించి అదరగొట్టింది. సినిమాని తన భుజాలపై మోసిందని చెప్పొచ్చు. నటిగా ఆమెని మరో స్థాయికి తీసుకెళ్లే మూవీ అవుతుంది. మంచికమ్‌ బ్యాక్‌ అవుతుంది. హనీగా దిగంత్‌ సెటిల్డ్ గా బాగా చేశాడు. కరుణగా గుల్షన్‌ దేవయ్య అదరగొట్టాడు. కాకపోతే ఆయన పాత్రలో క్లారిటీ మిస్‌ అయ్యింది. రెండో కోడలుగా శ్రీముఖి బాగా చేసింది. ఆమెకి మంచి సీన్లు పడ్డాయి. సమంత ఫ్రెండ్‌గా చేసిన మంజుష నవ్వించింది, మెప్పించింది. అదరగొట్టింది. పెళ్లి కూతురుగా చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఆమెకి వరుసగా సినిమాలువస్తాయి. పోలీస్‌గా చైతన్య కృష్ణ ఆకట్టుకున్నాడు. అత్తగా గౌతమి ఈజీగా తన పాత్రలో జీవించింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

56
మా ఇంటి బంగారం టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సంతోష్‌ నారాయణ్‌ మ్యూజిక్‌ మరో అసెట్‌. పెళ్లిలో పాట హైలైట్‌గా నిలుస్తుంది. ఆర్‌ ఆర్‌ అదిరిపోయింది. సినిమాకి ప్లస్‌ గా మారింది. కెమెరా వర్క్ కూడా బాగుంది. విజువల్స్ కనువిందుగా ఉంది. ఎడిటింగ్‌ పరంగా నీట్‌గా ఉంది. దర్శకురాలు నందిని రెడ్డి మంచి కథని ఎంచుకుంది. బాగా చేసింది. కానీ సెకండాఫ్‌ని డీల్‌ చేయడంలో తడబడింది. కథనం పరంగా లోపాలున్నాయి. సెకండాఫ్‌లో ఎమోషన్స్, డ్రామాని బ్యాలెన్స్ చేయడంలో ఫెయిల్‌ అయ్యారు. విలన్‌ ని సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. కానీ మాటలు బాగున్నాయి.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

నటిగా సమంతకిది మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చే చిత్రమవుతుంది. 

రేటింగ్‌: 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Recommended image2
Irumudi Review: ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
Recommended image3
Ameer Log Movie Review: అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ.. పాతబస్తీ పోరగాళ్ల బిర్యానీ కథ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Recommended image2
Save The Tigers 3 Review: సేవ్‌ ది టైగర్స్ 3 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. టైగర్స్ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved