MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nandini Reddy: రౌడీలు ఇంటికి వచ్చి బెదిరించారు, అందుకే ఈ అబ్బాయి గెటప్.. డైరెక్టర్ నందినీ రెడ్డి

Nandini Reddy: రౌడీలు ఇంటికి వచ్చి బెదిరించారు, అందుకే ఈ అబ్బాయి గెటప్.. డైరెక్టర్ నందినీ రెడ్డి

Nandini Reddy: చాలా కాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో డైరెక్టర్ నందినీ రెడ్డి మంచి హిట్ అందుకున్నారు. సమంత తో కలిసి ఆమె చేసిన మ్యాజిక్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 21 2026, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన  నందినీ రెడ్డి..
Image Credit : our own

మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి..

తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు చాలా అరుదు. అలాంటి వారిలో.. నందినీ రెడ్డి ఒకరు. ఆమె తీసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ.. ప్రతి సినిమా చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. తన మొదటి సినిమా అలా మొదలైంది దగ్గర నుంచి... రీసెంట్ గా విడుదలైన మా ఇంటి బంగారం వరకు.. ప్రతి సినిమాలోనూ తన మార్క్ చూపించారు. ఇప్పుడు సక్సెస్ ఫుల్ దర్శకురాలిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. గతంలో అసలు సినిమాల్లోకి వచ్చి తప్పు చేశానా అని బాధ పడిన రోజులు కూడా ఉన్నాయంట. అంతేకాదు.. పార్ట్ టైమ్ గా ఆర్జేగా కూడా పనిచేశారు.

గతంలో నందినీ రెడ్డి.. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చాలా పంచుకున్నారు. ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్ అందరిలా కాకుండా భిన్నంగా ఉండటానికి గల కారణాన్ని కూడా వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కెరీర్ లో స్ట్రగుల్స్..
Image Credit : our own

కెరీర్ లో స్ట్రగుల్స్..

‘నేను సినిమా మొదలుపెట్టాలి అనుకున్నప్పటి నుంచి..అలా మొదలైంది సినిమా రిలీజ్ అవ్వడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. అప్పటికి నా ఫ్రెండ్స్ అందరూ బాగా సెటిల్ అయిపోయారు. మంచి డాక్టర్లు అయిపోయారు. వాళ్లంతా నేను సినీ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నాను అని అనుకునేవారు..వాళ్లని చూసినప్పుడల్లా నేను కూడా మెడిసిన్ చేసి ఉంటే బాగుండేది.. అనవసరంగా ఈ ఫీల్డ్ కి వచ్చాను అనే ఫీలింగ్ వచ్చేది. కానీ.. తర్వాత ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి సినిమా చేద్దాం అనగానే.. ఆ ఆలోచన ఎగిరిపోయేది’ అని నందినీ రెడ్డి చెప్పారు.

‘ఈ సినిమాల్లో సక్సెస్ అవ్వడానికి ముందు ఆర్జే గా పని చేశాను.. ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడతాను అని.. మా ఫ్రెండ్ ఆర్జేగా ఆఫర్ ఇచ్చింది. అక్కడ నాకు నెలకు రూ.20వేలు వచ్చేవి. నా దగ్గర ఒక టూవీలర్ ఉండేది.. దాని పెట్రోల్ కి పోగా చిన్న చిన్న ఖర్చులకు ఆ డబ్బు సరిపోయేది. అలా మొదలైంది సినిమా డైరెక్ట్ చేసినందుకు నాకు రూ.5లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఆ సినిమా తమిళ్ రైట్స్ అమ్మిన తర్వాత మరో రూ.20లక్షలు ఇచ్చారు. ఆ టైమ్ కి మా అమ్మకు రూ.10లక్షల అప్పు ఉంది. డబ్బులు ఇవ్వమని అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి మీదకు రౌడీలను పంపించారు. వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే.. నేనే ఆపాను. నా సినిమా రేపు రిలీజ్ అవుతుంది. రేపు వచ్చి మీ డబ్బు ఇచ్చేస్తాను అని చెప్పాను. రెమ్యూనరేషన్ డబ్బుతో ఆ అప్పు తీర్చాను.నా అదృష్టం బాగుండి.. సినిమా హిట్ అయ్యింది..అప్పు తీర్చగలిగాను’ అని నందిని రెడ్డి చెప్పారు.

34
డ్రెస్సింగ్.. హెయిర్ స్టైల్ గురించి ఏమన్నారంటే..
Image Credit : our own

డ్రెస్సింగ్.. హెయిర్ స్టైల్ గురించి ఏమన్నారంటే..

‘ చిన్నప్పుడు నాది ఉంగరాల జుట్టు.. జడ వేస్తుంటే.. చాలా నొప్పిగా ఉండేది. అందుకే.. వీలైనప్పుడల్లా హెయిర్ కట్ చేసుకునేదాన్ని.. అదే ఇప్పటికీ కంటిన్యూ అయ్యింది. ఇక నేను.. స్పోర్ట్స్ పర్సన్. కాబట్టి.. చిన్నప్పటి నుంచి షార్ట్స్ వేసుకోవడం అలవాటు అయ్యింది..కంఫర్ట్ ఎక్కువ కోరుకుంటాను.. అందుకే.. ఇలాంటి బట్టలు వేసుకుంటాను. నేను 20ల్లో ఉన్నప్పుడు చీరలు కట్టుకున్నాను. కానీ.. నాకు చీర కట్టుకొని నడవడం కంఫర్ట్ గా అనిపించదు. మీరు ఎంత ఖరీదైన బట్టలు ఇచ్చినా నేను కంఫర్ట్ గా ఉన్నవి మాత్రమే వేసుకుంటాను.  అందుకే ఇలాంటి దుస్తులు వేసుకుంటాను’ అని నందిని రెడ్డి చెప్పారు.

44
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..
Image Credit : our own

పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..

‘ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో ఉన్నప్పుడు నేను కూడా ప్రేమలో పడ్డాను. ఆ ఏజ్ లో పెళ్లిదాకా వెళ్లేదు.  కానీ .. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్లిన తర్వాత నాకు నచ్చిన వ్యక్తి ఎవరూ దొరకలేదు. నా కెరీర్ ని అర్థం చేసుకునే వ్యక్తి దొరకలేదు. మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి కానీ.. నాకు కరెక్ట్ అనిపించలేదు. ఒంటరి అనే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు.. అందుకే పెళ్లి చేసుకోలేదు’ అని నందిని రెడ్డి చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise 3 Days Collections: ప్యారడైజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు, వామ్మో ఈ రేంజ్‌లోనా.. నానిని ఆపడం కష్టమే
Recommended image2
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Recommended image3
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Related Stories
Recommended image1
Folk Song: రెండు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న పాట..ప్రతి పెళ్లిలో ఈ పాట వినపడాల్సిందే..!
Recommended image2
Ambani: అంబానీ కోడళ్లు... వారి భర్తల కంటే పెద్దవారా? ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved