MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` వేదికగా వార్నింగ్‌ ఇచ్చాడా? అహంకారం చూపిస్తున్నది ఎవరు?

పవన్‌ కళ్యాణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` వేదికగా వార్నింగ్‌ ఇచ్చాడా? అహంకారం చూపిస్తున్నది ఎవరు?

పవన్‌ కళ్యాణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూలాలు మర్చిపోవద్దు అంటూ, రామ్‌ చరణ్‌ లో అహంకారం లేదంటూ కామెంట్‌ చేశారు. పరోక్షంగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Jan 04 2025, 11:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజాగా `గేమ్‌ ఛేంజర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టికెట్‌ రేట్లు ఎందుకు పెంచుతామో తెలిపారు. డిమాండ్‌ అండ్‌ సప్లై బేస్ మీద టికెట్‌ రేట్లు పెంచుతామని, పెద్ద సినిమాలకు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు డబ్బులు రావాలంటే టికెట్‌ రేట్లు పెంచాలనే విషయాన్ని తెలిపారు. అయితే పెంచిన డబ్బుల్లో 18 శాతం ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వస్తుందన్నారు పవన్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరోవైపు ఏపీలో సినిమాని అభివృద్ధి చేయాలని, అక్కడ కూడా ఇనిస్టిట్యూట్లు పెట్టాలని, దర్శకత్వం, ఆర్ట్, కొరియోగ్రఫీ, మ్యూజిక్‌ ఇలా వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం అన్ని రకాలుగాసపోర్ట్ గా ఉంటుందన్నారు. ఇంకోవైపు సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పారు పవన్‌.

`వకీల్‌ సాబ్‌`లో అమ్మాయిని వర్జీనా అనే డైలాగ్‌ చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, చెప్పలేను అని చెప్పినట్టు తెలిపారు.కాబట్టి సినిమాల ద్వారా మంచి విషయాలు చెప్పాలని, శంకర్ గారు తీసిన `ఒకే ఒక్కడు`, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి.

ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. 

 

35

ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ ఓ విషయాన్ని బలంగా చెప్పారు. చిరంజీవి గురించి గొప్పగా చెప్పారు. బేసిక్‌గా పవన్‌ అన్నయ్య గురించి తరచూ చెబుతుంటారు, కానీ ఏ విషయం చెప్పాలో అంతే చెబుతారు. కానీ ఈ ఈవెంట్‌లో మాత్రం చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పారు.

తాను డిప్యూటీ సీఎం అయినా, మన్యంలో కాలినడకన వెళ్లగలిగినా,ఈ స్థాయికి ఎదిగినా, చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌ అయినా దానికి మూలం చిరంజీవి అని, ఆయన కష్టం వల్లే తాము ఎదిగామని, మూలాలు ఎప్పుడూ మర్చిపోకూడదని తెలిపారు పవన్‌.

రామ్‌ చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌ అయినా, ఆస్కార్‌ వేదిక వరకు వెళ్లినా, విజయం గర్వం ఉండదని, డౌన్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తాడని, తమ ఫ్యామిలీ అహంకారం ఉండదని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే లక్షణం చిరంజీవి నుంచి నేర్చుకున్నాడని రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. 
 

45

అయితే మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అనేది మూలాలు మర్చిపోకూడదని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు పవన్‌. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. పవన్‌ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పవన్‌ వ్యాఖ్యలను అల్లు అర్జున్‌ సంఘటనతో ముడిపెడుతున్నారు నెటిజన్లు.

`పుష్ప 2` సినిమా విషయంలో అల్లు అర్జున్‌ అతి చేశారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన పరోక్షంగా ఆ హీరోకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారని అంటున్నారు నెటిజన్లు. అందుకే ఆయా విషయాలను బలంగా చెప్పాడని అంటున్నారు. మొత్తానికి బన్నీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.

55

మరోవైపు ఇండస్ట్రీ గురించి, ఇతర హీరోల గురించి మాట్లాడారు పవన్‌. ఏపీలో వైసీపీ ప్రభుత్వంలా తాము వ్యవహరించమని, సినిమానికి రాజకీయ రంగు పులుమడం తనకు నచ్చదని, హీరోలతో నమస్కారాలు పెట్టించుకోవడం నచ్చదని తెలిపారు.

అది చిన్న మనస్కులు చేస్తారని, తాము ఎప్పుడూ ఆలోచించమని తెలిపారు. తమ కూటమికి చాలా మంది హీరోలు సపోర్ట్ చేయలేదు. కానీ టికెట్‌ రేట్ల విషయంలో తాము ఆ వివక్ష చూపించడం లేదని, అందరిని సమానంగానే చూస్తున్నామన్నారు.

స్వర్గీయ ఎన్టీరామారావు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద వివక్షను చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడూ తెలుగు చిత్ర సీమ అభివృద్దికి దోహద పడుతూనే ఉన్నారని తెలిపారు. తమకు సపోర్ట్ చేయకపోయినా టికెట్‌ రేట్లు పెంచే విషయంలో సపోర్ట్ చేస్తున్నామని, సినిమాని, రాజకీయాలను సెపరేట్‌గానే చూస్తానని తెలిపారు పవన్‌. 

read more: మూలాలు మర్చిపోకూడదు, రామ్ చరణ్ చిరంజీవి వారసుడు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
also read: 'గేమ్ ఛేంజర్' కథ శంకర్ గారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశారో తెలుసా.. రాంచరణ్ క్రేజీ కామెంట్స్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved