`గేమ్ ఛేంజర్` సినిమాకి కొత్త చిక్కులు.. అక్కడ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందా?
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన `గేమ్ ఛేంజర్` మూవీ మరో ఆరు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు దీనికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.
గేమ్ ఛేంజర్
తమిళ సినీ పరిశ్రమలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన దర్శకుడు శంకర్. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా `గేమ్ ఛేంజర్`. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జనవరి 10న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి.
గేమ్ ఛేంజర్ పొంగల్ విడుదల
`గేమ్ ఛేంజర్` సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉండగా, ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది టీమ్. ఆ సినిమా విడుదలకు తమిళనాడులో చిక్కు వచ్చిందట. ముఖ్యంగా `గేమ్ ఛేంజర్` సినిమా విడుదలకు లైకా సంస్థ అడ్డంకిగా ఉందని సమాచారం. ఎందుకంటే శంకర్ దర్శకత్వంలో చివరిగా వచ్చిన `భారతీయుడు 2` సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతేకాకుండా ఆ సినిమాని నిర్మించిన లైకా సంస్థకు భారీ నష్టాన్ని మిగిల్చింది.
read more: అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 8 సినిమాలు
రామ్ చరణ్
`భారతీయుడు 2` షూటింగ్ జరుగుతున్నప్పుడే దాని 3వ భాగాన్ని కూడా పూర్తి చేశారు శంకర్. అందులో ఇంకా ఒక పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఇండియన్ 2 ఫలితాన్ని చూసి కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరించాలని శంకర్ నిర్ణయించుకున్నారు, దానికి రూ.80 కోట్ల వరకు ఖర్చవుతుందని అడిగారట. అందులో ఆయన రూ.30 కోట్ల పారితోషికం కూడా ఉందట.
కానీ లైకా వారు, ఇండియన్ 2 సినిమా ఇప్పటికే పరాజయం పాలైంది కాబట్టి పారితోషికాన్ని తగ్గించి నిర్మాణ ఖర్చులు మాత్రమే ఇస్తామని చెప్పారట. దానితో పాటు ఇప్పటివరకు తీసిన `భారతీయుడు 3` సినిమాని విడుదల చేయమని అడిగారట. దానికి శంకర్ ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు కొనసాగుతున్నాయని సమాచారం.
గేమ్ ఛేంజర్ విడుదలకు చిక్కు
ఈ నేపథ్యంలో, లైకా సంస్థ సినీ కౌన్సిల్‌లో `గేమ్ ఛేంజర్` సినిమాని తమిళనాడులో విడుదల చేయకుండా నిషేధించాలని ఫిర్యాదు చేసిందట. `ఇండియన్ 3` సినిమాని పూర్తి చేసి ఇవ్వడానికి శంకర్ ఒప్పుకోకపోతే ఆ సినిమాని తమిళనాడులో విడుదల చేయకూడదని చెప్పారట.
దీంతో టెన్షన్ పడ్డ `గేమ్ ఛేంజర్` సినిమా నిర్మాత దిల్ రాజు, వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సమస్యల వల్ల నేను నిర్మించిన సినిమాని నిషేధించమని చెప్పడం సరికాదు. ఇది చాలా తప్పు అని హెచ్చరించారట. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా పొంగల్ కి విడుదలవుతుందా లేదా అనేది సందిగ్ధంలో ఉంది. ఆ సందిగ్దం ఇంకా కొనసాగుతుంది. మరి ఈ విషయంలో శంకర్ తగ్గుతాడా? లైకా ప్రొడక్షన్ తగ్గుతుందా? ఇంతకి `గేమ్ ఛేంజర్` కోలీవుడ్ రిలీజ్‌కి లైన్ క్లీయర్ అవుతుందా అనేది చూడాలి. ఇది సస్పెన్స్ గా మారింది.
read more: గేమ్ ఛేంజర్ తప్పక చూడాలని చెప్పే 5 కీలక అంశాలు!