- Home
- Entertainment
- అల్లు అర్జున్, ఎన్టీఆర్ మిస్ అయ్యారు, రవితేజ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?
అల్లు అర్జున్, ఎన్టీఆర్ మిస్ అయ్యారు, రవితేజ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?
కొన్ని సినిమాలు కొంత మంది హీరోలు వద్దని వదిలేస్తుంటారు. కాని అవే సినిమాలు వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కథను అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు. కాని మాస్ మహారాజ్ రవితేజ్ మాత్రం హిట్ కొట్టాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ఒకప్పుడు సౌత్ లో మాత్రమే ఉన్నబన్నీ క్రేజ్ ఇప్పుడు నార్త్ లో అంతకు మించి మెలుగుతోంది. అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
ఇటీవల పుష్ప 2తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయమొకటి వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ వదులుకున్న ఓ కథ రవితేజ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని తెలిసింది.
అల్లు అర్జున్‌కు హీరోగా "గంగోత్రి" సినిమా ద్వారా పరిచయం లభించింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆయనకు తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను ‘భద్ర సినిమా కథను ముందుగా అల్లు అర్జున్‌కు వినిపించారు. కానీ అప్పటికే బన్నీ మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండటంతో, ఆ సినిమా చేయలేకపోయారు.
ఇక ఈ కథను ఎన్టీఆర్‌కి కూడా వినిపించారట బోయపాటి. అయితే కథ వింటుండగా బోయపాటి శ్రీను చెప్పే విధానంతోనే ఇందులో వయోలెన్స్ ఎక్కువగా ఉందని తారక్ అన్నారట. అందుకే ఈసినిమా చేయలేను అని చెప్పారట. అలా ఎన్టీఆర్ కూడా భద్ర సినిమాను మిస్ అయ్యాడు. అటు అల్లు అర్జున్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరు ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఈసినిమా కాస్త మాస్ మహరాజ్ ను చేరింది.
బోయపాటి శ్రీను అదే కథను మాస్ మహారాజా రవితేజకు వినిపించారు. కథ వినగానే రవితేజ వెంటనే ఓకే చెప్పారు. అలా 2005లో విడుదలైన ‘భద్ర’ సినిమా రిలీజ్ అయ్యి రవితేజ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. యాక్షన్, సెంటిమెంట్, మాస్ ఎలిమెంట్స్ అన్నింటినీ సమపాళ్లలో కలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
‘భద్ర’ సినిమాలో రవితేజ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించగా, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బోయపాటి శ్రీను ఈ సినిమాతో డైరెక్టర్‌గా తనదైన ముద్రవేశారు. సినిమా విడుదలైన తర్వాత రవితేజకు భారీ క్రేజ్ వచ్చింది. బోయపాటికి కూడా అవకాశాలు పెరిగిపోయాయి. మాస్ సినిమాల దర్శకుడిగా బోయపాటికి ఇమేజ్ వచ్చింది.
ఇలా అల్లు అర్జున్, ఎన్టీఆర్ వదులుకున్న కథను రవితేజ అంగీకరించడంతో అది బ్లాక్‌బస్టర్ విజయం సాధించి, వారి కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. అయితే అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరు బోయపాటితో ఆతరువాత చెరో సినిమా చేశారు. ఎన్టీఆర్ బోయపాటి కాంబోలో దమ్ము సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ బోయపాటి కాంబోలో వచ్చిన సరైనోడు సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణతో అఖండ 2 మూవీని తెరకెక్కిస్తున్నారు.