EVK: రాజా రవీంద్రకు కోటి రూపాయలు తెచ్చి పెట్టిన ఆ మూడు ప్రశ్నలు ఇవే, మీకు ఆన్సర్స్ తెలుసా?

తెలుగు రాష్ట్రాలలో సబ్ ఇన్స్పెక్టర్ రాజా రవీంద్ర (Raja raveendra)పేరు ఇప్పుడు మారు మ్రోగుతుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో హైయెస్ట్  ప్రైజ్ మనీగా ఉన్న కోటి రూపాయలు అతడు గెలుచుకోవడం జరిగింది. మరి రాజా రవీంద్రను కోటీశ్వరుడిని చేసిన ఆ మూడు ప్రశ్నలు ఏమిటో ఇప్పుడు చూద్దాం... 

ntr host evaru meelo koteeswarulu this is the question made raja raveendra millionaire

ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru meelo koteeswarulu)షోలో హోస్ట్ ఎన్టీఆర్ ఎదురుగా హాట్ సీట్ లో కూర్చున్న రాజా రవీంద్ర అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సోమవారం ఎపిసోడ్ లో ఆయన వరుసగా 12 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో అతడు కేవలం ఒక లైఫ్ లైన్ ని  మాత్రమే ఉపయోగించుకున్నాడు. అంతటితో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ డే మంగళవారం ఆయన జర్నీ 13వ ప్రశ్నతో మొదలైంది. 

అప్పటికి రూ. 12,50,000 గెలుచుకోగా.. రూ 25,00000 కోసం 13వ ప్రశ్నను ఎదుర్కొన్నారు. రాజా రవీంద్రను 13వ ప్రశ్నగా.... 

2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్‌ భాషలో '40 రోజులు' అని అర్థం వచ్చే ఒక పదం నుండి వచ్చింది?
A)లాక్‌డౌన్‌
B)ఐసోలేషన్‌
C)క్వారంటైన్‌
D)పాండమిక్  
ఈ ప్రశ్నకు రాజా రవీంద్ర మిగిలిన రెండు లైఫ్ లైన్స్ లో ఒకటి ఉపయోగించుకొని.. C . క్వారంటైన్ అని కరెక్ట్ సమాధానం చెప్పారు. దీనితో ఆయన గెలుచుకున్న ప్రైజ్ మనీ విలువ పాతిక లక్షలకు చేరింది. అనంతరం ఎన్టీఆర్ రూ. 50 లక్షల 14వ ప్రశ్న అడగడం జరిగింది. 

జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు?
A)మిజోరాం
B)పశ్చిమబెంగాల్‌
C)ఉత్తరప్రదేశ్‌
D)కేరళ

ఈ ప్రశ్నకు రాజా రవీంద్ర కొంచెం సేపు ఆలోచింది చాల కాన్ఫిడెంట్ గా ఆప్షన్ B. పశ్చిమ బెంగాల్ అంటూ సమాధానం చెప్పారు. దీనిని ఎన్టీఆర్ (NTR) రైట్ ఆన్సర్ ని కన్ఫర్మ్ చేయడంతో రాజా రవీంద్ర యాభై లక్షలు గెలుచుకొని కోటి రూపాయల ప్రశ్నలు సిద్ధం అయ్యారు. ఇక రాజా రవీంద్రను కోటీశ్వరుడిని చేసిన ఆ ప్రశ్నను పరిశీలిస్తే... ఎన్టీఆర్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. 

1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు?
A)రంగనాథ్‌ మిశ్రా
B)రంజిత్‌సింగ్‌ సర్కారియా
C)బీపీ మండల్‌
D)ఫజల్‌ అలీ కమిషన్‌

Also read పోలీస్ దెబ్బ అదుర్స్ కదా.. ఎన్టీఆర్ EMK షోలో కోటి గెలుచుకున్న వ్యక్తి బ్యాగ్రౌండ్ ఇదే

కోటి రూపాయలు తెచ్చి పెట్టే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో ఉత్కంఠ నెలకొంది. తప్పు ఆన్సర్ చెబితే అతని ప్రైజ్ మనీ చాలా తక్కువకు పడిపోతుంది. రైట్ ఆన్సర్ చెబితే... కోటీశ్వరుడు అవుతాడు. గేమ్ లో ఉన్న మూడు లైఫ్ లైన్స్ లో రెండు రాజా రవీంద్ర అప్పటికే వాడుకున్నారు. ఓ లైఫ్ లైన్ మిగిలి ఉంది. మిగిలి ఉన్న ఆ మూడవ లైఫ్ లైన్ ఉపయోగించుకొని... ఆన్సర్ ఆప్షన్ D. ఫజల్ అలీ కమీషన్ అని చెప్పడం జరిగింది. ఈ ఆన్సర్ తప్పా రైటా... అనే ఉత్కంఠ కంటెస్టెంట్ తో పాటు ప్రేక్షకులలో మెదలాడింది. చిన్న సస్పెన్సు తర్వాత, రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకొని చరిత్ర సృష్టించినట్లు గ్రాండ్ గా ప్రకటించారు. 

Also read EMK: కోటి గెలుచుకున్న రాజా రవీంద్ర కి ఎంత ఇస్తారో తెలుసా?.. మరీ అన్ని లక్షలు కోతా!

అయితే కోటి రూపాయలు గెలుచుకున్న రాజా రవీంద్రకు నిబంధనల ప్రకారం దక్కేది మాత్రం తక్కువే. ఆయన గెలుచుకున్న పూర్తి అమౌంట్ కోటి రూపాయలు నిర్వాహకులు ఇవ్వరు. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఎవరైనా ఓ టీవీ షోలో రూ. 10000 మించి ప్రైజ్ మనీ గెలుచుకుంటే 31.2 శాతం టాక్స్ చెల్లించాలి. దీని ప్రకారం రాజా రవీంద్రకు కేవలం రూ. 68.8 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. టాక్స్ మినహాయించుకొని, మిగిలిన అమౌంట్ విన్నర్ కి ఇస్తారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios