EMK: ఎన్టీఆర్ గెస్ట్ గా మహేష్... సర్వం సిద్ధం!
డెకేడ్ ఆఫ్ ది ఎపిసోడ్ కి రంగం సిద్ధమైంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి సందడి చేయనున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు ఈ అరుదైన సంఘటనకు వేదిక కానుంది.
ఎన్టీఆర్ (NTR) హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా సాగుతుంది. ఈ షోకి కంటెస్టెంట్స్ గా, సామాన్యులతో పాటు అనేక మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు రావడం జరిగింది. రాజమౌళి, కొరటాల శివ, రామ్ చరణ్, సమంత తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు, ఎన్టీఆర్ షోకి హాజరై ప్రేక్షకులకు అనుభూతి పంచారు. అయితే అందరూ ఒక లెక్క మహేష్ ఒక లెక్క. ఆల్ ఇండియా అందగాడు... మహేష్, ఎన్టీఆర్ ని కావడం, వారిద్దరినీ ఒకే వేదికపై చూడడం కన్నుల పండుగ అని చెప్పాలి. ఆ ఘడియలు ఇప్పుడు సమీపించాయి.
ఎవరు మీలో కోటీశ్వరులు (Meelo evaru koteeswarulu) షోకి గెస్ట్ గా మహేష్ వస్తున్నాడంటూ చాలా కాలంగా ప్రచారం అవుతుంది. దీని సంబంధించిన లీక్స్ కూడా రావడం జరిగింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ ని ఈ విషయంపై ప్రశ్నించగా... వాళ్ళు చెబుతారు, నన్నేమి అడగకండి అని సమాధానం చెప్పారు. మహేష్ తో ఎన్టీఆర్ ఎపిసోడ్ ఉంటుందని తెలిసినప్పటికీ, ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. కాగా నేడు దీనిపై ఎవరు మీలో కోటీశ్వరులు టీం అధికారిక ప్రకటన చేశారు. మహేష్, ఎన్టీఆర్ తో కూడిన ఫోటో విడుదల చేశారు. త్వరలో ఎపిసోడ్ అని చెప్పిన నిర్వాహకులు డేట్ పై స్పష్టత ఇవ్వలేదు.
చివరిగా మహేష్ (Mahesh) , ఎన్టీఆర్ 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిశారు. ఈ వేడుకలో మహేష్-ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఎన్టీఆర్ మహేష్ ని అన్న అని సంబోధిచడం, మహేష్ ఎన్టీఆర్ ని తమ్ముడు అనడం ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ కలిగించింది. మరి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో, ఒకరినొకరు ఎలా అడ్రెస్ చేసుకుంటారో చూడాలి.
Also read RRR vs Bheemla nayak: పవన్ ధీమా అదే... అందుకే ఆర్ ఆర్ ఆర్ తో ఢీ!
మరోవైపు ఈ ఇద్దరు స్టార్ హీరోలు కొత్త చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. మహేష్ సర్కారు వారి పాట(Sarkaru vaari paata) షూటింగ్ నిరవధికంగా సాగుతుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని సమ్మర్ కి వాయిదా వేశారు. అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR movie), పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
Also read వాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టండి... బాబుకు సంఘీభావంగా బాలయ్య ఫ్యాన్స్ పిలిపు!