MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lenin total Collections: `లెనిన్‌` ఫైనల్‌ కలెక్షన్లు, నిజంగా షాకింగ్‌.. అఖిల్‌ సినిమా హిట్టా? ఫట్టా?

Lenin total Collections: `లెనిన్‌` ఫైనల్‌ కలెక్షన్లు, నిజంగా షాకింగ్‌.. అఖిల్‌ సినిమా హిట్టా? ఫట్టా?

అఖిల్‌ అక్కినేని మొత్తంగా హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. ఆయన నటించిన `లెనిన్‌` మూవీ మంచి కలెక్షన్లని సాధించింది. అయితే బాక్సాఫీసు వద్ద ఇది టోటల్‌గా ఎంత రాబట్టిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 06 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లెనిన్‌ మూవీ ఫైనల్‌ రిజల్ట్
Image Credit : Asianet News

లెనిన్‌ మూవీ ఫైనల్‌ రిజల్ట్

అఖిల్‌ అక్కినేని నటించిన `లెనిన్‌` సినిమా రేపు(ఆగస్ట్ 7) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. జీ5లో దీన్ని స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌లో జులై 10న విడుదలైంది. రిలీజ్‌ అయిన 28 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంది. ఇటీవల చాలా సినిమాలు ఇలానే రిలీజ్‌ అవుతున్నాయి. ఓటీటీలోకి వస్తే, థియేట్రికల్‌గా క్లోజ్‌ అవుతుంది. మరి ఈ చిత్రం ఇప్పటి వరకు ఎంత వసూళ్లు చేసింది. నిజంగానే హిట్టా? లేక ఫట్టా అనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హిట్‌ టాక్‌ని తెచ్చుకున్న లెనిన్‌
Image Credit : Asianet News

హిట్‌ టాక్‌ని తెచ్చుకున్న లెనిన్‌

అఖిల్‌ హీరోగా రూపొందిన `లెనిన్‌` మూవీకి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ నిర్మించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ప్రమోద్‌, శివాజీ, ఈశ్వరీరావు, రాంకీ, గెటప్‌ శ్రీను వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జులై 10న విడుదలైన ఈ చిత్రానికి ప్రారంభంలో మిశ్రమ స్పందన లభించింది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీ అనే టాక్‌ వచ్చింది. కానీ మాస్‌ ఎలిమెంట్లు, యాక్షన్‌ సీన్లు బాగుండటంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫస్ట్ రెండు వారాలు మంచి వసూళ్లని రాబట్టింది.

34
లెనిన్‌ మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

లెనిన్‌ మూవీ కలెక్షన్లు

ఇక `లెనిన్‌` మూవీ థియేటర్లో క్లోజ్‌ అయ్యింది. నిన్నటి వరకు దీనికి లక్షలోపే వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.73.50 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. అంటే దీనికి రూ.35-40కోట్ల షేర్‌ వచ్చింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.22కోట్లు అని సమాచారం. ఆ లెక్కన ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ దాటి పదిహేను కోట్ల వరకు లాభాలు రాబట్టిందని చెప్పొచ్చు. సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.50కోట్లు అని సమాచారం. ఓటీటీ, శాటిలైట్‌, ఆడియో రూపంలో మరో ముప్పై కోట్లు వచ్చాయట. దీంతో సినిమా లాభాల్లో క్లోజ్‌ అయ్యింది. నిర్మాతలు సేఫ్‌ అయ్యారని చెప్పొచ్చు.

44
ఎట్టకేలకు హిట్‌ కొట్టిన అఖల్‌
Image Credit : X/@AnnapurnaStdios

ఎట్టకేలకు హిట్‌ కొట్టిన అఖల్‌

అయితే చిత్ర బృందం మాత్రం దీనికి వంద కోట్లు వచ్చినట్టు ప్రకటించారు. దీని వల్ల ఓటీటీ నుంచి మరో మూడు నాలుగు కోట్లు అదనంగా వచ్చాయని టాక్‌. కలెక్షన్లు ఎన్ని వచ్చినా `లెనిన్‌` హిట్‌ జాబితాలో చేరిపోయింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రాల్లో చేరడం విశేషం. అఖిల్‌కిది హీరోగా ఆరో సినిమా. ఇన్నాళ్లు స్ట్రగుల్‌ అయిన ఆయన ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు, తొలి బ్రేక్‌ అందుకున్నాడు. మరో పదేళ్ల వరకు తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో నటుడిగానూ నిరూపించుకున్నాడు అఖిల్‌. సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
OTT Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న నాగదుర్గ సినిమా, ప్రైమ్‌ టాప్‌ 10లో తెలుగు మూవీస్‌ జోరు
Recommended image2
Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved