MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • LB Sriram: సినిమాలు మానేయడానికి అసలు కారణం అదే.. అతడ్ని దేవుడు శిక్షంచాడు.. టాలీవుడ్ నటుడు

LB Sriram: సినిమాలు మానేయడానికి అసలు కారణం అదే.. అతడ్ని దేవుడు శిక్షంచాడు.. టాలీవుడ్ నటుడు

LB Sriram: 33 ఏళ్ల సినీ ప్రస్థానంలో 500 పైగా సినిమాల్లో నటించిన ఎల్.బి. శ్రీరామ్, గత ఆరేళ్లుగా వెండితెరకు దూరంగా ఉండటంపై స్పందించారు. కేవలం ఒకే రకమైన దైన్యమైన పాత్రలకే తనను పరిమితం చేయడంతో.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 08 2026, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్.బి. శ్రీరామ్ అంతరంగం
Image Credit : Pinterest

ఎల్.బి. శ్రీరామ్ అంతరంగం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితగా, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి ఎల్.బి. శ్రీరామ్. 'కోకిల' సినిమాతో రచయితగా ప్రయాణం మొదలుపెట్టి, 'అమ్మ ఒకటో తారీఖు', 'చాలా బాగుంది' వంటి చిత్రాలతో నటుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పెద్ద తెరపై కనిపించకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలను ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
గౌరవప్రదమైన పాత్రల కోసమే విరామం:
Image Credit : Pinterest

గౌరవప్రదమైన పాత్రల కోసమే విరామం:

పరిశ్రమ తనను ఒక బ్రాండ్‌గా మార్చేసిందని, ప్రతి సినిమాలోనూ కేవలం కష్టాల్లో ఉండే దైన్యమైన పాత్రలనే ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రకమైన పాత్రలను చేసి బోర్ కొట్టడం కంటే, ఆత్మతృప్తినిచ్చే పనులు చేయడం మేలని భావించి సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. 

Related Articles

Related image1
LB Sriram: మేడమ్ మూవీలో ఛాన్స్ ఇవ్వమని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తే.. అయన ఏం చెప్పారంటే..
Related image2
LB Sriram: కోటను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాను.! కానీ సాయం అడిగితే.. ఆయన అన్నది ఇదే
35
'హార్ట్ ఫిలిమ్స్'గా అభివర్ణిస్తూ..
Image Credit : Pinterest

'హార్ట్ ఫిలిమ్స్'గా అభివర్ణిస్తూ..

ప్రస్తుతం తాను చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్‌ను 'హార్ట్ ఫిలిమ్స్'గా అభివర్ణిస్తూ, ఇవి తనకు కళాకారుడిగా పూర్తి సంతృప్తినిస్తున్నాయని తెలిపారు.

45
గురువు ఈవీవీ సత్యనారాయణ:
Image Credit : Pinterest

గురువు ఈవీవీ సత్యనారాయణ:

తన ఎదుగుదలలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పాత్ర మరవలేనిదని, ఆయన లేకపోతే తాను లేనని ఎల్.బి. శ్రీరామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈవీవీ మరణం తనకు, పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. అలాగే తన సమకాలికులైన ఎం.ఎస్. నారాయణ, వేణుమాధవ్ వంటి నటులు వరుసగా చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు.

55
తిరిగి వెండితెరకు..
Image Credit : our own

తిరిగి వెండితెరకు..

ప్రస్తుతం వయసు పెరిగినా (70 ఏళ్లు), తనలో నటుడు ఇంకా సజీవంగా ఉన్నారని, కేవలం రెండు మూడు సీన్లు ఉన్నా సరే అవి కథలో కీలకమైనవి అయితే తప్పకుండా నటిస్తానని స్పష్టం చేశారు. గడ్డం గీసుకోవడం, రంగు వేసుకోవడం వంటివి కేవలం అవసరానికే అని, తన సహజత్వాన్ని దాచడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. మంచి టెక్నికల్ వేల్యూస్ ఉన్న పాత్రల కోసం తాను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని డైరెక్టర్లకు క్లారిటీ ఇచ్చారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
Recommended image2
Top 10 Heroes: విజయ్‌, ఎన్టీఆర్‌, అల్లు, చరణ్‌ డౌన్‌.. ధురంధర్‌ 2 హీరో జోరు.. నెం 1 ఎవరంటే?
Recommended image3
Anasuya Husband: అర్థరాత్రి తాగి భర్త ముందే ఏడ్చేసిన అనసూయ..మూడు సినిమాల్లో ఇలా, ఇంత దారుణమా
Related Stories
Recommended image1
LB Sriram: మేడమ్ మూవీలో ఛాన్స్ ఇవ్వమని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తే.. అయన ఏం చెప్పారంటే..
Recommended image2
LB Sriram: కోటను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాను.! కానీ సాయం అడిగితే.. ఆయన అన్నది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved