MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'తమ్ముడు' మూవీ కోసం యుఎస్ లో జాబ్ మానేసి వచ్చా, పాత్ర కోసం స్వీట్లు తిని లావయ్యా.. నటి లయ కామెంట్స్

'తమ్ముడు' మూవీ కోసం యుఎస్ లో జాబ్ మానేసి వచ్చా, పాత్ర కోసం స్వీట్లు తిని లావయ్యా.. నటి లయ కామెంట్స్

సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో క్రేజీ మూవీ "తమ్ముడు".

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 26 2025, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram

సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో క్రేజీ మూవీ "తమ్ముడు".  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి లయ. "తమ్ముడు" సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో లయ తన రీ ఎంట్రీ గురించి తమ్ముడు చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Instagram

నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూస్ చూసి జూన్ లో "తమ్ముడు" మూవీ టీమ్ నుంచి కాల్ వచ్చింది. నేను తీసుకున్న కొన్ని ఫొటోస్ పంపిస్తే, వాటిలో ఈ క్యారెక్టర్ కు సెట్ అయ్యేలా కనిపించలేదు. దాంతో మళ్లీ ఫొటోషూట్ చేసి పంపమన్నారు. ఆ ఫొటోస్ చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికి లైన్ గా "తమ్ముడు" కథ తెలుసు. నా రీ ఎంట్రీకి ఇది సరైన సినిమా అనిపించింది. క్యారెక్టర్ కోసం కొంచెం లావు కావాలని చెప్పారు. స్వీట్స్ తిని బరువు పెరిగాను. ఈ మూవీ కోసం కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్నాను. 

35
Image Credit : Instagram

తమ్ముడు" మూవీలో ఝాన్సీ కిరణ్మయి అనే క్యారెక్టర్ లో నటించాను. తనొక ఆఫీసర్. స్ట్రిక్ట్ గా ఉంటుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్ గా నా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాను. హీరో నితిన్ కు సోదరి పాత్ర నాది. ఈ చిత్రం కోసం అడవిలో షూటింగ్ చేశాం. రోజూ యూనిట్ లో ఎవరో ఒకరికి గాయాలు అయ్యేవి. నితిన్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడిలా మా అందరితో కలిసిపోయారు. 

నటన పరంగా చూస్తే ఈ సినిమాలో నితిన్ చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తాడు. చాలా కష్టమైన సీన్స్ కూడా ఈజీగా చేశాడు. సీన్స్ కోసం చేసిన ప్రిపరేషన్ వల్లే అంత సులువుగా నటించగలిగారు.  తమ్ముడు అనే టైటిల్ ఈ సినిమాకు యాప్ట్. మీరు సినిమా చూశాక చెబుతారు. పవన్ కల్యాణ్ గారి తమ్ముడు మూవీకి ఈ చిత్రానికి పోలిక లేదు. 

45
Image Credit : Instagram

ఈ సినిమా కోసం ఇండియా రావాలనుకున్నప్పుడే అక్కడ యూఎస్ లో జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. అందుకే ఇండస్ట్రీలో వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ ఎక్కువగా మాట్లాడదు. కానీ మాట్లాడినప్పుడు చాలా పవర్ ఫుల్ గా చెబుతుంది. ఈ క్యారెక్టర్ గురించి దర్శకుడు శ్రీరామ్ వేణు గారు చెప్పినప్పుడు ఝాన్సీ కిరణ్మయి స్ట్రాంగ్ వుమెన్, తను అనుకున్నది చేస్తుంది. ఏది ఏమైనా భయపడదు అని చెప్పారు. ఆయన చెప్పినట్లే నటించాను.

55
Image Credit : Instagram

నేను హీరోయిన్ గా చేసినప్పుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మనకంటూ ఏదో సాధించాలనే తపనతో తిరిగి వచ్చాను.  కథలో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా. ఆ పాత్ర సిస్టర్ అయినా, మదర్ అయినా చేస్తాను. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఆడియెన్స్ కు నా క్యారెక్టర్ గుర్తుండాలి. నేను హీరోయిన్ గా చేసిన చిత్రాల్లోనూ మదర్ గా కనిపించినవి ఉన్నాయి. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. కథకు డ్రైవింగ్ ఫోర్స్ లాంటి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా నటిస్తా. నేను యూఎస్ ఆర్టిస్టును కాదు హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టునే. మూవీస్ ఉన్నప్పుడు ఇక్కడే ఉంటా. ప్రస్తుతం శివాజీ గారితో ఒక సినిమా చేస్తున్నాను.ఇతర ప్రాజెక్ట్స్ అంగీకరించలేదు అని లయ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali 2026 OTT Releases: దీపావళికి సినిమాల జాతర, ఓటీటీలో సందడి చేయనున్న 10 కొత్త సినిమాలు ఇవే
Recommended image2
Salman Khan: ఒక్కసారి సారీ చెబితే చాలు.. సల్మాన్‌కు బిష్ణోయ్ బంధువు ఆఫర్, నెక్స్ట్ ఏంటి?
Recommended image3
Ramayana Review: రామాయణం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
సునీల్ తన కెరీర్ లో చేసిన బిగ్ మిస్టేక్ ఇదే.. ఆ మూవీ రిజెక్ట్ చేయడంతో నానికి బ్లాక్ బస్టర్ హిట్
Recommended image2
శోభన్ బాబు ఎవ్వరిని అడుగుపెట్టనివ్వని ప్రైవేట్ ప్లేస్, కానీ ఎస్పీ బాలు కుమార్తె పెళ్లి కోసం ఏం చేశారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved