- Home
- Entertainment
- శోభన్ బాబు ఎవ్వరిని అడుగుపెట్టనివ్వని ప్రైవేట్ ప్లేస్, కానీ ఎస్పీ బాలు కుమార్తె పెళ్లి కోసం ఏం చేశారంటే
శోభన్ బాబు ఎవ్వరిని అడుగుపెట్టనివ్వని ప్రైవేట్ ప్లేస్, కానీ ఎస్పీ బాలు కుమార్తె పెళ్లి కోసం ఏం చేశారంటే
తన అందం నటనతో సోగ్గాడు శోభన్ బాబు అభిమానులని అలరించారు. ఓ కార్యక్రమంలో లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం శోభన్ బాబుని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన అందం నటనతో సోగ్గాడు శోభన్ బాబు అభిమానులని అలరించారు. మహిళల్లో శోభన్ బాబుకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. శోభన్ బాబు గొప్ప మనసు గురించి చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతుంటారు. ఓ కార్యక్రమంలో లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం శోభన్ బాబుని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో శోభన్ బాబుకి ఆస్తులు భారీగా ఉండేవి. చెన్నైలో ఆయనకి భూములు, ఫామ్ హౌస్ లు కూడా ఉండేవి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. నాకు శోభన్ బాబు గారికి మధ్య చెరగని స్నేహబంధం ఉంది. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఒకసారి నా కుమార్తె పల్లవి పెళ్లి కోసం కళ్యాణ మండపాలు వెతుకుతున్నాను. ఎక్కడా కళ్యాణ మండపాలు దొరకలేదు.
శోభన్ బాబు గారికి ఒక ఫామ్ హౌస్ ఉండేది. అది ఆయన ప్రైవేట్ ప్లేస్. ఆ ఫామ్ హౌస్ లోకి ఎవ్వరినీ అడుగుపెట్టనిచ్చేవారు కాదు. నా కూతురు పెళ్లికి కళ్యాణ మండపాలు దొరకడం లేదు.. మీ ఫామ్ హౌస్ ఇస్తారా అందులో పెళ్లి చేస్తాను అని శోభన్ బాబుని రిక్వెస్ట్ చేశాను. ఆయన సమాధానం ఇస్తూ అందులోకి నేను ఎవ్వరినీ వెళ్లనివ్వడం లేదు, సినిమా షూటింగ్ లకు కూడా ఆ ఫామ్ హౌస్ ఇవ్వడం లేదు అని గ్యాప్ ఇచ్చారు. ఇక ఆయన ఇవ్వనట్లే మేము ముహూర్తం మార్చుకొని వేరే కళ్యాణమండపం చూసుకోవాలి అని అనుకునా. వెంటనే ఆయన మన అమ్మాయి పెళ్లి కదా ఇవ్వకుండా ఎలా ఉంటాను ఇక్కడే చేసేద్దాం పెళ్లి అని అన్నారు.
అది శోభన్ బాబు గారి గొప్ప మనసు.. స్నేహానికి ఆయన ఇచ్చే విలువ అని బాలసుబ్రమణ్యం తెలిపారు. పెళ్లి కోసం ఆ ఫామ్ హౌస్ ఇవ్వడం మాత్రమే కాదు.. దగ్గరుండి పెళ్లి పనులు మొత్తం ఆయనే చూసుకున్నారు అని బాలసుబ్రమణ్యం గుర్తు చేసుకున్నారు.
శోభన్ బాబు నటించిన చిత్రాల్లో 90 శాతం పాటల్ని తానే పాడినట్లు బాలసుబ్రమణ్యం తెలిపారు. శోభన్ బాబు అరుదైన వ్యక్తిత్వం ఉన్న నటుడు. ఆయన జెంటిల్మెన్ అంటూ బాలసుబ్రమణ్యం ప్రశంసలు కురిపించారు.