- Home
- Entertainment
- కమల్ హాసన్ కోసం లతా రజనీకాంత్ పాడిన ఒకే ఒక్క పాట ఏంటో తెలుసా? అప్పట్లో దుమ్ములేపిన సాంగ్ అది
కమల్ హాసన్ కోసం లతా రజనీకాంత్ పాడిన ఒకే ఒక్క పాట ఏంటో తెలుసా? అప్పట్లో దుమ్ములేపిన సాంగ్ అది
సూపర్ స్టార్ భార్య లతా రజనీకాంత్, కమల్ హాసన్ కోసం ఒకే ఒక్క పాట పాడిన విషయం మీకు తెలుసా? ఆ పాటేంటి? ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

లతా రజనీకాంత్ నటించిన మూవీ
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్, ప్రస్తుతం సినిమా వైపు లేకపోయినా, చాలా సంవత్సరాల క్రితం వరకు సినిమాల్లో పాటలు పాడటం, సినిమాలు నిర్మించడం వంటివి చేసేవారు. అంతేకాకుండా ఒకే ఒక్క సినిమాలో అతిథి పాత్రలో నటించారు. ఆ సినిమా పేరు `అగ్ని సాక్షి`. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో రజనీకాంత్ కి భార్యగా ఒకే ఒక్క సన్నివేశంలో నటించారు లత. ఆ తర్వాత రజనీకాంత్ నటించిన 1986లో విడుదలైన `మావీరన్`, 1993లో విడుదలైన `వాలి` వంటి సినిమాలను నిర్మించారు లత.
KNOW
ఐదు పాటలు పాడిన లతా రజనీకాంత్
లతా రజనీకాంత్ కి సంగీతం అంటే ఇష్టం ఉన్నప్పటికీ, ఆమె ఇప్పటివరకు కేవలం 5 పాటలు మాత్రమే పాడారు. అందులో నాలుగు పాటలు తన భర్త రజనీకాంత్ సినిమా కోసం పాడిన లత, ఒకే ఒక్క పాటను కమల్ హాసన్ సినిమా కోసం పాడారు. అంతేకాకుండా ఆమె పాడిన 5 పాటల్లో నాలుగు పాటలకు సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించగా, ఒకే ఒక్క పాటకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. లతా రజనీకాంత్ పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి. ఆ పాటలు ఏమిటి, అందులో కమల్ కోసం ఆమె పాడిన పాట ఏమిటో చూద్దాం.
కమల్ కోసం లతా పాడిన పాట ఇదే
లతా రజనీకాంత్ మొదటిసారి పాడిందే కమల్ సినిమాకు. 1981లో భారతీరాజా దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన `టిక్ టిక్ టిక్` సినిమాలోనే తన మొదటి పాట పాడారు లత. ఆ సినిమాలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన 'నేట్రు ఇంద నేరం' పాటను లతా రజనీకాంత్ పాడారు. ఆ సినిమాలోని ఒక అండర్ రేటెడ్ పాటగా కూడా ఇది పరిగణించబడుతుంది. ఈ పాటకు కణ్ణదాసన్ సాహిత్యం అందించారు. ఈ ఒక్క పాట తప్ప ఆమె పాడిన మిగతా పాటలన్నీ రజనీకాంత్ సినిమాలకే. `నేట్రు ఇంద నేరం` పాట మాత్రం అప్పట్లో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. శ్రోతలను మెప్పించింది.
రజనీకాంత్ కోసం లతా పాడిన పాటలివే
1984లో విడుదలైన `అన్బుల్లా` రజనీకాంత్ సినిమాలోని 'కడవుల్ ఉల్లమే' పాట, 1993లో విడుదలైన రజనీకాంత్ `వాటి` సినిమాలోని 'డింగ్ డాంగ్', 'కుక్కూ కూ' పాటలను లతా రజనీకాంత్ పాడారు. అదేవిధంగా ఆమె చివరిగా పాడిందీ రజనీ సినిమాకే. 2014లో ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో రజనీకాంత్ `కోచడయాన్` సినిమా కోసం 'మనప్పెణ్ణిన్ సత్యం' అనే పాటను పాడారు లతా రజనీకాంత్. ఈ పాటను ఈ రోజుల్లో చాలా పెళ్లిళ్లలో వింటూ ఉంటాం. అంత అందంగా పాడారు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు లతా రజనీకాంత్.
`కూలీ`తో రాబోతున్న రజనీకాంత్
రజనీకాంత్ ప్రస్తుతం `కూలీ` చిత్రంతో రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. ఇందులో రజనీతోపాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్య రాజ్, సౌబిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.