- Home
- Entertainment
- `వార్ 2`లో హీరో ఎవరు? బయటపడ్డ ఎన్టీఆర్, హృతిక్ ల మధ్య ఈగో క్లాష్.. ఏకంగా సోషల్ మీడియాలో గొడవ
`వార్ 2`లో హీరో ఎవరు? బయటపడ్డ ఎన్టీఆర్, హృతిక్ ల మధ్య ఈగో క్లాష్.. ఏకంగా సోషల్ మీడియాలో గొడవ
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన `వార్ 2` మూవీ ఈ నెల 14న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల మధ్య ఈగో క్లాష్ తారాస్థాయికి చేరింది.

భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న `వార్ 2`
ప్రస్తుతం మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తోంది. వరుసగా అలాంటి మూవీస్ వస్తున్నాయి. `వార్ 2` కూడా మల్టీస్టారర్‌గానే తెరకెక్కింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ఈ సినిమాలో నటించారు. అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ తమ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మరో ఐదు రోజుల్లో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
KNOW
ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా `వార్ 2` రూపొందింది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల మధ్య వార్ హైలైట్‌గా ఉంటుందని ట్రైలర్‌ని చూస్తుంటే తెలుస్తోంది. మాజీ స్పై ఏజెంట్ హృతిక్ రోషన్.. రా నుంచి బయటకు వెళ్లి పలు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ, `రా` కి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఆయన్ని పట్టుకునేందుకు మరో పవర్‌ఫుల్ రా ఏజెంట్ ఎన్టీఆర్‌ని దించడం, హృతిక్‌ని పట్టుకునేందుకు ఆయన చేసే పోరాటమే ఈ మూవీ కథగా ఉండబోతుందని టీజర్, ట్రైలర్లని బట్టి అర్థమయ్యింది. ఇందులో ఇద్దరు సూపర్ స్టార్స్ నటించడం విశేషం. ఇదే సినిమాపై భారీ హైప్‌ని పెంచుతుంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య రియల్ వార్
మల్టీస్టారర్ చిత్రాల విషయంలో ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఫ్యాన్స్ ని సాటిస్పై చేయడం చాలా కష్టం. మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అని, మా హీరోనే హీరో అని ఇద్దరు హీరోల అభిమానులు కొట్టుకుంటారు. సోషల్ మీడియాలో వార్ జరుగుతుంటుంది. ఇది చాలా సినిమాల విషయంలో జరుగుతుంది. కానీ విచిత్రంగా `వార్ 2` సినిమా విషయంలో హీరోలే కొట్టుకుంటున్నారు. క్రెడిట్ కోసం, హీరో ఎవరనేదానిపై వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా పంచాయతీ పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తోంది. నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని యాష్ ట్యాగ్ కోసం కొట్టుకోవడం విశేషం. మరి ఆ కథేంటో చూద్దాం.
డాన్సులతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన తారక్, హృతిక్
`వార్ 2` సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్. ఇటీవల పాటని విడుదల చేశారు. ఎన్టీఆర్, హృతిక్ కలిసి డాన్స్ చేసిన `సలామ్ అనాలి` అనే పాటని విడుదల చేశారు. ఇందులో ఇద్దరూ తమదైన డాన్సులతో రెచ్చిపోయారు. తన బాడీని స్వింగ్‌లాగా తిప్పుతూ మెప్పించారు హృతిక్. తారక్ కూడా తనదైన స్టయిల్‌లో మ్యాజిక్ చేశారు. ఈ ఇద్దరు పోటీపడి డాన్సులు చేసి అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు. కానీ హీరో క్రెడిట్ విషయంలో యాష్ ట్యాగ్‌ల కోసం ఈ ఇద్దరు హీరోలు నెట్టింట గొడవపడ్డారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా రచ్చ చేశారు.
హీరో ఎవరనే క్రెడిట్ కోసం ఇద్దరు హీరోల మధ్య గొడవ
`యుద్ధ రేఖలు మళ్లీ గీయబడ్డాయి, ఈ విషయంలో హ్యాష్ ట్యాగ్ అన్నీ చెబుతుంది. ప్రతి అప్ డేట్ కోసం #HrithikvsNTR ఫాలో అవ్వండి, యాక్షన్ ఇప్పుడే ప్రారంభమైందని ఎన్టీఆర్‌ని ట్యాగ్ చేశారు హృతిక్. దీనికి తారక్ స్పందిస్తూ, `వార్ 2` అప్ డేట్లా? ప్రత్యేకతలా? హృతిక్ సార్ మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. వాటిని అనుసరించడానికి ఒకే హ్యాష్ ట్యాగ్ `#NTRvsHrithik`. ఈ యుద్ధం ఇప్పుడు ప్రారంభం అవుతుంది అని చెప్పారు జూనియర్ ఎన్టీర్. దీనికి హృతిక్ మళ్లీ రియాక్ట్ అయ్యారు. `హా హా బాగుంది తారక్, కానీ #HrithikvsNTR హ్యాష్ ట్యాగ్‌ని క్లిష్టతరం చేయోద్దు, సరేనా? అని పోస్ట్ పెట్టగా, `ఒప్పుకో హృతిక్ సర్, `#NTRvsHrithik` దగ్గర ఇంకా మంచి రింగ్ ఉంది. ఇది నా విజయం` అని వెల్లడించారు ఎన్టీఆర్. ఇలా వీరిద్దరి మధ్య సోషల్ మీడియా కన్వర్జేషన్ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఇద్దరు హీరోలు ఇవి సినిమా ప్రమోషన్స్ కోసం సరదాగా చేసినవిగా చెప్పొచ్చు. కాకపోతే నువ్వా నేనా అనేలా హ్యాష్ ట్యాగ్ కోసం కొట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ రిఫ్లెక్స్ చేసేలా ఈ పోస్ట్ లు ఉండటం గమనార్హం. ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.