- Home
- Entertainment
- Highest Remuneration: బిగ్ బాస్ తెలుగు 9 టాప్ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
Highest Remuneration: బిగ్ బాస్ తెలుగు 9 టాప్ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 టాప్ 5లో కళ్యాణ్, పవన్, తనూజ, ఇమ్మాన్యుయెల్, సంజనా ఉన్నారు. వీరిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరంటే? దీనికి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.

బిగ్ బాస్ తెలుగు 9 టాప్ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ చివరి వారం ఎమోషనల్‌గా సాగుతుంది. బిగ్ బాస్ జర్నీని గుర్తు చేసుకుంటూ కంటెస్టెంట్లు ఎమోషనల్ అవుతున్నారు. మరోవైపు సరదా గేమ్స్ తో ఈ కంటెస్టెంట్లని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు బిగ్ బాస్. వారి కోరికలను తీరుస్తున్నాడు. ప్రస్తుతం టాప్ 5లో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజనా ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరనేది ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది.
తక్కువ పారితోషికం డీమాన్ పవన్, కళ్యాణ్
ఈ నేపథ్యంలో టాప్ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు చూస్తే, ఇందులో ఎవరు టాప్ లో ఉన్నారనేది తెలుసుకుందాం. టాప్ కంటెస్టెంట్ గా ఉన్న కళ్యాణ్ పారితోషికం అందరికంటే తక్కువ కావడం విశేషం. ఆయనకు రోజుకి పదివేలు మాత్రమే ఇస్తున్నారట. ఇంత టాప్‌లో ఉన్నా వారికి వారానికి దక్కేది రూ.70వేల వరకు మాత్రమే ఉంటుంది. అతనే కాదు డీమాన్ పవన్ కూడా కమన్ మ్యాన్ కేటగిరిలోనే హౌజ్‌లో అడుగుపెట్టాడు. ఆయనకు వారానికి రూ.70వేల వరకు ఉంటుందని సమాచారం. వీరిద్దరి 15 వారాలు ఉన్నారు. వీరికి రూ.1050000వరకు దక్కుతుందని చెప్పొచ్చు.
సంజనా గల్రానీ పారితోషికం
నటి సంజనా టాప్ 5లో ఉన్నారు. ఆమెకి రోజుకి రూ.32 వేల వరకు ఇచ్చారట. ఈ లెక్కన వారానికి రెండు లక్షల 25 వేల వరకు అందుకుంటోంది. ఆమె 15 వారాలు హౌజ్‌లో ఉంది. దీంతో సంజనాకి దక్కేది మొత్తంగా రూ.33 లక్షల పారితోషికం. అయితే సంజనా ప్రారంభంలో డల్‌గా ఉన్నా ఇప్పుడు బాగా కంటెంట్ ఇస్తోంది. ఆకట్టుకుంటోంది. అయితే టాప్ 5లో సంజనా 5వ స్థానంలో ఉండబోతుందని సమాచారం.
తనూజ పారితోషికం
ఇక ఆ తర్వాత తనూజ ఉన్నారు. ఆమె టీవీ నటిగా రాణించింది. స్టార్ మాలోనే సీరియల్స్ చేసింది. దీంతో ఆమెకి కూడా బాగానే ఉంది. ఆమె పారితోషికం రోజుకి రూ.30-35 వేల వరకు ఉంటుందట. ఈ లెక్కన వారానికి తనూజ రెండున్నర లక్షల వరకు తీసుకుందని సమాచారం. ఈ లెక్కన చాలా గట్టిగానే ఆమె పారితోషికం అందుకుంటుందని చెప్పొచ్చు. 15 వారాలు ఉంది కాబట్టి, ఆమెకి మొత్తంగా రూ.3750000 వరకు పారితోషికం దక్కుతుందని చెప్పొచ్చు.
అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఇమ్మాన్యుయెల్
ఇక అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్‌గా ఇమ్మాన్యుయెల్ ఉన్నాడు. ఆయన జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇలా రెండు రకాలుగా ఆయన సంపాదిస్తున్నారు. కమర్షియల్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్‌కి ఎక్కువ పారితోషికం ఇస్తున్నారట. దాదాపు రూ.35-40వేల వరకు రోజువారి పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం. టోటల్‌గా 15 వారాలకుగానూ దాదాపు రూ.40లక్షల వరకు అందుకుంటున్నాడని చెప్పొచ్చు. ఇలా టాప్ 5లో ఇమ్మూకి ఎక్కువ పారితోషికం దక్కుతుంది.

