- Home
- Entertainment
- Intinti gruhalakshmi: తులసిని ప్రశ్నించిన అభి.. కొత్త ప్లాన్‌ని అమలు చేయనున్న లాస్య?
Intinti gruhalakshmi: తులసిని ప్రశ్నించిన అభి.. కొత్త ప్లాన్‌ని అమలు చేయనున్న లాస్య?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... నందు, లాస్యతో, సామ్రాట్ మొండిగా తులసిని తీసుకురామంటారు,ఈ తులసి అంతకన్నా మండిది నేను రాను పొమ్మంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నిమ్మకాయ పిండినట్టు నేను అరిగిపోతున్నాను,అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు.అప్పుడు లాస్య ఒక ప్లాన్ చెప్తుంది దానికి నందు ఇలా చేస్తే దొరికిపోతాము అని అనగా ఎవరు చెప్తారు చెప్పు! ఎవరు చెప్పనంతవరకు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటుంది. ఆ తర్వాత సీన్లో నందు ఇంటికి వచ్చి మాట్లాడిన విషయం అంతా గుర్తు తెచ్చుకున్న అభి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో తులసి, అంకితలు అక్కడికి రాగా అమ్మ,నేను నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని అభి అంటాడు.
అప్పుడు అంకిత, ఆంటీ నీ ప్రశ్నించే హక్కు నీకు లేదు అని అంటుంది.అప్పుడు అభి నువ్వు నాన్నతో అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అమ్మ అని అంటాడు. నువ్వు నా మీద బురద జల్లావు అభి, అయినా సరే నేను ఆయనతో ఈ మధ్య కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు ఏంటి?. నేను మొన్న ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నాకు దక్కిన గౌరవం మర్యాదలు కన్నా నిన్న వాళ్ళు వచ్చినప్పుడు దక్కిన మర్యాదలు ఎక్కువే.
ఆ రోజు నేను ఎంత బాధ పడ్డానో మీకు తెలుసా? అయినా, మీ మగాళ్లు ఎప్పుడూ ఆడవాళ్ళే తగ్గాలి అని అనుకుంటారు కానీ మా గురించి ఆలోచించరు అని తులసి అంటుంది. దానికి అంకిత, అభి కూడా అలాగే తయారవుతున్నాడు అని అంటుంది. అప్పుడు తులసి, నాకు నచ్చింది నేను చేస్తాను ఇప్పటి నుంచి నేను ఎవరి మాట వినను. అయినా సరే అక్కడికి వెళ్లడం వల్ల నష్టమో లాభము అనేది నాకే కదా వస్తుంది, మరి నువ్వు ఎందుకు అలా విలవిలలాడుతున్నావు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తులసి.
ఆ తర్వాత రోజు ప్రేమ్ బయటికి బయలుదేరుతాడు. ఎక్కడికి అని తులసి అడగగా, ఈవెంట్ మేనేజర్ దగ్గరికి కలవడానికి వెళ్తున్నాను అమ్మా అని అంటాడు. అయితే నిన్న రాత్రి చెప్పొచ్చు కదా ప్రేమ్, ఇప్పటికీ టిఫిన్ చేసేదాన్ని. అమ్మ శృతి నువ్వైనా చెప్పాలి కదా అని అనగా శృతి వచ్చి తన నటన మొదలు పెడుతుంది. నేను ముందే చెప్పాను అత్తయ్య కాళీ కడుపుతో వెళ్ళకూడదు అని, ఆరోగ్యానికి మంచిది కాదు అని కానీ వింటేనే కదా అసలు మాట వినట్లేదు అని అంరుంది. అప్పుడు శృతి బయటకు వెళ్లి ముగ్గు వేస్తుంది.
ముగ్గు వేస్తున్నప్పుడు ప్రేమ్ బండి కనిపించి, మొన్న నా బట్టలను మట్టితో తడిపిస్తావా ఇప్పుడు నీ పని చెప్తాను అని టైప్ పంచర్ చేసేస్తుంది. ప్రేమ్ బయటకు వచ్చేలోగా ఏం తెలియనట్టు ముగ్గు వేస్తున్న ప్రదేశానికి వెళ్లి అమాయకంగా కూర్చుంటుంది. అక్కడ చూసేసరికి టైర్ పంచర్ అయి ఉంటుంది. నువ్వే చేసావా అని ప్రేమ్ అడగగా అయ్యో ప్రేమ్ నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు నా బట్టలు మురికి చేసేవని తిరిగి పగ తీసుకునే దానిలా కనిపిస్తున్నానా అని అంటుంది. ఇంతలో తులసి ప్రేమ్ కి పాలు ఇవ్వమని శృతికి ఇస్తుంది కానీ శృతి గాలి కొట్టే మిషన్ తో పాటు పాలను ప్రేమ్ కి ఇచ్చినట్టే ఇచ్చి అలాగా పాలను తనే తాగేస్తుంది.
ప్రేమ్ గాలి కొట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎంత కొట్టినా గాలి నిండదు ఏమైంది అని చూసేసరికి అది పనిచేయదు. అప్పుడు శృతిని తిట్టుకుంటాడు ప్రేమ్. ఆ తర్వాత సీన్లో లాస్య నందులు సామ్రాట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు లాస్య, తులసి కంపెనీకి రానని చెప్పేసింది సర్, మేము ఎంత బతిమిలాడేమో కానీ మొఖం మీద మాకు రావాలని లేదు అని చెప్పేసింది.కనీసం మాజీ భర్త అనే చిన్నచూపు కూడా చూడకుండా మమ్మల్ని అవమానించింద.
మీ దగ్గర వ్యాపార భాగస్వామ్యం అంటే అది చిన్న మాటలు కాదు తనకి వచ్చే జన్మలో కూడా ఇంత అదృష్టం రాదు, అలాంటిది తన చేతులారా తనే వద్దనుకుంటుంది అని అంటుంది. అప్పుడు సామ్రాట్ కోపంతో వద్దనుకున్నారా? అయితే తనకోసం ఇంక మనమేం బాధపడాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్ల కోసం మీ ఉద్యోగాలు ఎందుకు పోగొట్టుకోవడం, మీరు ఇక్కడే ఉండండి అని అంటాడు. అప్పుడు నందు లాస్యలు ఆనందంగా బయటకు వెళ్తారు. ఇంతటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!