Intinti Gruhalakshmi: బలమైన సాక్షాలతో తులసి.. మరో కుట్రకు తెర తీసిన లాస్య!
Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. పంతంతో భర్తని అబాసుపాలు చేయాలని చూస్తున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాములమ్మ చేత సారీ లెటర్ పంపిస్తాడు నందు. దాన్ని చింపి ముక్కలు చేస్తుంది తులసి. అప్పుడు నందు తులసి దగ్గరికి వచ్చి నిన్ను కావాలని హార్ట్ చేయలేదు లాస్య మీద కోపాన్ని నీ మీద చూపించాను దయచేసి అర్థం చేసుకో అంటాడు. నీలో నిజాయితీ ఉంది.. నందు కోపంలో భయం ఉంది.. రెండు అర్థం చేసుకోవలసిన విషయాలే.
ఇలాంటి సమయంలో నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎలా అంటూ అత్తమామలు కూడా తులసిని బ్రతిమాలుతారు. నేను నందగోపాల్ గారిని లాస్యతో కలిసి ఉండమని చెప్పటం లేదు. తన వల్ల నందు గారికి ఎక్కడ మరి ఎన్ని సమస్యలు వస్తాయేమో అని భయపడుతున్నాను అంటుంది తులసి. ఈ కేసుకి ఉపయోగపడే మరొక పని చేశాను అదేంటో అన్నయ్య వస్తే మీకే తెలుస్తుంది అంటుంది తులసి.
మరోవైపు అత్తగారికి రెండు కప్పుల్లో టీ తీసుకువస్తుంది దివ్య. ఇంకొ కప్పు ఎవరికీ అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. నాకే మీతో కూర్చునే కాసేపు కబుర్లు చెప్పాలనిపించింది అంటూ రాజ్యలక్ష్మి ఎదురుగా కాళ్ల మీద కాలేసుకుని కూర్చుంటుంది దివ్య. షాకైనట్లుగా చూస్తుంది రాజ్యలక్ష్మి. నా కొడుకుని పడేయాలని రాత్రి చాలా ట్రై చేసినట్లు ఉన్నావు ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకు నా చేతుల్లోనే ఉన్నాడని. ఎప్పటికీ వాడు అలాగే ఉంటాడు.
కావాలంటే ఛాలెంజ్ అంటుంది రాజ్యలక్ష్మి. ఎందుకు ఉత్తుత్తి ఛాలెంజ్ లు. ఎక్కడ విక్రమ్ నాకు లొంగిపోతాడో అని రాత్రంతా నిద్ర మానేసి మరీ కాపలాకాశారు అంటే మీ మీద నేను గెలిచినట్లే కదా ఉంటుంది దివ్య. ఇంతలోనే విక్రమ్ అక్కడికి వచ్చి నీకోసమే వెతుకుతున్నాను ఇక్కడ ఉన్నావా అని అడుగుతాడు. అత్తయ్య కాసేపు కబుర్లు చెప్పుకుందాము కూర్చో అంటే కూర్చుండి పోయాను అంటుంది దివ్య.
నీ కోడలు కబుర్లు బాగా చెప్తుంది అలా వింటూ కూర్చోవాలి అనిపిస్తుంది అంటాడు విక్రమ్. అవునవును వింటున్నాను కదా అంటూ వెటకారంగా అంటుంది రాజ్యలక్ష్మి. కోర్టుకి వెళుతున్నాను క్యారేజీ పనివాడు తీసుకొస్తాడు అంటాడు విక్రమ్. అదేంటి మీ అమ్మకి పని వాడితో క్యారేజీ పంపిస్తావా ఇన్ని సంవత్సరాల్లో లేని అలవాటు ఈరోజు ఏంటి కొత్తగా అంటాడు బసవయ్య.
ఈ ఒక్కసారి కాంప్రమైజ్ అవుతాను అంటుంది రాజ్యలక్ష్మి. మా అమ్మ మనసు బంగారం అంటాడు విక్రమ్. అవును మా అత్తమ్మ చాలా మంచిది అంటూ రాజ్యలక్ష్మిని హత్తుకుంటుంది దివ్య. మరోవైపు మాధవి భర్త నందు పాత కొలీగ్స్ ని తీసుకొని వస్తాడు. మీరేంటి ఇంత సడన్గా అంటూ ఆశ్చర్యపోతాడు నందు. తులసి గారే అతి కష్టం మీద మా ఫోన్ నెంబర్స్ కనుక్కొని కాంటాక్ట్ అయ్యారు అంటారు కొలీగ్స్.
వీళ్ళందరూ లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నారు ఇదంతా తులసి ప్రయత్నమే అంటాడు మాధవి భర్త. అక్కడినుంచి కోర్టుకి బయలుదేరుతారు అందరు. కోర్టులో వాళ్ళందరినీ చూసిన లాస్య ఏంటి చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు కేసు గెలుస్తామని నమ్మకమా అంటుంది. మాలో ఆ నమ్మకం ఉంది. నీలోనే లేనట్లు ఉంది అంటుంది తులసి.
నా మొహంలో బేజారు కనిపిస్తుందా అంటుంది లాస్య. దాచుకుంటున్నావు గుండెల్లో ఉంది బేజారు అంటుంది తులసి. నేను బేజారు అవ్వటం కాదు ఇప్పుడు మీరు బేజారు అయ్యే వీడియో చూపిస్తా చూడండి అంటూ నందు లాస్యని కొట్టిన వీడియో చూపిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో అంటూ కోర్టులోకి వెళ్ళిపోతుంది లాస్య.
ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అంటాడు మాధవి భర్త. కాంప్రమైజ్ అవ్వడం మంచిదేమో అంటాడు. జైలు శిక్ష కైనా సిద్ధపడతాను కానీ తనతో కాంప్రమైజ్ అంటే లైఫ్ లాంగ్ టార్చర్ అంటాడు నందు. కోర్టులో నందు కొలీగ్ నందు కి ఫెవర్ గా సాక్ష్యం చెప్తారు. తరువాయి భాగంలో నందుని అన్ పాపులర్ చేయమని ఒక వ్యక్తికి డబ్బు ఇస్తుంది లాస్య. ఒక వ్యక్తిని అన్ పాపులర్ చేయడానికి ఒక తంబ్ నెయిల్ చాలు అంటూ నందు లాస్యని కొట్టిన సీన్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు ఆ వ్యక్తి. నందు కేఫ్లో ఉన్న వాళ్లు దానిని చూస్తారు. భార్యని కొట్టడం ఏంటి అంటూ నందుకి చివాట్లు పెట్టి కేఫ్ ని బాయ్ కాట్ చేసి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో కంగారు పడతారు నందు, తులసి.