- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: సామ్రాట్ తో వరంగల్ వెళ్లిన తులసి.. కోపంతో రగిలిపోతున్న అనసూయ!
Intinti Gruhalakshmi: సామ్రాట్ తో వరంగల్ వెళ్లిన తులసి.. కోపంతో రగిలిపోతున్న అనసూయ!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. లాస్య తులసితో, ఈ చీర కొత్తగా ఉన్నాది ఎవరు కొన్నారేంటి అని అడగగా, నా భర్తకు అన్నాడు లే ఒకప్పుడు దీన్ని కూడా తీసుకుంటావా అని అంటుంది తులసి. దానికి లాస్య తడబడుతుంది. అప్పుడు శృతి మనసులో, బాగా తిక్క కుదిరింది అనుకుంటుంది. పక్కనే ఉన్న అభి మనసులో, అమ్మ ఈ మధ్య పూర్తిగా మారిపోయింది ఎవరైనా ఏమైనా మాట్లాడితే మౌనంగా ఉండేది ఇప్పుడు తిరిగి సమాధానాలు ఇస్తుంది ఇప్పుడు మాట్లాడితే బాగోదేమో సైలెంట్ గా ఉందామని అనుకుంటాడు. పక్కనే ఉన్న ప్రేమ్, భలే షాక్ ఇచ్చింది అమ్మ అని అనుకుంటాడు.అప్పుడు అనసూయ మనసులో, తులసి ఎదురు సమాధానాలు ఇస్తుంది ఇలాంటి సమయంలో మాట్లాడితే బాగోదు ఎలా ఆపాలి సామ్రాట్ రాకుండా ఉండే బాగున్ను అని అనగా సామ్రాట్ అప్పటికి అక్కడికి వచ్చి బయట నిలబడతాడు.
సార్ గారు బయట నీకోసం కారులో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు లోపలికి రావచ్చు కదా బయట ఉన్నారు ఎందుకో అని లాస్య అనగా నందు, అంటే బయట అందరికీ సామ్రాట్ వచ్చినట్టు ఈవిడ గారిని తీసుకెళ్తున్నట్టు తెలియాలి కదా అప్పుడు అందరూ మన గురించి బాగా చెప్పుకుంటారు కదా అని అంటాడు. పక్కనే ఉన్న అనసూయ ఇన్ని మందితో ఇన్ని మాటలు అనుకుంటూ వెళ్లడం అవసరమా తులసి ఆగిపోవచ్చు కదా అని అంటుంది. ఇప్పుడు ఆగిపోతే వీళ్ళందరి మాటలు నిజం చేసినట్టు ఉంటుంది అత్తయ్య నేను వెళ్ళాలి అని చెప్పి అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న శృతి వాళ్లతో నా జడ బానే ఉంది కదా అని అంటుంది తులసి. అప్పుడు దివ్య వచ్చి సెంటు కొడుతుంది. అప్పుడు తులసి సంతోషంగా బయటికి వెళుతుంది. మిగిలిన వాళ్ళు కుల్లుకుంటారు. తర్వాత సామ్రాట్ తులసి కార్లో వెళ్తూ ఉండగా సామ్రాట్ తులసితో, మీకు బోర్ కొట్టడం లేదా.
ఇలా ప్రతిరోజు ఇన్ని మందితో ఇన్ని మాటలు అనిపించుకుంటునన్నారు హాయిగా ఇక్కడ నుంచి బయటకు వచ్చేయొచ్చు కదా అని అనగా, ఇంటి నుంచి బయటకు వచ్చి ఏం చేస్తాం సామ్రాట్ గారూ అయినా ఇల్లు అనేది అందమైన కారాగారం లాంటిది. ఎన్ని అనుకున్నా సాయంత్రం అయ్యేసరికి అక్కడికే వెళ్లాలి ప్రేమలు ఉంటేనే గొడవలు ఈర్షలు ఉంటాయి మేము గొడవ పడడానికైనా నలుగురం కలిసి ఒక దగ్గర కూర్చుంటాము కొన్ని మంది ఇళ్లల్లో ప్రశాంతంగా ఉన్నా ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు దానికన్నా నాకు ఇదే ఇష్టం అని అనగా మీరు నా గురించి అంటున్నారని సామ్రాట్ అంటాడు. లేదండి నేను ఏదో ఊరికినే చెప్పాను అని అనగా, మా ఇంట్లో వాతావరణం మీరు చెప్పినట్టు ఉంటుంది ఎవరుకి ఎవరితో సరిగ్గా మాటలు ఉండవు నాకు మీ కుటుంబంలో రావాలని ఆనందంగా ఉన్నది అని సామ్రాట్ అంటాడు.
ఆ తర్వాత సీన్లో అనసూయ హాల్లో కూర్చుని జరిగిన విషయం గురించి బాధపడుతూ ఉండగా లాస్య అక్కడికి వచ్చి, మీరు ఎందుకు అలా ఉన్నారు అత్తయ్య మీరు ఒకప్పుడు నన్ను ఎలా నిలదీసే వారు. చంప మీద కొట్టే అంత గట్టిగా మాట్లాడేవారు తులసి దగ్గర ఎందుకు అంత నెమ్మదైపోతున్నారు మీ పాతదనాన్ని బయటకి తెండి. అయినా మీరు భయపడుతున్నారు ఎందుకు తులసిని ఏమైనా అంటే అది మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపించేస్తుందనా? ఊరు వాళ్ళందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు నేను మిమ్మల్ని బానే చూసుకుంటాను కానీ ఒకవేళ మీ ఇంటి నుంచి వస్తే కాలనీలో మీ పరువు పోతుంది. బయట మీ గురించి,తులసి గురించి డిబేట్లేస్తున్నారు అని అంటుంది. దానికి అనసూయ నిజంగానా అయితే ఇప్పుడు నుంచి తులసి గురించి గట్టిగా ఆలోచించాలి అని అనసూయ అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ తులసి పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా మళ్లీ 5 గంటల ప్రయాణం చేయాలి అని తులసి అంటుంది.
తప్పదు కదా అని వాళ్ళు దారిలో వెళ్తూ ఉండగా పక్కన ఒక గుడిని చూసి కార్ ఆపుతారు. అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉండగా సామ్రాట్ తులసి తో, ఏ ప్రాజెక్ట్ అయినప్పుడు అయినా మేము గుడికి వస్తాము అంతా మంచే జరుగుతుంది అని అంటాడు. అప్పుడు దేవుని మొక్కుకుంటూ తులసి, ఈ ప్రాజెక్ట్ బాగా జరగాలి ఇది నా కల సంగీతం స్కూల్ బాగా తయారవ్వాలి అని కోరుకుంటుంది. అప్పుడు సామ్రాట్ మనసులో, తులసి గారి కల నిజమవ్వాలి అని కోరుకుంటున్నాను ఆవిడ ఎంతో కష్టపడుతున్నారు అనుకొని అలాగ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ప్రసాదం తింటారు.
ఆ తర్వాత సీన్లో దివ్య నందు క్యారమ్స్ ఆడుతూ ఉండగా నందు ధ్యాస ఎక్కడో ఉంటుంది. అప్పుడు దివ్య, మీరు ఏంటి డాడ్ ఆడడం లేదు. చాలా రోజులైంది మీతో కేరమ్స్ ఆడి అని పిలిస్తే పట్టించుకోవడం లేదు అని అనగా అదే సమయంలో అంకిత వచ్చి అమ్మమ్మ రండి భోజనం చేద్దాము అని అంటుంది. నాకేం ఆకలిగా లేదు నేను. ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు కదా అని అనగా అంకిత, ఈరోజు తినకపోతే మీ నీరసం వస్తుంది అమ్మమ్మ అని అంటుంది. మనిషినైతే పోను కదా అని అనసూయ కోపంగా అనగా దివ్య,నేను వస్తాను వదిన నాకు బాగా ఆకలేస్తుంది.
ఏం కూర అని అనగా అమ్మమ్మకి ఇష్టమని ఆంటీ గుత్తొంకాయ చేశారు అని అంటుంది. అనసూయ కి నోరూరుతుంది. అమ్మమ్మ కి పాపం తినలేని పరిస్థితి వచ్చిందే అమ్మమ్మ వాట కూడా నేనే తినేస్తాను వాళ్లకు అదృష్టం లేదు నాకు రాసిపెట్టి ఉన్నది అని ఆనందంగా వెళుతుంది దివ్య. అప్పుడు అనసూయ కూడా భోజనానికి వెళుతుండగా లాస్య ఆపి , చూశారా అత్తయ్య తను మీకు ఇష్టం లేని పని చేసినందుకు మీరు ఎక్కడ కోప్పడతారని లంచం ఇచ్చినట్టు మీకు నచ్చిన కూర చేసింది అని అనగా, లంచం ఇస్తే మారిపోయే దాన్ని కాదు నేను అని అనసూయ అంటుంది.
ఆ తర్వాత సీన్లో సామ్రాట్ తులసి గుడి లో కొంచెం సేపు కూర్చొని ఉంటారు. అప్పుడు తులసి నవ్వుతూ మాట్లాడుతూ ఎప్పుడో చిన్నప్పుడు మా స్నేహితులతో ఇలా మనస్పూర్తిగా మాట్లాడేదాన్ని మళ్లీ మీతో మాట్లాడుతున్నాను అని అంటుంది. ఇంతలో పక్కనే ఉన్న అమ్మాయిలు సామ్రాట్ ని చూసి, ఎంత పొడుగ్గా ఉన్నారో పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉన్నారు. ఆ గడ్డం ఎంత బాగున్నదో ఇలాంటి వాడు నా దగ్గర జీవితానికి వస్తే ఈ గుడిలో ఇప్పటికిప్పుడే మూడు ముళ్ళు కట్టించుకుంటాను అని అనగా, ఆ మాటలు విన్న తులసి నవ్వుకుంటూ ఉంటుంది. సామ్రాట్ సిగ్గుతో తలదించేసుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!