MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: మాజీ భర్తని కిడ్నాప్ చేసిన లాస్య.. ఆఖరి నిమిషంలో ఎంట్రీతో షాకిచ్చిన శేఖర్?

Intinti Gruhalakshmi: మాజీ భర్తని కిడ్నాప్ చేసిన లాస్య.. ఆఖరి నిమిషంలో ఎంట్రీతో షాకిచ్చిన శేఖర్?

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. మాజీ భర్తని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక మాజీ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Navya G
Published : Jun 08 2023, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఎపిసోడ్ ప్రారంభంలో తులసి నందు కేసుని రీ ఓపెన్ చేసిందని తెలుసుకొని లాస్య.. నేను నందు జీవితంతో ఆడుకోవాలి అనుకుంటే తనేమిటి నా జీవితంతో ఆడుకుంటుంది అని చిరాకు పడుతుంది. ఇంతలో లక్కీ ఫోన్ చేసి సెలవులకి ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తావు అని అడుగుతాడు. కొంచెం పని ఉంది వీలు చూసుకుని ఫోన్ చేస్తాను అంటుంది లాస్య.
 

210

అందుకే నేను వేరే ఆప్షన్ చూసుకున్నాను తులసి ఆంటీ ఫోన్ చేసింది నేను తనతో వెళ్ళిపోతాను అంటాడు లక్కీ. తను ఎందుకు నీకు ఫోన్ చేసింది అని అడుగుతుంది లాస్య. తెలియదు కానీ నాన్న గురించి అడిగింది నాకు తెలిసింది చెప్పాను అంటాడు లక్కీ. వెంటనే ఫోన్ పెట్టేస్తుంది లాస్య. లాస్యని తలుచుకొని బాధపడతాడు లక్కీ. ఆ తర్వాత మాజీ భర్తకి ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావో లొకేషన్ షేర్ చెయ్యు నీతో మాట్లాడాలి అని గోముగా అడిగి అడ్రస్ తెలుసుకుంటుంది లాస్య.
 

310

మరోవైపు లాస్య మాజీ భర్త శేఖర్ ని వెతుకుతూ ఉంటారు తులసి, దీపక్. ఇక దివ్య ప్రవర్తనకి బాధపడుతూ ఉంటాడు విక్రమ్. అప్పుడే విక్రమ్ వాళ్ళ తాతయ్య వచ్చి ఎందుకు దివ్య ని అపార్థం చేసుకుంటున్నావు తన స్వభావం నీకు తెలియనిది కాదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఊహించని దివ్యని తను అమ్మని అపార్థం చేసుకుంటుంది అంటూ దివ్య గురించి ఏవేవో చెప్తాడు విక్రమ్.
 

410

మీ అమ్మ ప్రేమని నీ దగ్గరే ఉంచుకో అది మీ భార్యాభర్తల బంధానికి అడ్డు కాకూడదు. నిన్ను నమ్మి ఈ ఇంటికి వచ్చిన దివ్యని ఒంటరిగా వదిలేయకు వెళ్లి తనతో మాట్లాడు. తను ఏం చెప్పిందో విను ఈ విధంగా ఈ ఇంట్లో నేను మాత్రమే చెప్పగలను మరెవ్వరూ ఇలా చెప్పరు. ప్రేమిస్తే గుడ్డిగా ప్రేమిస్తావు అనుమానిస్తే గుడ్డిగా అనుమానిస్తావు అంటూ మనవడికి చివాట్లు పెట్టి వెళ్ళిపోతాడు తాతయ్య.
 

510

మరోవైపు లాస్య తన మాజీ భర్త దగ్గరికి వచ్చి నువ్వు చాలా మంచి వాడివి వదులుకొని తప్పు చేశాను. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని అతని భుజం మీద తలవాలుస్తుంది. నువ్వు నా మీద ప్రేమతో రాలేదు అంటూ నందు సంగతి అంతా చెప్తాడు శేఖర్. నువ్వు నా దగ్గర లేకపోయినా నీ ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉంది. ఇప్పుడు ముసుగు తీసి నిజం మాట్లాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు ఏం కావాలి అని అడుగుతాడు శేఖర్.

610

అతను మాట్లాడుతూ ఉండగానే మత్తుమందు అతని ముక్కు దగ్గర పెట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. తన మనుషుల్ని పిలిచి కిడ్నాప్ చేయించి రేపు సాయంత్రం వరకు ఇతన్ని కదలనియకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది లాస్య. మరోవైపు  తల్లి దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు విక్రమ్. ఏమీ లేదు నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు అంటుంది రాజ్యలక్ష్మి.
 

710

అదేంటక్క నువ్వు చెప్పవు, నన్ను చెప్పనీయవు అంటూ ఇంట్లో పెద్ద కోడలు అడుగుపెట్టిన వేళా విశేషం మంచిది కాదంట అదే మీ అమ్మ ప్రాణానికే గండమంట అని చెప్తాడు బసవయ్య. ఒక్కసారిగా షాక్ అవుతాడు విక్రమ్. పంతులుగారు ఏవో పూజలు చేయమన్నారు అని చెప్పారు కదా అవి ఏంటో చెప్పండి నేను చేస్తాను అంటాడు. చేయవలసింది నువ్వు కాదు నీ పెళ్ళాం.. తనేమో అలిగి ఆ గదిలో కూర్చుంది. పూజలు చేస్తుందో చేయదో అంటూ అమాయకంగా మొఖం పెడతాడు బసవయ్య.

810

అది నేను చూసుకుంటాను అంటూ దివ్య దగ్గరికి బయలుదేరుతాడు విక్రమ్. మన పని అయిపోయింది అక్కయ్య తాంబూలాలు ఇచ్చేసాము ఇంకా ఆ మొగుడు పెళ్ళాలు తన్నుకు చావటమే మిగిలింది అని ఆనందపడతాడు బసవయ్య. మరోవైపు నందు దగ్గరికి వెళ్లిన లాస్య ఓపెన్ చేయించింది. గట్టి సాక్షిని కూడా సంపాదించుకుంది కానీ ఆ సాక్షి ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాడు.
 

910

ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను చెప్పినట్లు విను అంటుంది లాస్య. ఈ మాటలు విన్న నందు కోపంతో రగిలిపోతాడు. నిన్ను లాగి కొట్టాలని ఉంది కానీ కొట్టలేను మరెప్పుడు నన్ను కలవడానికి రావొద్దు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. మరోవైపు శేఖర్ దొరకకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు తులసి, దీపక్. సాక్షిని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే మళ్లీ కేసు రీ ఓపెన్ చేయడం జరగదు అని చెప్పారు కదా అన్నయ్య అంటూ కంగారు పడతాడు దీపక్.
 

1010

ఇంతలో భాగ్య ఫోన్ చేసి లాస్య తన మాజీ భర్తను తానే కిడ్నాప్ చేసిందని కానీ ఎక్కడ దాచిందో తెలియదని చెప్తుంది. తరువాయి భాగంలో మీరు చెప్పే కబుర్లు వినటానికి కోర్టుకు టైం లేదు కేసుని  మూసి వేస్తున్నట్లుగా జడ్జి చెబుతూ ఉండగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు శేఖర్.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
Recommended image2
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
Recommended image3
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved