- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: సాక్ష్యాలతో నిజం నిరూపించిన తులసి.. లాస్యకి సపోర్టు ఇవ్వనున్న రాజ్యలక్ష్మి?
Intinti Gruhalakshmi: సాక్ష్యాలతో నిజం నిరూపించిన తులసి.. లాస్యకి సపోర్టు ఇవ్వనున్న రాజ్యలక్ష్మి?
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. భర్తని రెండవ భార్య ఆగడాల నుంచి రక్షించుకున్న ఒక మాజీ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నందు కోర్టు కేసు విషయం చెప్తుంది రాజ్యలక్ష్మి. నాకు ఖాళీ లేదు తనకి ఇష్టమైతే వెళ్ళమనండి నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. దివ్య వైపు గర్వంగా చూస్తూ వాడు ఎప్పటికీ నా కొడుకే నీకు మొగుడు కాలేడు అంటూ పొగరుగా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. దివ్య కూడా ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఏంటక్కా ఉప్పు నిప్పులా ఉండే నందు,లాస్య కలిసి కాపురం చేయబోతున్నారా ఇది ఎలా సాధ్యం అని అడుగుతాడు బసవయ్య. పీక మీద కత్తి పెడితే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే అదే లాస్య గొప్పతనం అంటుంది రాజ్యలక్ష్మి. సీన్ కట్ చేస్తే కోర్టులో దివ్య, తులసి పక్కపక్కన కూర్చుంటారు. మనం కోర్టుకి ఎందుకు వచ్చామమ్మ నాన్నకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికా అని బాధగా అడుగుతుంది దివ్య.
నువ్వు ఎప్పుడూ చెప్తావు కదా కాస్త లేట్ అయినా న్యాయమే గెలుస్తుందని మరి ఎందుకమ్మా నాన్న ఓడిపోతున్నారు. ఎందుకు నువ్వు చూస్తూ ఊరుకున్నావు ఆయనని వదిలేసావా అని తల్లిని విడదీస్తుంది. అడిగిన వాళ్ళకి సలహా ఇస్తే విలువ ఉంటుంది అడగకుండా సలహా ఇస్తే సలహా ఇచ్చిన వాళ్ళకి కూడా విలువ పోతుంది అంటుంది తులసి. ఇదంతా చూస్తున్న లాస్య నవ్వుకుంటుంది.
తులసమ్మని తక్కువ అంచనా వేయకండి అమ్మ ఆవిడ ఓటమిని అంత త్వరగా ఒప్పుకోరు అంటుంది రాములమ్మ.ఏడ్చి ఏడ్చి దివ్య గొంతు ఆరిపోయి ఉంటుంది కాస్త మంచినీళ్లు ఇవ్వు అని రాములమ్మకి చెప్తుంది లాస్య. ఈలోగానే నందు వాటర్ బాటిల్ తీసుకువచ్చి దివ్యకి ఇచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటాడు. అదేంటమ్మా నందు బాబు అక్కడ కూర్చున్నారు అంటుంది రాములమ్మ. ఇప్పటి నుంచే నా పక్కన కూర్చుంటే కుళ్ళుకొని చేస్తారు కాసేపే కదా కూర్చొని అంటుంది లాస్య.
ఇంతలో జడ్జిగారు వచ్చి మీకు ఇచ్చిన నెల రోజులు గడువు ముగిసింది మీ మనసులు మారాయా లేకపోతే డైవర్స్ కి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతాడు. నా మనసు మారలేదు సార్ నా ఆఖరి ఊపిరి ఉన్నంతవరకు నా భర్తతోనే ఉండాలని నా ఆశ ఈ తాళిబొట్టు లాగే నా భర్తను కూడా నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంటుంది లాస్య. మరి నీ సంగతి ఏంటి నందగోపాల్ అని అడుగుతారు జడ్జి.
నందు ఏదో మాట్లాడే లోపు అతని నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు ఇప్పటికీ విడాకులే కోరుకుంటున్నాడు అని చెప్తాడు మాధవి భర్త మోహన్. ఒక్కసారిగా లాస్యతో పాటు నందు కూడా షాక్ అవుతాడు. అదేంటి నా నిర్ణయం చెప్పిన తర్వాత కూడా మోహన్ ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు నందు. అతని భార్యతో కలిసి ఉండటానికి సిద్ధపడిన మాట నిజమే కానీ అందుకు బలమైన కారణం ఉంది ఆమె తనతో కలిసి ఉండకపోతే నందు తల్లిదండ్రులను చంపేస్తాను అంటూ బెదిరించింది అంటాడు మోహన్.
అలాంటిదేమీ లేదు సార్ కావాలంటే మా ఇంటి పనిమనిషి రాములమ్మని అడగండి తను ఇంటికి నమ్మకమైన మనిషి అంటుంది లాస్య. రాములమ్మని బోనులోకి పిలిచి నిజం చెప్పమంటాడు జడ్జి. ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది రాములమ్మ. నందు బాబుని చాలా టార్చర్ పెట్టారు. ఆ ముసలి వాళ్లకి టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అందుకు నేనే సాక్ష్యం అంటుంది రాములమ్మ. ఒక్కసారి గా రాములమ్మ ప్రవర్తనకి షాక్ అవుతుంది లాస్య.
తను అబద్ధం చెప్తుంది సార్ ఆమె మాటలు నమ్మొద్దు అంటుంది. ఆమె చెప్పిన మాటలు నిజం అనటానికి సాక్ష్యం ఏమిటి అంటాడు జడ్జి. నా దగ్గర సాక్ష్యం ఉంది అంటూ తన ఫోన్లో తీసిన వీడియో చూపిస్తుంది తులసి. ఒకసారి నీ భర్త మీద ఫేక్ గృహహింస కేసు పెట్టి ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నావు. నువ్వు చాలా డేంజరస్ అంటూ లాస్య ఎంత బ్రతిమాలుతున్నా వినిపించుకోకుండా నందుకి విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు.అందరూ ఎంతో సంతోషిస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఎంతో ఆనంద పడిపోతుంది దివ్య.
ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అంటుంది తులసి. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న రోజు ఇది. మా నాన్నని మాకు కాకుండా చేసింది. ఇప్పుడు ఆ పీడ విరగడ అయిపోయింది అంటుంది దివ్య. ఇదంతా చూస్తున్న లాస్య కోపంతో రగిలిపోతుంది. తరువాయి భాగంలో నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణమైన ఏ ఒక్కరిని ప్రశాంతంగా ఉండనివ్వను అని రాజ్యలక్ష్మి కి ఫోన్ చేసి చెప్తుంది లాస్య. అందుకు నా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది అంటుంది రాజలక్ష్మి.