- Home
- Entertainment
- Intinti Gruhalashmi: డైరెక్టుగా శృతి పనిచేసే ఇంటికి వెళ్లిన ప్రేమ్.. మరోసారి అవమానంగా ఫిల్ అయిన నందు!
Intinti Gruhalashmi: డైరెక్టుగా శృతి పనిచేసే ఇంటికి వెళ్లిన ప్రేమ్.. మరోసారి అవమానంగా ఫిల్ అయిన నందు!
Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అనసూయ (Anasuya) నువ్వు టీచర్ అయిపోయావ్ అంటూ తులసి (Tulasi)కి చెబుతుంది. ఇక తన సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్ ను చూపిస్తుంది. ఇక తులసి ఆ పిల్లలకి ఈ రోజు సాయంత్రం రండి అని చెబుతుంది. ఇక అనసూయ ఈ రోజు ఇద్దరు పిల్లలు మొదలయింది.
రేపు వందమంది స్టూడెంట్స్ తో పెద్ద సంగీత కళాశాల గా మారిపోతుంది అంటూ ఇంట్లో హడావిడి చేస్తోంది. మరో వైపు శృతి (Shruthi) ప్రేమ్ ను టైం కి తినమని చెబుతుంది. ఇక ప్రేమ్ ఎంత సేపు తిండి గోలేనా.. మాట్లాడుకోవడానికి ఇంకేమి లెవా అని అడుగుతాడు. ప్రేమ్ (Prem) ఇంట్లో కూర్చొని నాకు బోర్ కొడుతుంది అని అంటాడు.
పద నేను కూడా నీతో పాటు వచ్చి మీ ఆఫీస్ వరకూ డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఇక శృతి (Shruthi) ఇప్పుడు ప్రేమ్ నాతో వస్తే నా బండారం మొత్తం బయట పడి పోతుంది అని టెన్షన్ పడుతుంది. ఇక వెళుతున్న క్రమంలో శృతి స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను నువ్వు వెళ్ళు ప్రేమ్ (Prem) అని అంటుంది.
ఇక నందు, లాస్య (Lasya) లు ఒక కంపెనీకి జాబ్ కోసం వెళ్తారు. అక్కడ నందుకు ప్రోగ్రామర్ జాబ్ ఆఫర్ చేస్తారు. దానిని నందు (Nandhu) అవమానంగా ఫీల్ అయ్యి నాకు ఇంత కర్మ పట్టలేదు అంటూ బైటకు వచ్చేస్తాడు. మరోవైపు శృతి ప్రేమ్ పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో పని మనిషిగా చేస్తుంది.
ఇక ప్రేమ్ (Prem) తన ఓనర్ దగ్గరికి తిరిగి జాయిన్ అవ్వడానికి వెళతాడు. అదే ఇంటిలో ఉన్న శృతి (Shruthi) ప్రేమ్ ను చూసి ఆశ్చర్యపోతుంది. ఇక ఓనర్ ప్రేమ్ ను నానా రకాలుగా అవమానించి పంపించేస్తాడు. ఇదంతా శృతి కనిపెడుతుంది. మరోవైపు తులసి హడావిడిగా ఇంటి పనులు చేసి సంగీతం ప్రాక్టీస్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది.
ఇక తరువాయి భాగం లో లాస్య (Lasya) ఫ్రెండ్ లాస్య కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి నిరాకరిస్తుంది. దాంతో లాస్య తన ఫ్రెండ్ మారిపోవడానికి కారణంగా తులసి (Tulasi) అని బ్లేమ్ చేస్తుంది. దాంతో లాస్య, తులసి ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతుంది.