MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • SIP Investment: రూ.2,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో లఖ్‌పతి అయ్యే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ అస్సలు మిస్ అవ్వకండి!

SIP Investment: రూ.2,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో లఖ్‌పతి అయ్యే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ అస్సలు మిస్ అవ్వకండి!

SIP Investment: నెలకు రూ.2,000 ఎస్‌ఐపీ (SIP) ద్వారా కూడా మీరు లక్షాధికారి కావచ్చు. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని మన డబ్బు ఇక్కడ సేఫ్‌గా పెరుగుతుంది. పూర్తి కాలిక్యులేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 01 2026, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
SSIP Investment: నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మీ అకౌంట్‌లో లక్షకు పైగా బ్యాలెన్స్ !
Image Credit : Gemini

SSIP Investment: నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మీ అకౌంట్‌లో లక్షకు పైగా బ్యాలెన్స్ !

సాధారణంగా చాలా మంది డబ్బును ఆదా చేయడానికి చిన్న మొత్తాల్లో ఎస్‌ఐపీ వైపు మొగ్గు చూపుతుంటారు. దీని వల్ల క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటవుతుంది. స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ఎస్‌ఐపీల్లో రిస్క్ చాలా తక్కువ.

మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని మన డబ్బు ఇక్కడ సేఫ్‌గా పెరుగుతుంది. అయితే, చాలా మంది మైండ్‌లో ఒక డౌట్ ఉంటుంది. నెలకు కేవలం రూ.2,000 చొప్పున ఎస్‌ఐపీ చేస్తే, ఎన్ని సంవత్సరాలలో లక్షాధికారి అవ్వొచ్చు? ఆర్థిక నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.2,000 ఎస్‌ఐపీ కాలిక్యులేషన్స్
Image Credit : Gemini AI

రూ.2,000 ఎస్‌ఐపీ కాలిక్యులేషన్స్

మీరు నెలకు రూ.2,000తో మీ ఎస్‌ఐపీ జర్నీని స్టార్ట్ చేశారనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్‌లో యావరేజ్‌గా 12 శాతం రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్‌ఐపీ క్యాలిక్యులేటర్ లెక్కల ప్రకారం.. మీరు 4 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే, నాలుగో ఏడాది ముగిసే సమయానికి మీ చేతికి ఏకంగా రూ.1,23,670 అందుతాయి. అంటే కేవలం 4 సంవత్సరాలలోనే మీరు లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని వెనకేయవచ్చు.

35
ఇన్వెస్ట్‌మెంట్ పూర్తి లెక్కలు ఇవే
Image Credit : Asianet News

ఇన్వెస్ట్‌మెంట్ పూర్తి లెక్కలు ఇవే

ఈ 4 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి గణాంకాలను పరిశీలిస్తే.. మీరు ప్రతి నెలా రూ. 2,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ద్వారా 4 సంవత్సరాల కాలపరిమితిలో మీ మొత్తం పెట్టుబడి రూ. 96,000 అవుతుంది. దీనిపై 12 శాతం అంచనా రిటర్న్ రేట్ ప్రకారం మీకు లభించే లాభం రూ. 27,670 గా ఉంటుంది. అంటే, మీ పెట్టుబడి కాలం ముగిసేసరికి మీకు లభించే మొత్తం రిటర్న్స్ అక్షరాలా రూ. 1,23,670 అన్నమాట. ఈ లెక్కన చూస్తే, కేవలం 4 సంవత్సరాల షార్ట్ టర్మ్‌లోనే మీరు ఈజీగా లక్షాధికారి కావచ్చు. ఈ లెక్కల ప్రకారం మీ పెట్టుబడి పెంచితే తక్కువ కాలంలోనే కోటీశ్వరులు కూడా కావచ్చు. 

45
ఎస్‌ఐపీ ప్రారంభించడానికి ఏం కావాలి?
Image Credit : Gemini

ఎస్‌ఐపీ ప్రారంభించడానికి ఏం కావాలి?

మీరు కూడా ఎస్‌ఐపీ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే.. ఏదైనా సెబీ రిజిస్టర్డ్ బ్రోకింగ్ యాప్ లేదా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించవచ్చు. మీరు ఎంచుకున్న ప్లాట్‌ఫామ్‌లో డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తిగా పేపర్‌లెస్, డిజిటల్‌గా జరిగిపోతుంది. అకౌంట్ ఓపెన్ అయ్యాక, మీ బడ్జెట్‌కు తగ్గ మంచి మ్యూచువల్ ఫండ్‌ను సెలెక్ట్ చేసుకుని, నెలకు కనీసం రూ.500తో కూడా ఎస్‌ఐపీని ప్రారంభించవచ్చు.

కావలసిన డాక్యుమెంట్లు ఇవే

• పాన్ కార్డ్

• ఐడీ ప్రూఫ్

• అడ్రస్ ప్రూఫ్

• బ్యాంక్ అకౌంట్

• మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ

55
తర్వాత ఎస్‌ఐపీ లిమిట్ పెంచవచ్చా?
Image Credit : Gemini AI

తర్వాత ఎస్‌ఐపీ లిమిట్ పెంచవచ్చా?

చాలా మంది కెరీర్ స్టార్టింగ్‌లో రూ.500 లేదా రూ.1,000తో ఎస్‌ఐపీ ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెడతారు. భవిష్యత్తులో జీతం పెరిగినా లేదా ఆర్థిక పరిస్థితి మెరుగైనా ఈ ఎస్‌ఐపీ అమౌంట్‌ను పెంచుకోవచ్చా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. దీనికి సమాధానం.. ఎస్, కచ్చితంగా పెంచుకోవచ్చు.

మీ అవసరాన్ని బట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ మంత్లీ ఎస్‌ఐపీ లిమిట్‌ను పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి నెలా కరెక్ట్ టైమ్‌కి ఎస్‌ఐపీ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ కట్ అయ్యేలా చూసుకోవాలి. లేకపోతే పెనాల్టీ పడే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
Flex Fuel అంటే ఏంటి? ఈ కొత్త ఫ్యూయల్ తో లాభాలు, నష్టాలు ఇవే!
Recommended image2
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved