MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Laila : 30 సెకన్లు కూడా నవ్వు ఆపుకోలేని వింత వ్యాధి, లైలాకు నవ్వే శాపమైందా?

Laila : 30 సెకన్లు కూడా నవ్వు ఆపుకోలేని వింత వ్యాధి, లైలాకు నవ్వే శాపమైందా?

ఒకప్పుడు తన నవ్వుతోనే కుర్రాళ్ల మనసులు దోచేసిన హీరోయిన్ లైలా, ఇప్పుడు అదే నవ్వు వల్ల ఇబ్బంది పడుతున్నారు. 30 సెకన్లు కూడా నవ్వు ఆపుకోలేని ఓ వింత ఆరోగ్య సమస్యతో ఆమె బాధపడుతున్నారట.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 25 2026, 09:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నవ్వంటే లైలా.. లైలా అంటే నవ్వు
Image Credit : Asianet News

నవ్వంటే లైలా.. లైలా అంటే నవ్వు

90వ దశకం చివరి నుంచి.. 10 ఏళ్ల పాటు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. లైలా.. తన నవ్వుతో, బుగ్గసొట్టలతో కట్టిపడేసింది హీరోయిన్. తెలుగులో శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, వెంకటేష్ లాంటి స్టార్స్ తో నటించి.. తమిళంలో సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది లైలా. సౌత్ లో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది బ్యూటీ. 

లైలా అంటే ఎవరికైనా ఆమె నవ్వే గర్తుకు వస్తుంది. ఒకప్పుడు ఆమెకు వరంగా మారిన నవ్వే ఇప్పుడు శాపంగా మారిందంటే నమ్మగలరా?8 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక ఈమధ్య కాలంలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది లైలా. కానీ ఇప్పుడు ఓ వింత వ్యాధి కారణంగా లైలా తన నవ్వును 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పైలట్ అవ్వాలనుకుని యాక్టర్‌గా
Image Credit : Asianet News

పైలట్ అవ్వాలనుకుని యాక్టర్‌గా

1980లో గోవాలోని ఓ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన లైలాకు చిన్నప్పుడు పైలట్ అవ్వాలని పెద్ద కోరిక ఉండేది. కానీ, వాళ్ల అమ్మకు మాత్రం తన కూతురును వెండితెరపై చూడాలని ఆశ. అమ్మ కోరిక మేరకు, కేవలం 15 ఏళ్ల వయసులోనే లైలా మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. యాడ్స్‌లో నటించడం మొదలుపెట్టింది. 'దుష్మన్ దునియా కా' అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన లైలా.. మొదటి సినిమాతో ప్లాప్ ను ఫేస్ చేసింది.

Related Articles

Related image1
Udaya Bhanu : నన్ను తొక్కేశారు, ఇండస్ట్రీలో ఎదగనివ్వలేదు.. యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్
Related image2
Sreeleela: పాటలు హిట్టు, సినిమాలు ఫట్టు... శ్రీలీలకు ఏమైంది? బాలీవుడ్‌లో నూ తప్పని బ్యాడ్ లక్
36
తెలుగు సినిమాతో లైలాకు బ్రేక్..
Image Credit : Asianet News

తెలుగు సినిమాతో లైలాకు బ్రేక్..

బాలీవుడ్ లో సక్సెస్ దొరక్క పోవడంతో లైలా సౌత్ ఇండస్ట్రీ వైపు చూసింది. టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.వి. కృష్ణారెడ్డి 'ఎగిరే పావురమా' కోసం ఆమెను సెలెక్ట్ చేశారు. ఆ సినిమా హిట్‌తో లైలా జాతకమే మారిపోయింది. ఇక్కడ ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. తెలుగులో శ్రీకాంత్ జోడీగా 'ఎగిరే పావురమా' సినిమాతో పెద్ద బ్రేక్ అందుకున్న లైలా.. ఆతరువాత వరుసగా పెళ్లి చేసుకుందాం రా', 'ఖైదీ గారు' లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. తమిళంలో హీరో సూర్యతో ఆమె కెమిస్ట్రీకి పిచ్చ క్రేజ్ ఉండేది. సూర్యతో చేసిన సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

46
విక్రమ్ ఛాలెంజ్.. బయటపడ్డ షాకింగ్ నిజం!
Image Credit : Asianet News

విక్రమ్ ఛాలెంజ్.. బయటపడ్డ షాకింగ్ నిజం!

ఒకానొక టైంలో సూర్యతో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని కూడా రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో, ఐటమ్ సాంగ్స్, సపోర్టింగ్ రోల్స్‌కు పరిమితమయ్యింది లైలా. ఆమె జీవితంలో మరో విచిత్రమైన విషయం ఏంటంటే, ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. 'లైలా జీవితంలో విచిత్రమైన సమస్య 'శివపుత్రుడు' సినిమా షూటింగ్ టైంలో బయటపడింది. ఈ సినిమాలో విక్రమ్, సూర్యతో కలిసి లైలా నటించారు. సెట్స్‌లో లైలా ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండటాన్ని హీరో విక్రమ్ గమనించారు. ఓ రోజు ఆయన సరదాగా ఓ ఛాలెంజ్ విసిరారు. "కేవలం ఒక్క నిమిషం పాటు నవ్వకుండా ఉండు చూద్దాం" అని అన్నారు.

56
30 సెకన్లు కూడా నవ్వకుండా ఉండలేకపోయిన లైలా..
Image Credit : Asianet News

30 సెకన్లు కూడా నవ్వకుండా ఉండలేకపోయిన లైలా..

విక్రమ్ ఛాలెంజ్ ను తీసుకున్న లైలా 30 సెకన్లు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. నవ్వును బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె కళ్లలోంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. అప్పుడు అందరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అది కేవలం ఆమె అలవాటు కాదని, అదొక మెడికల్ కండిషన్ అని తెలిసింది. 

దీన్నే 'పెథలాజికల్ లాఫింగ్' (Pathological Laughter) అంటారు. ఈ కండిషన్‌లో ఉన్నవాళ్లు తమ ఎమోషన్స్‌పై, ముఖ్యంగా నవ్వుపై కంట్రోల్ కోల్పోతారు. సీరియస్ సందర్భాల్లో కూడా వీళ్లు నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడతారు. లైలా విషయంలోనూ అదే జరిగింది. ఆమె నవ్వు ఆమెకు వరం కాదు, ఒక రకమైన ఆరోగ్య సమస్యగా మారింది.

66
లైలా పెళ్లి.. సెకండ్ ఇన్నింగ్స్
Image Credit : Asianet News

లైలా పెళ్లి.. సెకండ్ ఇన్నింగ్స్

లైలా 2006లో ఇరాన్‌కు చెందిన వ్యాపారవేత్త మెహదీని పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంటకు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెళ్లి తర్వాత చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న లైలా, ఈ మధ్యే కార్తి నటించిన 'సర్దార్' సినిమాతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఇప్పటికీ అదే అమాయకమైన నవ్వుతో అభిమానులను పలకరిస్తున్నారు. కానీ ఆ నవ్వు వెనుక ఇంత కథ ఉందని చాలా మందికి తెలియదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Related Stories
Recommended image1
Udaya Bhanu : నన్ను తొక్కేశారు, ఇండస్ట్రీలో ఎదగనివ్వలేదు.. యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్
Recommended image2
Sreeleela: పాటలు హిట్టు, సినిమాలు ఫట్టు... శ్రీలీలకు ఏమైంది? బాలీవుడ్‌లో నూ తప్పని బ్యాడ్ లక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved