MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Udaya Bhanu : నన్ను తొక్కేశారు, ఇండస్ట్రీలో ఎదగనివ్వలేదు.. యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్

Udaya Bhanu : నన్ను తొక్కేశారు, ఇండస్ట్రీలో ఎదగనివ్వలేదు.. యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్

స్టార్ యాంకర్ ఉదయభాను వెరమరుగు అవ్వడానికి కారణం ఏంటి? సడెన్ గా ఆమె ఫీల్డ్ నుంచి ఎందుకు మాయమయ్యింది. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఎవరు? ఉదయ భాను వెల్లడించిన సంచనల నిజాలేంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 25 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఉదయభానును ఇండస్ట్రీలో తొక్కేశారా?
Image Credit : Facebook / Udaya Bhanu

ఉదయభానును ఇండస్ట్రీలో తొక్కేశారా?

ఇప్పుడంటే బుల్లితెరపై సుమ స్టార్ యాంకర్ గా వెలుగు వెలుగుతుంది కానీ.. సుమకంటే ముందు ఆ రేంజ్ లో దూసుకుపోయింది ఉదయభాను. ఆమె తెరపై కనిపిస్తే.. వన్స్ మోర్ అంటూ విజిల్స్ పడేవి. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకన్న ఉదయ భాను.. సడెన్ గా ఎందుకు కనిపించలేదు. ఆమె తెరమరుగు అవ్వడానికి కారణం ఎవరు? ఉదయ భానును ఇండస్ట్రీలో తొక్కేశారా? అవకాశాలు రాకుండా చేశారా? ఈ విషయంలో ఉదయభాను ఏమన్నారు? గతంలో ఆమె మాట్లాడిన సంచలన కామెంట్స్ సంగతేంటి?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
బుల్లితెర మహారాణి ఉదయభాను
Image Credit : Facebook / Udaya Bhanu

బుల్లితెర మహారాణి ఉదయభాను

ఒకప్పుడు టెలివిజన్ లో యాంకర్ అంటే ఉదయభాను మాత్రమే కనిపించేది. ఆమె జోరు ఆడియన్స్ ను ఉర్రూతలూగించేది. మరీ ముఖ్యంగా వన్స్ మోర్ ప్లీజ్ అంటూ.. వేణుమాధవ్ తో కలిసి ఆమె చేసిన షో బాగా పాపుల్ అయ్యింది. ఈ షో వస్తే జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. పదుల సంఖ్యలో టీవీ షోలు చేసిన ఉదయభాను.. ఆడియన్స్ లో తన మాటలతో జోష్ నింపేది.

 బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ఈ అందాల యాంకరమ్మ ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. వన్స్ మోర్ ప్లీజ్ తరువాత రేలా రె రేలా, ఢీ , సాహసం చేయరా డింభకా, నువ్వు నేను.. ఇలా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌తో మెప్పించిన ఆమె, కొన్ని సినిమాల్లో కూడా నటించి అలరించింది.

Related Articles

Related image1
Bachelor Heroes: ప్రభాస్ నుంచి రామ్ పోతినేని వరకు.. టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు ఎవరంటే?
Related image2
Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?
37
సడెన్ గా మాయమైన స్టార్ యాంకర్..
Image Credit : Instagram/Udaya Bhanu

సడెన్ గా మాయమైన స్టార్ యాంకర్..

యాంకర్ గా మంచి ఫామ్ లో ఉండగానే ఉదయభాను సడెన్ గా కనిపించడం మానేసింది. ఒక్క కార్యక్రమంలో కూడా ఆమె కనిపించలేదు. ఎటువెళ్లింది.. ఏమయ్యిందని అభిమానులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఆతరువాత సుమ, ప్రదీప్, అనసూయ, శ్రీముఖి, రష్మి, రవి, లాస్య.. ఇలా చాలామంది యాంకర్స్ బుల్లితెరను ఏలారు. 

ప్రిరిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్, ఎందులో చూసినా వీరే కనిపించారు. ఉదయభాను మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆతరువాత దాదాపు ఐదేళ్ళకు చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మళ్లీ ఉదయభాను కనిపించడం స్టార్ట్ చేసింది. ఆమె ఇన్నాళ్లు ఎటు వెళ్లింది.. ఎందుకు కనిపించలేదు అనే ప్రశ్న మాత్రం అభిమానుల్లో అలాగే ఉండిపోయింది.

47
ఉదయభాను సంచలన కామెంట్స్
Image Credit : Youtube print shot/Telugu 360

ఉదయభాను సంచలన కామెంట్స్

రీసెంట్ గా ఉదయభాను మళ్లీ యాక్టీవ్ అయ్యింది. టీవీ షోలు, పబ్లిక్ ఈవెంట్స్ తో పాటు.. కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించింది. అంతే కాదు తను ఇన్నాళ్లు కనిపించకపోవడంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయభాను మాట్లాడుతూ.. '' నాకు ప్రతీ కన్నీటి చుక్క విలువ తెలుసు, ప్రతీ గుండె కోత తెలుసు.. ప్రశ్నించే గళాలు ఎప్పుడు అణచివేయబడతాయి అనడానికి నేను కూడా ఒక ఉదాహరణ. నేను ముక్కుసూటిగా మాట్లాడతా.... ఉన్నది ఉన్నట్టు చెపుతా.. ఎవరిని లెక్క చేయను, పిచ్చి వేశాలు వేస్తే లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను, అందుకే నేనంటే నచ్చనివాళ్లు నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేశారు. నన్ను ఎదగకుండా తొక్కేశారు. కానీ ఎంత తొక్కితే అంత స్పీడ్ గా పైకి వస్తా. ఇన్ని రోజులు నేను ఎందుకు కనిపించలేదో తెలుసా.. గత ఐదేళ్లుగా నన్ను మీరు ఏ కార్యక్రమలో అయినా చూశారా.. ఇన్నాళ్లు నేను కనిపించకపోయినా.. మీరు మాత్రం నన్ను గుండెళ్లో పెట్టుకున్నారు. అది చాలు నాకు.. ఎవరు నన్ను ఏం చేయలేరు'' అని ఓ పబ్లిక్ ఈవెంట్ లో వెల్లడించారు. ఇక ఆతరువాత ఓ సినిమా ఈ వెంట్ లో కూడా ఉదయభానుకు ఇదే ప్రశ్న ఎదురయ్యింది.

57
వెండితెరపైకి ఉదయభాను రీ ఎంట్రీ
Image Credit : our own

వెండితెరపైకి ఉదయభాను రీ ఎంట్రీ

రీసెంట్ గా ఉదయభాను ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాతో వెండితెరమీదకు రీ ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమాలో ఉదయభాను ఇంపార్టెంట్ రోల్ చేశారు. . ఈ సినిమాలో కట్టప్ప సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట తో పాటు మరికొందరు స్టార్స్ నటించగా.. మూవీ రిలీజ్ అయ్యి.. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ టైమ్ లో ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో ఉదయభానుకు ఓ ప్రశ్న ఎదురయ్యింది. గతంలో మీరు కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. యాంకర్స్ ను తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో అని. అది నిజమా అని అడిగారు.

 దానికి ఉదయభాను సమాధానం చెపుతూ.. " అది కచ్చితంగా నిజమే అండీ.. నేను నిజమైతేనే మాట్లాడుతాను. ఈ విషయం ఏ యాంకర్ ను అడిగినా పర్సనల్ గా చెపుతారు. కాని ఇప్పుడు అంతా సైలెంట్ గా ఉన్నారు కానీ.. ప్రతీ ఒక్కరికి తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు ఇది మాట్లాడటానికి సందర్భం కాదు.. సినిమా గురించి మాట్లాడుకుందాం ప్లీజ్ '' అంటూ ఉదయభాను అన్నారు. దాంతో ఉదయభానును తొక్కెయ్యడానికి చూసింది ఎవరు అని అందరు ఆలోచనలో పడ్డారు.

67
టాలీవుడ్ లో పాపులర్ యాంకర్స్..
Image Credit : Facebook / Udaya Bhanu

టాలీవుడ్ లో పాపులర్ యాంకర్స్..

ఈమధ్య కాలంలో యాంకర్స్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరమీద రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. అలాగే అనసూయ, రష్మీ, శ్రీముఖి, స్రవంతి తో పాటు ప్రదీప్, రవి, సుడిగాలి సుధీర్, ఇలా ఇంకొంతమంది యాంకర్స్ కూడా పాపులర్ అయ్యారు. వారు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే బుల్లితెరపై వీరందరికంటే ఎక్కువగా పేరు తెచ్చుకున్న ఉదయభాను మాత్రం కెరీర్ లో ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. ఒకప్పుడు ఉదయభానుకు ఉన్నఅభిమానులు, ఇమేజ్, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

77
యూట్యూబర్ గా మారిపోయిన స్టార్ యాంకర్
Image Credit : Facebook / Udaya Bhanu

యూట్యూబర్ గా మారిపోయిన స్టార్ యాంకర్

యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీలు,యాంకరింగ్ ఫీల్డ్ లో వెన్నుపోట్ల వల్ల కెరీర్ దెబ్బతిన్నది. దాంతో చిన్నగా బుల్లితెరకు కూడా దూరమయ్యింది. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి.. అందులో రకరకాల వీడియోలతో సందడి చేస్తోంది. తన ఫ్యామిలీ, పిల్లలతో పర్సనల్ వ్లాగ్స్ చేస్తూ, వంటల వీడియోలు చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇండస్ట్రీలో యాక్టీవ్ అవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image2
Madhuri Dixit Dance Numbers: మాధురీ డ్యాన్స్‌తో హిట్టైన 6 సినిమాలు.. అప్పట్లోనే కోట్ల కలెక్షన్లు!
Recommended image3
KD Movie Review: కేడీ మూవీ రివ్యూ.. ధృవ సర్జా, సంజయ్‌ దత్‌ మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Bachelor Heroes: ప్రభాస్ నుంచి రామ్ పోతినేని వరకు.. టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు ఎవరంటే?
Recommended image2
Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved