- Home
- Entertainment
- `లూసిఫర్ 2` టీజర్ హైలైట్స్.. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబో మూవీ టీజర్ ఎలా ఉందంటే?
`లూసిఫర్ 2` టీజర్ హైలైట్స్.. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబో మూవీ టీజర్ ఎలా ఉందంటే?
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో వస్తున్న మరో మూవీ `ఎల్2ఈః ఎంపురాన్` టీజర్ విడుదలైంది. మరి ఇది ఎలా ఉంది? ఇందులో హైలైట్స్ ఏంటో చూద్దాం.

మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన `లూసిఫర్` మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈమూవీని తెలుగులో `గాడ్ ఫాదర్`గా రీమేక్ చేశారు చిరంజీవి. ఇక్కడ కూడా ఇది మంచి ఆదరణ పొందింది. ఈ మూవీకి సీక్వెల్‌ని తీసుకొస్తున్నారు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్. `ఎల్2 ఈ ఎంపురాన్`(లూసిఫర్ 2) పేరుతో దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తాజాగా టీజర్ విడుదలైంది. తాజాగా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
టీజర్‌లో ఏం చూపించారంటే.. ఖురేషి ఉండే టౌన్ నార్త్ ఇరాక్‌లో విజువల్స్‌ను చూపించటం ద్వారా టీజర్ మొదలైంది. ఏదో ఒకరోజు నీ చుట్టూ ఉన్న వాళ్లందరూ మోసగాళ్లు అనిపించినప్పుడు, ఈ నాన్న లేకుంటే.. నిన్ను ఆదుకోగలిగినవాడు ఒక్కడే ఉంటాడు. అతడే స్టీఫెన్ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో హీరో మోహన్ లాల్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఈ యుద్ధం మంచికి, చెడుకి కాదు. చెడుకి, చెడుకి మధ్య, అనే మరో డైలాగ్‌తోపాటు జగదీష్ స్టీఫెన్ హిందువులకు తను మహిరావణుడు, ముస్లింలు ఇబ్లిస్ అని పిలుస్తారు.. క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరుంది.. లూసిఫర్ అనే డైలాగ్ హీరో ఎంత పవర్‌ఫుల్లో అనేది ఎలివేట్ చేశారు. హీ ఈజ్ కమింగ్ బ్యాక్ అనే డైలాగ్ తర్వాత మోహన్ లాల్ లుక్‌ను రివీల్ చేశారు.
ఖురేషి అబ్రామ్ అని మోహన్ లాల్ తన మరో పేరుని రవీల్ చేయటం, మిలటరీ వాళ్లు స్టీఫెన్‌ను టార్గెట్ చేయటం, దిస్ డీల్ విత్ డెవిల్ అని మోహన్ లాల్ చెప్పటం.. ఒక్క మాట భాయ్ జాన్, నేను ఎదురు చూస్తున్నాను అని చివరో పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పే డైలాగ్, దానికి తగ్గట్టుగా ఉన్న విజువల్స్ ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా మోహన్‌లాల్ ఎంట్రీ సీన్ ఆద్యంతం స్టయిలీష్‌గా ఉంది. మరోవైపు ఆయన గన్ ఎక్కుపెట్టి కాల్చే తీరు కూడా అంతే స్టయిలీష్‌గా ఉంది. టీజర్ చూస్తుంటే. `మార్కో` తరహాలోనే ఇది కూడా మాఫియా బ్యాక్ డ్రాఫ్ స్టయిలీష్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది.
`లూసిఫర్` మూవీ పాలిటిక్స్ డ్రామాగా సాగుతుంది. కానీ ఇది పూర్తి యాక్షన్‌గా సాగబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో విజువల్, బీజీఎస్ అదిరిపోయింది. మోహన్ లాల్ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
`లూసిఫర్` కంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా, గూజ్ బమ్స్ వచ్చేలా సన్నివేశాల ఉన్నాయి. ఇంకా ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు మరోసారి వారి పాత్రలతో మెప్పించబోతున్నారని తెలుస్తుంది. మురళీ గోపి కథను అందించిన ఈ చిత్రానికి దీపక్ దేవ్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ వావ్ అనిపిస్తున్నాయి.
మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనే ఈ మూవీకి దర్శకుడు అనే విసయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఈ చిత్రంతో సుభాస్కరన్ మలయాళంలోకి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో పాన్ ఇండియా మూవీగా మార్చి 27న విడుదల చేయబోతున్నారు.
also read: బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు, పద్మభూషణ్ పురస్కారంపై స్పందించని నాగ్?