MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: వేద, యష్ లను మిస్ అవుతున్న ఖుషి.. దగ్గరవుతున్న వేద, యష్?

Ennenno Janmala Bandham: వేద, యష్ లను మిస్ అవుతున్న ఖుషి.. దగ్గరవుతున్న వేద, యష్?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 23 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 23 2022, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ రోజు ఎపిసోడ్లో ఖుషి తన గదిలోకి వెళ్లి అక్కడ వేద లేకపోవడంతో బాధగా బెడ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఖుషి, యష్ వేసుకునే షర్ట్, వేద కట్టుకునే సారి తీసుకుని వచ్చి మంచంపై వేసి వాటి మధ్యలో పడుకుంటుంది. ఇందులో సులోచన మాలిని ఇద్దరు అక్కడికి వచ్చి అది చూస్తూ ఉంటారు. అప్పుడు ఖుషి ఆ బట్టలతో మాట్లాడుకుంటూ డాడీ నువ్వు మమ్మీకి కోపం తెప్పించడం లేదుగా మీరు అక్కడికి వెళ్లినా కూడా ఇలాగే పొట్లాడుకుంటుంన్నారా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. మీరిద్దరూ లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా అని బాధపడుతూ ఉంటుంది ఖుషి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు ఖుషి మాటలు విన్న సులోచన, మాలిని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మరొకవైపు వేదవాళ్లు వంట చేయడానికి కూరగాయలు కట్ చేస్తుండగా యష్, రాజా ఇద్దరు పోటీపడి మరి చెస్ గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు రాజా ,యష్ ని చెస్ గేమ్ లో ఓడిస్తాడు. అప్పుడు రాజారాణి జోకులు వేసి అందరినీ నవ్విస్తూ ఉంటారు. అప్పుడు వేద కూడా యష్ ని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు వేద వాళ్ళ అక్క సువాసిని గురించి అడిగే వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వేద సువాసినీ కొడుకు గురించి గొప్పలు చెబుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటుంది.

37

అప్పుడు పిల్లల గురించి మాట్లాడుతూ రాణి ఆ అమ్మవారి దయవల్ల  నీకు కూడా ఒక పాప బాబు పుడితే చాలా బాగుంటుంది అనడంతో వేద, యష్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు వేద కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు వేద మూడు మార్చడానికి యష్ కావాలనే కాఫీ తీసుకొని వస్తావా అని అడగడంతో సరే అని వేద లోపలికి వెళుతుంది. ఇప్పుడు వేద లోపలికి వెళ్లి ప్రేమగా కాఫీ కలుపుకొని తీసుకువస్తుంది. తర్వాత వేదా కాఫీ తీసుకొని వచ్చి రాణి తో మాట్లాడుతూ కన్ఫ్యూజన్ లో తీయని కాఫీ రాజాకి షుగర్ లెస్ కాఫీ యష్ ఇస్తుంది.

47

అప్పుడు రాజా ఇన్ని రోజులు మీ నానమ్మ చేత్తో కాఫీ తాగి బోర్ కొట్టేసింది ఈరోజు నా మనవరాలు చేస్తే తీయని కాఫీ తాగాల్సిందే అని అంటాడు. అప్పుడు యష్ కూడా వేదని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు ఒక్కసారిగా కాఫీ తాగి షాక్ అవ్వడంతో ఏమయింది ఇద్దరు అలాగే ఉండిపోయారు అని అంటుంది వేద. అప్పుడు రాజా, యష్ ఇద్దరు ఆ కాఫీ తాగి పొగుడుతూ ఉంటారు. అప్పుడు వేద, రాణి ఇద్దరు ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు. అమ్మమ్మ వారిద్దరి ప్రవర్తన చూస్తే ఏదో తేడాగా ఉంది చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు కదా అని అంటుంది వేద..
 

57

 అప్పుడు రాణి, వేద ఇద్దరూ అక్కడికి వెళ్లి ఆ కాఫీ ఎలా ఉందో నేను కూడా చూస్తాను ఇటు ఇవ్వు అని రాజా చేతిలో ఉన్న కాఫీ ని లాక్కుంటుంది రాణి. అప్పుడు రాణి ఆ కాఫీ తాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వేదమ్మ ఏంటిది తాత తాగే కాఫీలో ఇంత షుగర్ వేశావు అని అడగగా మరి షుగర్ లేస్ కాపీ అనడంతో నాకు వచ్చింది అని నవ్వుతూ చెబుతాడు యష్. అప్పుడు వేద సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ వేద బాధపడకూడదని కవర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వేద సారీ తాతయ్య పొరపాటున ఒకరికి ఇవ్వాల్సిన కాపీ ఇంకొకరికి ఇచ్చాను అని అంటుంది.
 

67

 అప్పుడు యష్ నీది కాదు పొరపాటు మాదే గేమ్ ఆడుతూ కాఫీల కప్పులు తప్పుగా తీసుకున్నాము అని అంటాడు. అప్పుడు యష్ ఏదైనా కానీ నీ చేత్తో ఇచ్చిన అదే నాకు అమృతంలా ఉంటుంది అని అంటాడు. అప్పుడు రాజా యష్ ని పొగుడుతూ శభాష్ మనవడా నువ్వు నాకు నచ్చావు అని అంటాడు. ఎందుకంటే నా మనవరాలు అని నేను ఏమీ అనడం లేదు కానీ నీ స్థానంలో ఎవరైనా ఉంటే కొంచెం ఉప్పు కారం తక్కువైనా కూడా ఎంతమంది ఉన్న భార్యలను అవమానిస్తూ తిడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం ఆ పని చేయకుండా వేదని కాపీ చేసినందుకు పొగిడావు అని మెచ్చుకుంటూ ఉంటాడు రాజా. అప్పుడు రాజారాణి ఇద్దరు భార్యాభర్తల బంధం గురించి చెబుతూ ఉంటారు.
 

77

మరొకవైపు సులోచన ఆనందంతో మాలిని దగ్గరికి రావడంతో సులోచన అంత ఆనందంగా ఉన్నావు అని అడగగా నా ఆనందానికి కారణము యష్,వేద అని అంటుంది. వారిద్దరి కలిసి ముగ్గు వేశారు అనడంతో సులోచన ,మాలిని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఖుషి అక్కడికి వచ్చి ఏంటి మీరు చెప్తున్నది నిజమేనా అని అంటుంది. ఇప్పుడు సులోచన వీడియో చూపించడంతో మాలిని ఖుషి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు మాలిని కూడా ఒక వీడియో చూపించడంతో అది చూసి ఖుషి సులోచన ఇద్దరు సంతోష పడుతూ ఉంటారు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan Team Salary: 'జన నాయగన్' స్టార్ల రెమ్యూనరేషన్‌... విజయ్‌ కి హైయ్యెస్ట్, మిగిలిన వారికి ఎంతంటే?
Recommended image2
Balakrishna: పనిగట్టుకొని బాలయ్యతో ఫ్లాప్‌ మూవీ తీసిన ఎన్టీఆర్‌.. ఎన్బీకే రియాక్షన్‌కి డైరెక్టర్‌ ఫ్యూజుల్ ఔట్
Recommended image3
Vijay Devarakonda: ఆ రెండు సినిమాలు ఎందుకు ఆగిపోయాయి? ఆ మూవీస్ చేసుంటే విజయ్ దేవరకొండ ఫూచర్ ఎలా ఉండేది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved