- Home
- Entertainment
- Kuberaa Movie Review: ధనుష్, నాగార్జున అదరగొట్టారు, కుబేర సినిమా అద్భుతం, కానీ ఆ ఒక్కటే డౌట్
Kuberaa Movie Review: ధనుష్, నాగార్జున అదరగొట్టారు, కుబేర సినిమా అద్భుతం, కానీ ఆ ఒక్కటే డౌట్
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీ స్టారర్ మూవీ కుబేర. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా ప్రీమియర్స్ ను చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను ఎక్స్ పేజ్ లో రివ్యూల రూపంలో ఇస్తున్నారు. మరి ఈసినిమాపై ఆడియన్స్ ఫస్ట్ రివ్యూ ఏంటంటే?

క్లాసిక్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్మల, ఫస్ట్ టైమ్ తెరకెక్కించిన పక్కా కమర్షియల్ మల్టీ స్టారర్ మూవీ కుబేర. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాఈ రోజు (జూన్ 20) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతోంది. ఇక ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమా కలెక్షన్లు కూడా అంతే రాబడుతుందని నమ్మకంతో ఉన్నారు టీమ్. ఇక ఈసినిమా పై ట్విట్టర్ లో జనాలు ఏమంటున్నారంటే?
కుబేర సినిమాకు పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్స్ చేసిన ధనుష్, నాగార్జున,రష్మిక పాత్రలపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్. ఎక్స్ వేదికగా వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఈక్రమంలో ధనుష్ పర్ఫామెన్స్ గురించి ఎక్కువ పోస్ట్ లు ఎక్స్ లో దర్శనం ఇస్తున్నాయి. డైలాగ్స్ మీద మంచి గ్రిప్ తో, పాత్రలో లీనమై, ధనుష్ చూపించిన నటన అద్భుతం అని పొగుడుతున్నారు ఆడియన్స్. ఈసినిమాలో ఆయన నటనకు 100 మార్కులు పడ్డట్టే అని అర్ధం అవుతోంది.
ఈమధ్య కాలంలో వచ్చిన ధనుష్ సినిమాలన్నింటిలో.. కుబేర సినిమాలో ఇచ్చిన పెర్ఫామెన్స్ అలా నిలిచిపోతుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈసినిమాతో ఖచ్చితంగా ధనుష్ అవార్డ్ కొడతారని కొందరు తమ అభిప్రయాలు వెల్లడిస్తున్నారు.
ఇక సినిమా స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉందంటున్నారు నెటిజన్లు. స్క్రీన్ ప్లే సినిమాకు ప్రాణం, ఆ స్క్రీన్ ప్లే పై పాజిటీవ్ రెస్పాన్స్ వస్తే సినిమా హిట్ అయినట్టే. కుబేర మూవీ ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. ఈసినిమా సూపర్ హిట్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. కుబేర మూవీ చాలా బాగుంది. థియేటర్ లో చూడటం మాత్రం మిస్ అవ్వకండి అని రాసుకొచ్చాడు. మరీ ముఖ్యంగా ధనుష్, నాగార్జున పెర్ఫామెన్స్ సూపర్ అంటూ ట్వీట్ చేశాడు.
ఇక ఈసినిమాకు ధనుష్ పాత్ర ఎంత ముఖ్యమో నాగార్జున పాత్ర కూడా అంతే ముఖ్యం. కుబేర సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ పై కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఆయన పాత్ర ఈ సినిమాలో సైలెన్స్ పవర్ లా పనిచేస్తుందని అంటున్నారు ట్విట్టర్ జనాలు.
కింగ్ పెర్ఫామెన్స్ గురించి వేరే చెప్పాలా అద్భుతంగా ఉంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఇంట్రవెల్ నుంచి నాగార్జున పాత్ర రెచ్చిపోతుంది. అది ఎలా ఉంటుందంటే సెకండ్ పార్ట్ లో నాగార్జున పాత్ర, ఆయన పెర్ఫామెన్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే, అంత అద్భుతంగా చేశారంటూ మరో ట్విట్టర్ అభిమాని వెల్లడించారు.
అంతే కాదు ధనుష్ కు పోటీలా కాకుండా సినిమాకు ప్లాస్ అయ్యేలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు నాగార్జున. ఆయన చేసిన పాత్రల్లో కుబేర ఓ డిఫరెంట్ రోల్ అవుతుంది. ఎక్కడా నాగార్జున స్థాయిని తగ్గించకుండా అద్భుతమై రోల్ క్రియేట్ చేశారు శేఖర్ కమ్ముల.
తమిళ్ లో ధనుష్ సినిమాలు 200 కోట్లు దాటింది లేదు. ఈ సినిమా అక్కడ 300 కోట్లు రాబడుతుందని ఓ అభిమాని ట్వీట్ చేశారు. ఫస్ట్ 300 కోట్ల సినిమా, ధనుష్ ఆస్కార్ లెవల్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటూ ట్వీట్ చేశారు. కుబేర సినిమా అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది అనేలోగా సెకండ్ హాఫ్ అంతకు మించి తెరకెక్కించారు అంటూ ట్వీట్ చేశారు. ఈసినిమాపై తమిళ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వారిని సంతోషపెట్టేలా ఈసినిమా ఉన్నట్టు ట్విట్టర్ రివ్యూస్ చూస్తుంటే అర్ధం అవుతుంది.
ఇక ఈసినిమాలో రష్మిక పాత్ర గురించి కూడా ట్వీట్ చేస్తున్నారు సినిమా లవర్స్. ఈమూవీ సక్సెస్ కు థర్డ్ లేయర్ రష్మిక పెర్ఫామెన్స్ నిలిచిందన్నారు ఓ ట్వీట్టర్ యూసర్ . ఆమె పెర్ఫామెన్స్ పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక దేవిశ్రీ మ్యూజిక్ పై పెద్దగా క్రేజ్ కనిపించడంలేదు. ఈసినిమాలో మ్యూజిక్ అంత అద్భుతంగా అనిపించలేదన్న విమర్ష కూడా వినిపిస్తుంది. ఈసినిమాకు పాజిటీవ్ రివ్యూస్ మాత్రమే కాదు, అతి తక్కువగా నెగెటీవ్ రివ్యూస్ కూడా వచ్చాయి. ఈసినిమా లైన్ బాలేదంటూ కొందరు విమర్శించడం మొదలు పెట్టారు.
కుబేర సినిమా సింగిల్ లైన్ స్టోరీ, శేఖర్ కమ్ముల డైరెక్షన్ బాలేదు, ఇలా చేస్తాడు అనుకోలేదు, కాని ధనుష్ పర్ఫామెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది అని ట్వీట్ చేశారు ఓ నెటిజన్. అంతే కాదు దేవిశ్రీ మ్యుజిక్ అయితే అస్సలు బాలేదు. కొట్టిన ట్యూన్స్ నే మళ్ళీ మళ్లీ కొడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చాలా ఘాటుగానే వినిపిస్తున్నాయి.
అంతే కాదు ఈసినిమాపై పనికట్టుకుని నెగెటీవ్ ప్రచారం చేయడానికి ఓ బ్యాచ్ దిగిందంటూ కొన్ని పోస్ట్ లు ట్వీట్టర్ లో కనిపిస్తున్నాయి. కావాలని సినిమా రిలీజ్ కు ముందే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారంటూ.. కొన్నిఫేక్ పోస్ట్ లను ట్విట్టర్ లో చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఓవర్ ఆల్ గా చూసుకుంటే ట్విట్టర్ లో ఆడియన్స్ ఇచ్చిన రివ్యూ ప్రకారం కుబేర సినిమా వారికి బాగా నచ్చింది.
కానీ ఈ సినిమా మ్యూజిక్ పైనే డౌట్. దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యుూజిక్ డైరెక్టర్ గురించి ఎవరు గొప్పగా చెప్పలేదు. ఈసినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ప్లాస్ అవుతుందా, మైనస్ అవుతుందా..? ఇక లాంగ్ రన్ లో ఈసినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.