MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టికెట్ ధరలు పెంచేందుకు 'కుబేర' చిత్ర యూనిట్ నో.. అదిరిపోయే స్ట్రాటజీ

టికెట్ ధరలు పెంచేందుకు 'కుబేర' చిత్ర యూనిట్ నో.. అదిరిపోయే స్ట్రాటజీ

ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కుబేరా జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 15 2025, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్
Image Credit : Asianet News

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్

ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కుబేరా జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది. అయితే కుబేర చిత్ర యూనిట్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా భారీ బడ్జెట్ లో రూపొందిన చిత్రాల కోసం నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు టికెట్ ధరల పెంపు కోసం అప్లై చేస్తారు. అయితే కుబేర చిత్ర యూనిట్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల వద్ద టికెట్ ధర పెంపు కోసం ప్రత్యేక జీవోలు (GOs) కోరడం లేదట. 

25
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే టికెట్ ధరలు 
Image Credit : Kubera team

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే టికెట్ ధరలు 

ఇటీవల కాలంలో టికెట్ ధరల పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే “కుబేరా చిత్ర యూనిట్ టికెట్ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

Related Articles

Related image1
కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం
Related image2
బాలకృష్ణ డ్యూయెల్ రోల్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ పాత్ర మొత్తం మార్చేశారు
35
టికెట్ ధరల వివరాలు 
Image Credit : Social Media

టికెట్ ధరల వివరాలు 

ప్రస్తుతం ప్లాన్ ప్రకారం, నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు ₹250 నుండి ₹295 మధ్య ఉండగా, సింగిల్ స్క్రీన్‌లలో ₹150 నుండి ₹200 వరకు ఉండే ఉన్నాయి. దీనితో కుబేర చిత్రం కోసం సాధారణ టికెట్ ధరలనే కొనసాగించనున్నారు.   

45
కుబేర బడ్జెట్ 
Image Credit : Twitter

కుబేర బడ్జెట్ 

ఈ చిత్రం నిర్మాణానికి ₹120 కోట్లకుపైగా ఖర్చు చేసినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం తొలి వీకెండ్ లో వచ్చే వసూళ్ల కంటే లాంగ్ రన్ లో వచ్చే వసూళ్లే కీలకం అని భావిస్తోంది. టికెట్ ధరలు సాధారణ స్థితిలో ఉండడంవల్ల ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

55
కుబేర మూవీ రన్ టైమ్
Image Credit : Google

కుబేర మూవీ రన్ టైమ్

ఈ చిత్రానికి దాదాపు 3 గంటల 10 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, కథనంలో ఎంగేజ్‌మెంట్ ఉంటుందని బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే విడుదలై హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టికెట్ ధర పెంపు లేకుండానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కుబేరా బృందం కూడా అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎగ్జిబిటర్‌గా పేరు తెచ్చుకుని, ఇప్పుడు నిర్మాతగా మారిన సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం పరిశ్రమలో వేగంగా పెరుగుతున్న టికెట్ ధరలపై సరికొత్త చర్చని లేవనెత్తింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లాఠీ ట్రీట్, బెంగళూరులో ఏం జరిగింది?
Recommended image2
చిరంజీవికి ఎక్కువ డైలాగ్స్ లేకున్నా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ కెరీర్ మార్చేసిన మూవీ?
Recommended image3
Top 5 Female Villains: గ్లామర్‌తో కాదు, క్రూరత్వంతో అదరగొట్టారు.. విలన్లుగా మారిన బెస్ట్ టాప్‌ 5 హీరోయిన్లు వీరే
Related Stories
Recommended image1
కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం
Recommended image2
బాలకృష్ణ డ్యూయెల్ రోల్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ పాత్ర మొత్తం మార్చేశారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved