MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ డ్యూయెల్ రోల్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ పాత్ర మొత్తం మార్చేశారు

బాలకృష్ణ డ్యూయెల్ రోల్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ పాత్ర మొత్తం మార్చేశారు

బాలకృష్ణ నటించాల్సిన చిత్రం వెంకటేష్ చేతుల్లోకి వెళ్ళింది. వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఆ చిత్రం కూడా ఒకటని తెలుసా.. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 15 2025, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలయ్య చిత్రం వెంకటేష్ చేతుల్లోకి..
Image Credit : Asianet News

బాలయ్య చిత్రం వెంకటేష్ చేతుల్లోకి..

ఒక హీరో నుంచి మరో హీరో చేతుల్లోకి కథలు మారడం టాలీవుడ్ లో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనే నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ మధ్య జరిగింది. శ్రీరాములయ్య, యమజాతకుడు, ఆయుధం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు ఎన్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలయ్యతో పరిచయం
Image Credit : our own

బాలయ్యతో పరిచయం

ఆయన దర్శకత్వంలోనే విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జయం మనదేరా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందుగా బాలకృష్ణ తో చేయాలని ఎన్.శంకర్ అనుకున్నారట. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే బాలయ్యతో పరిచయం ఉందని శంకర్ తెలిపారు. ఆ టైంలోనే ఏదైనా కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని బాలయ్య అడిగేవారు అని తెలిపారు.

Related Articles

Related image1
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తో పెళ్లి ? రూమర్స్ పై అనిరుధ్ రియాక్షన్ ఇదే
Related image2
కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం
35
డ్యూయెల్ రోల్ లో బాలకృష్ణ
Image Credit : Asianet News

డ్యూయెల్ రోల్ లో బాలకృష్ణ

అప్పటికే జయం మనదేరా స్టోరీ లైన్ నా మైండ్ లో ఉంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో ఆ చిత్ర కథ రాసుకున్నా. కానీ బాలయ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఆయనతో కలిసి పనిచేయడం కుదరలేదు. ఇంతలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని రామోజీరావు గారికి ఒక కథ చెప్పాను. ఆయనకి కథ నచ్చింది. హీరోగా ఎవరిని అనుకుంటున్నారు అని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పాను.

45
పవన్ కళ్యాణ్ తో కుదర్లేదు
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ తో కుదర్లేదు

వెళ్లి పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను. ఆయనకి కూడా కథ నచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు కూడా కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇంతలో సురేష్ బాబు గారు.. వెంకటేష్ కోసం ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగారు. వెంటనే బాలకృష్ణ కోసం రాసుకున్న కథనే వెంకటేష్ తో చేద్దామని అనుకున్నా. ముందుగా రాసుకున్న కథలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాలి. ఒక పాత్రలో ఫారెన్ లో ఉండే పోలీసు అధికారిగా కనిపిస్తారు. కానీ వెంకటేష్ కి పోలీస్ అధికారి లాంటి సీరియస్ పాత్ర సెట్ అవ్వదని ఆ పాత్రని టూరిస్ట్ గైడ్ గా మార్చాను.

55
వెంటనే షూటింగ్ మొదలు పెట్టమన్న రామనాయడు
Image Credit : Asianet News

వెంటనే షూటింగ్ మొదలు పెట్టమన్న రామనాయడు

ఆ తర్వాత రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్ ముగ్గురికి కథ వినిపించాను. కథ అద్భుతంగా ఉంది వెంటనే షూటింగ్ మొదలు పెట్టమని రామానాయుడు గారు తెలిపారు. ఆ విధంగా జయం మనదేరా చిత్రం రూపొందినట్లు ఎన్ శంకర్ తెలిపారు. ఈ చిత్రంలో సౌందర్య, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. 2000 సంవత్సరంలో విడుదలైన చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
దగ్గుబాటి వెంకటేష్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Related Stories
Recommended image1
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తో పెళ్లి ? రూమర్స్ పై అనిరుధ్ రియాక్షన్ ఇదే
Recommended image2
కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved